వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.5 శాతంగా ఖరారు - రెండు విడతలుగా ఖాతాల్లోకి - 6 కోట్ల మందికి ప్రయోజనం

|
Google Oneindia TeluguNews

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లేదా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన చందాదారులకు చెల్లంచే వడ్డీ రేటును ఖరారు చేసింది. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)పై 8.5 శాతం వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

చైనా విలవిల: బ్లాక్ టాప్ పేరు మార్పు - కైలాష్ రేంజ్‌పై భారత్ పట్టుతో ఫ్రస్ట్రేషన్ - తాజా 'వార్'నింగ్చైనా విలవిల: బ్లాక్ టాప్ పేరు మార్పు - కైలాష్ రేంజ్‌పై భారత్ పట్టుతో ఫ్రస్ట్రేషన్ - తాజా 'వార్'నింగ్

దీంతో దాదాపు 6 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులకు ప్రయోజనం చేకూరనుంది. అయితే..ఈఏడాది ఈపీఎఫ్ వడ్డీ చెల్లింపులను రెండు విడతలుగా ఖాతాల్లోకి వేస్తామని సంస్థ ప్రకటించింది. తొలివిడతగా 8.15 శాతం వడ్డీని వెంటనే చెల్లించి, మిగిలిన 0.35 శాతాన్ని డిసెంబర్ లో చెల్లిస్తామని చెప్పింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన 8.5 శాతం వడ్డీ విషయంలో వెనుకడుగు వేయబోమని, కరోనా పరిస్థితుల వల్ల వడ్డీని రెండు వాయిదాల్లో చెల్లించాల్సి వస్తున్నదని ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డు ట్రస్టీ విర్జేష్ ఉపాధ్యాయ్ వ్యాఖ్యానించారు.

EPFO to pay 8.5% interest for FY20 in two instalments, cites Covid impact

అంతేకాదు, నిధుల కొరతను అధిగమిచేందుకు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలన్న నిర్ణయాన్ని ఈపీఎఫ్‌వో ఎట్టకేలకు ఇవాళ ఉపసంహరించుకుంది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మార్కెట్లు స్థిరంగా లేనందువల్ల ఆ యోచనను విరమించుకున్నట్లు సంస్థ తెలిపింది. ఈపీఎఫ్‌వో అత్యున్నత స్థాయి వ్యవస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం మరోసారి డిసెంబరులో జరుగనుంది.

ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌పై సీరం క్లారిటీ - భారత్‌లో ట్రయల్స్ ఆగవు - యూకేలో వికటనకు వేరేఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌పై సీరం క్లారిటీ - భారత్‌లో ట్రయల్స్ ఆగవు - యూకేలో వికటనకు వేరే

2019-20 ఆర్థిక సంత్సరానికి ప్రకటించిన ఈపీఎఫ్ వడ్డీ రేటు గతేడాదితో పోల్చుకుంటే 15 బేసిక్ పాయింట్లు తక్కువ. 2018-19లో ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతం కాగా, 2017-18లో 8.55 శాతం, 2016-17లో 8.65 శాతం వడ్డీని ప్రకటించారు.

English summary
The Employees’ Provident Fund Organsation (EPFO) decided on Wednesday to credit interest rate to formal sector workers for 2019-20 in a staggered manner, citing the coronavirus pandemic’s impact on its income. The EPFO will credit 8.15 per cent to its subscribers for 2019-20 for now: significantly lower than 8.5 per cent it had decided upon in March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X