వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రైన్‌లో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్, 3 గంటలు బాత్‌రూమ్‌లోనే

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:రైలులో ప్రయాణీకులను రక్షణగా ఉండాల్సిన ఓ కానిస్టేబుల్ ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయమై ఆమె ఆ కానిస్టేబుల్ ను నిలదీసింది. ఆమె తన కోచ్ లోని మరో మహిళ ప్రయాణీకురాలి సహాయం కోరింది. కానీ, ఆమె ముందుకు రాలేదు. దీంతో తననను తాను రక్షించుకొనేందుకు బాత్‌రూమ్‌లోనే మూడు గంటల పాటు గడిపింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ ను ,పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

పూణే నుండి ఢిల్లీకి వెళ్తున్న దురంతో రైలులో ఓ 21 ఏళ్ళ యువతి ప్రయాణం చేస్తోంది. కామర్స్ చదువుతున్న ఆ యువతి ఆ రైలులో ప్రయాణం చేస్తోంది. అయితే రైలు కోటా ప్రాంతానికి చేరుకొన్న సమయంలో అదే కోచ్‌లో ఉన్న కానిస్టేబుల్ సంజయ్ కన్ను ఆ యువతిపై పడింది.

బాధితురాలిని తాకేందుకు ప్రయత్నించాడు . కానిస్టేబుల్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని ఆ యువతి తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ విషయమై బాధితురాలు అతడిని నిలదీసింది. కోచ్ లో ఉన్న మరో మహిళను తనకు సహయం చేయాలని కోరింది. కానీ, ఆమె ముందుకు రాలేదు.

 To Escape Alleged Molestation By Soldier, Woman Locks Herself In Delhi-Bound Duronto Express Toilet

దీంతో కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. బాధితురాలి పట్ల మరోసారి అసభ్యంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించే ప్రయత్నం చేస్తాడనే నెపంతో ఆ యువతి బాత్‌రూమ్‌లోకి వెళ్ళిపోయింది.

సుమారు 3 గంటల పాటు బాత్ రూమ్ నుండి బయటకు రాకుండా ఉండిపోయింది. ఈ విషయమై ఆమె తన కుటుంబసభ్యులకు సమాచారాన్ని ఇచ్చింది. దీంతో టీటీ ఆ కోచ్ లోకి చేరుకొని బాదితురాలిని వేరే కోచ్ కు తరలించారు. మరో బెర్త్ ను ఏర్పాటు చేశారు. రైలు స్టేషన్ కు చేరుకొన్న తర్వాత పోలీసులు కానిస్టేబుల్ సంజయ్ ను అదుపులోకి తీసుకొన్నారు.

English summary
woman was allegedly molested by an Army official in a moving train on the way to Delhi from Rajasthan on Saturday, police said. The woman, who was travelling alone from Kota to the capital city's Hazrat Nizamuddin station in a Duronto Express train, alleged that the army subedar tried to inappropriately touch her, police officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X