వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: 5 ఏళ్ళ కనిష్టానికి ఈపీఎఫ్ వడ్డీ రేట్లు

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ సేవింగ్స్‌పై చెల్లించే ఈపీఎప్‌ఓ వడ్డీరేటు ఐదేళ్ళ కనిష్ట స్థాయికి చేరింది. ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.55 శాతంగా ఉంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్ణయించిన వడ్డీరేటుకు ఆర్ధిక మంత్రిత్వ శాఖ గురువారం నాడు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.

ఉద్యోగస్తుల ప్రావిడెంట్ ఫండ్ సేవింగ్స్‌పై చెల్లించే ఈపీఎప్‌ఓ వడ్డీరేటు ఐదేళ్ళ కనిష్టానికి చేరుకొంది. గతేడాది కంటే ఈ వడ్డీ రేటు 10 బేసిస్‌ పాయింట్లు తక్కువ. గతేడాది ఈ వడ్డీరేటు 8.65 శాతంగా ఉండేది.

EPFO interest rate for 2017-18 at 5-yr-low of 8.55%; FinMin clears proposal

ప్రస్తుతం ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో సుమారు 200 మిలియన్ల మంది ఉన్నారు. వడ్డీరేట్లపై ఈపీఎఫ్‌ఓ సెంట్రల్‌ బోర్డు ట్రస్టీలు తీసుకున్న నిర్ణయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిందని సీనియర్‌ కార్మిక మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. అనధికారికంగా కొన్ని సూచనలు చేసినట్టు పేర్కొన్నారు.

కార్మిక​, ఉద్యోగవకాశాల మంత్రిత్వ శాఖ సహాయమంత్రి సంతోష్‌ గంగ్వార్‌ ఆధ్వర్యంలో ఈపీఎఫ్‌ఓ ట్రస్టీలు ఏప్రిల్‌ 21న సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో ఈపీఎఫ్‌ఓ వడ్డీరేటు 8.65 శాతంగా నిర్ణయించారు.

గతేడాది ఈ రేటు 8.65 శాతంగా, 2015-16లో 8.8 శాతంగా, 2013-14, 2014-15లలో 8.75 శాతంగా ఉన్నాయి. గత కొన్నేళ్ల నుంచి పీపీఎఫ్‌లపై చెల్లించే వడ్డీరేట్లను ఈపీఎఫ్‌ఓ తగ్గిస్తోంది.

English summary
The finance ministry on Thursday approved for 2017-18 an interest rate of 8.55 per cent on provident fund savings administered by the Employees’ Provident Fund Organisation (EPFO) for around 200 million formal sector workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X