వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: పీఎఫ్ వడ్డీరేట్లలో కోతకు యోచన, 8.65 కంటే తక్కువ వడ్డీ?

పీఎఫ్ ఖాతాదారులకు షాక్ కల్గించే వార్తే ఇది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి భవిష్యనిధి ఖాతాపై ఇస్తున్న 8.65శాతం వడ్డీని మరింత తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పీఎఫ్ ఖాతాదారులకు షాక్ కల్గించే వార్తే ఇది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి భవిష్యనిధి ఖాతాపై ఇస్తున్న 8.65శాతం వడ్డీని మరింత తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. పీఎప్ ఖాతాలపై 8.65 వడ్డీని మరింత తగ్గించేందుకు ఈపీఎఫ్ఓ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

శుభవార్త: ఈక్విటీల్లో 15% పీఎఫ్, లాభం కోసమిలా 3 ఏళ్ళు ఇలా..శుభవార్త: ఈక్విటీల్లో 15% పీఎఫ్, లాభం కోసమిలా 3 ఏళ్ళు ఇలా..

ఉద్యోగుల పీఎఫ్ డిపాజిట్లపై గతంలో కంటే తక్కువ వడ్డీ దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే వడ్డీ రేటును తగ్గించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయనే సమాచారం.

పీఎఫ్ ఖాతాల చందాదారుల డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయమై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందంటున్నారు.

 పీఎప్ వడ్డీ రేట్లలో కోత?

పీఎప్ వడ్డీ రేట్లలో కోత?

ఉద్యోగ భవిష్యనిధి సంస్థ 4.5కోట్ల మంది సభ్యుల ఆశలపై నీళ్లు చల్లేలా కన్పిస్తోంది.2016-17 ఆర్థిక సంవత్సరానికి భవిష్యనిధి ఖాతాపై ఇస్తున్న 8.65శాతం వడ్డీని మరింత తగ్గించే అవకాశం ఉందని సమాచారం. చందాదారుల ఖాతాల్లో ‘ఎక్స్ఛేంజి ట్రేడెడ్‌ ఫండ్‌'(ఈటీఎఫ్‌)లను జమ చేయాలని నిర్ణయించింది. వచ్చే మార్చి చివరి నాటికి చందాదారులందరూ తమ ఖాతాలకు ఎన్ని ఈటీఎఫ్‌ యూనిట్లు వచ్చాయో చూసుకునే వీలును కూడా కల్పించనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇస్తున్న వడ్డీరేటుకు కోత పెట్టే అవకాశం ఉందని సమాచారం.

2017-18లో తక్కవ వడ్డీ రేటు

2017-18లో తక్కవ వడ్డీ రేటు

2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగ భవిష్యనిధి చందాదారుల డిపాజిట్‌లపై ప్రస్తుతం ఇస్తున్న వడ్డీరేటు కన్నా తక్కువ ఇచ్చే అవకాశం ఉందిని సమాచారం. బాండ్‌లపై తక్కువ ఆదాయం వస్తున్న దృష్ట్యా ఆ మొత్తాన్ని ఈటీఎఫ్‌లను చందాదారుల ఖాతాల్లో జమచేయనుందని కొందరు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది.

 ఆదాయ వనరుల కోసం

ఆదాయ వనరుల కోసం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చందాదారులకు ఖాతాలకు వడ్డీరేటును చెల్లించేందుకు ఆదాయ వనరులకు సంబంధించి ఈపీఎఫ్‌వో కసరత్తులు చేస్తోందని అధికారులు తెలిపారు.చందాదారులు తమ సొమ్ము నుంచి అడ్వాన్స్‌ తీసుకున్నప్పుడు, లేదా తమ ఖాతాను పూర్తిగా పరిష్కరించుకున్నప్పుడు ఈపీఎఫ్‌వో.. వారి ఈటీఎఫ్‌ యూనిట్లను నగదుగా మారుస్తుంది.

చందాదారులు నేరుగా ట్రేడింగ్ చేయలేరు

చందాదారులు నేరుగా ట్రేడింగ్ చేయలేరు

ఈ యూనిట్లతో చందాదారులు నేరుగా ట్రేడింగ్‌ చేయలేరు. వారు దరఖాస్తు చేసినప్పుడు కేంద్రీయ సంస్థే వాటిని నగదుగా మారుస్తుంది.అయితే పీఎఫ్ ఖాతాదారుల డిపాజిట్లపై వడ్డీ కోత విషయమై ఇంకా అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉందంటున్నారు అధికారులు. అయితే వడ్డీ రేటులో కోత విధించేందుకు మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదంటున్నారు.

English summary
Retirement fund body EPFO may lower interest rate on provident fund deposits this fiscal compared to 8.65 per cent provided to its 4.5 crore members for 2016-17, a labour ministry official said.The Employees' Provident Fund Organisation (EPFO) is likely to cut interest rate on the grounds that it is directly crediting exchange trade funds (ETF) units into provident fund accounts and lower yields on other investments, particularly bonds.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X