• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డెంటిస్ట్ డాక్టర్ హత్యోదంతం: అక్రమ సంబంధం ఎఫెక్ట్: క్లినిక్‌లోనే కత్తిపోట్లు: చిన్నారి అనాథ

|

తిరువనంతపురం: అక్రమ సంబంధాలు చివరికి విషాదాంతానికి మాత్రమే దారి తీస్తాయని నిరూపించే మరో ఉదంతం ఇది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఓ యంగ్ మహిళా డెంటిస్ట్ దారుణ హత్యకు దారి తీసింది. ప్రియుడి చేతిలో కత్తిపోట్లకు గురైన ఆమె.. ఆరు రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడారు. ఆమెను బతికించడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యంగ్ డెంటిస్ట్ డాక్టర్ మృతి చెందారు. దీనితో ఆమె అయిదేళ్ల కుమార్తె అనాథ అయ్యారు.

శివసేన సర్కార్ మెడకు సుశాంత్ సింగ్ డెత్ కేస్: తమ చుట్టూ ట్రాప్: సీబీఐని నమ్మలేం: రౌత్

 భర్తతో విభేదాలు.. ప్రియుడితో సహజీవనం..

భర్తతో విభేదాలు.. ప్రియుడితో సహజీవనం..

కేరళలోని ఎర్నాకుళంలో చోటు చేసుకున్న ఘటన ఇది. మృతురాలి పేరు డాక్టర్ సోనా. ఎర్నాకుళం జిల్లాలోని మువ్వట్టుపుజకు చెందిన డాక్టర్ సోనా.. త్రిశూర్ సమీపంలోని కుట్టనల్లూర్‌లో సొంతంగా డెంటల్ క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు. ఆమెకు ఇదివరకే పెళ్లయింది. ఓ కుమార్తె ఉన్నారు. మూడేళ్ల కిందట భర్తతో విభేదాలు తలెత్తడంతో అతనికి దూరంగా ఉంటున్నారు. మువ్వట్టుపుజలో తన కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన మహేష్ అనే వ్యక్తితో డాక్టర్ సోనాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది.

 ఆర్థిక విభేదాలతో మనస్పర్థలు..

ఆర్థిక విభేదాలతో మనస్పర్థలు..

మహేష్ స్థానికంగా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా మహేష్, డాక్టర్ సోనా సహజీవనం సాగిస్తున్నారు. ఆరు నెలలుగా వారి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. లాక్‌డౌన్ సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, నిర్మాణ రంగం కుదేల్ కావడంతో మహేష్‌కు ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. డబ్బుల కోసం తరచూ డాక్టర్ సోనాపై ఒత్తిడిని తీసుకొస్తుండే వాడు. అతను అడిగినంత డబ్బును ఇవ్వడానికి డాక్టర్ సోనా నిరాకరిస్తుండటంతో కక్ష పెంచుకున్నాడు.

క్లినిక్‌లోనే కత్తిపోట్లు..

క్లినిక్‌లోనే కత్తిపోట్లు..

క్లినిక్ నుంచి డబ్బును చోరీ చేస్తుండే వాడు. దీనిపై ఆమె పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. కిందటి నెల 28వ తేదీన డాక్టర్ సోనాకు చెందిన డెంటల్ క్లినిక్‌లో డబ్బును చోరీ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు మహేష్. దీనితో ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆగ్రహానికి గురైన మహేష్ డాక్టర్ సోనూపై దాడి చేశాడు. పదునైన పరికరాలతో పొడిచాడు. తీవ్రంగా గాయపరిచి, పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు, స్థానికులు త్రిశూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డాక్టర్ సోనా మరణించారు.

 హంతకుడి కోసం

హంతకుడి కోసం

డాక్టర్ సోనా తండ్రి జోస్ ఫిర్యాదు మేరకు ఒళ్లూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మహేష్ కోసం గాలిస్తున్నారు. సోనా తండ్రి జోస్‌కు రాజకీయంగా మంచి పలుకుబడి ఉండటంతో ఈ ఘటన కాస్తా కలకం రేపింది. తన కుమార్తెను హత్య చేసిన మహేష్‌ను వెంటనే అరెస్టు చేయాలంటూ స్థానిక రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మహేష్‌ను పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. సంఘటన చోటు చేసుకుని ఆరు రోజులైనప్పటికీ.. పోలీసులు నిందితుడిని అరెస్టు చేయట్లేదని మండిపడుతున్నారు.

English summary
A young dentist hailing from Kerala’s Muvattupuzha in Ernakulam district died after she was stabbed by her partner. Dr Sona died at a private hospital in Thrissur on Sunday morning. The 30-year-old sustained injuries after being stabbed by a person called Mahesh on September 28.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X