చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

600 కిలోమీటర్లు ప్రయాణించినా, అరెస్టును తప్పించుకోలేదు

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై :అరెస్టు నుండి తప్పించుకొనేందుకు ఓ వ్యక్తి పడరాని పాట్లు పడ్డాడు.ఏకంగా 600 కిలోమీటర్లు ద్విచక్రవాహానంపై ప్రయాణించారు.బందువుల ఇంట్లో తలదాచుకొన్న ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకొంది.

చెన్నైలో ని ప్రింటింగ్ ప్రెస్ యజమాని ఎస్ .కుమార్ మంగళవారంనాడు హత్యకు గురయ్యాడు. హాత్యకు ముందు సుకుమార్ అతని స్నేహితుడు జోసెఫ్ తో కలిసి మద్యం సేవించినట్టు పోలీసులు గుర్తించారు.జోసెఫ్ ను విచారించేందుకు పోలీసులు ప్రయత్నించగా అతని సెల్ పోన్ స్విచాప్ చేసి ఉంది.

chennai

జోసెఫ్, సుకుమార్ లు స్నేహితులు. సుకుమార్ ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తుంటాడు. జోసెఫ్ ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద 3 లక్షలు అప్పుగా తెచ్చి సుకుమార్ కు ఇచ్చాడు. అయితే 15 మాసాలైనా తీసుకొన్న డబ్బులను చెల్లించకపోవడంతో జోసెఫ్ పలుమార్లు సుకుమార్ ను డబ్బుల గురించి అడిగాడు. కాని సుకుమార్ మాత్రం డబ్బులు ఇవ్వలేదు. ఈ విషయమై పలుమార్లు ఇద్దరి మద్య వాగ్వాదం చోటుచేసుకొంది.

అప్పు చెల్లించాలని వడ్డీ వ్యాపారుల నుండి ఒత్తిడి కూడ పెరిగింది. దీంతో జోసెఫ్ మరోసారి సుకుమార్ ను డబ్బులు అడిగేందుకు వెళ్ళాడు. సామవారం రాత్రి సుకుమార్ ను డబ్బులు అడిగాడు జోసెఫ్. ప్రింటింగ్ ప్రెస్ అమ్మి డబ్బులు చెల్లిస్నానని సుకుమార్ జోసెఫ్ కుచెప్పాడు.

ఆ తర్వాత ఇద్దరు మద్యం తాగారు. మద్యం తాగిన తర్వాత డబ్బులు చెల్లించేది లేదని సుకుమార్ జోసెఫ్ కు తేల్చిచెప్పాడు.ఆగ్రహానికి గురైన జోసెఫ్ సుకుమార్ ను రాడ్ తో కొట్టి చంపాడు.వెంటనే భార్యపిల్లలతో కలిసి తన ద్విచక్ర వాహానంపై 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగర్ కోయిల్ లోని బందువుల ఇంటికి చేరుకొన్నాడు.పక్కా సమాచారంతో పోలీసులు జోసెఫ్ ను అరెస్టు చేశారు.

English summary
escape from arrest travel 600 kilometers.joseph, sukumar were friends.joseph borrow private moneylanders 3 lakhs ruppes for sukumar.after15 months sukumar didnot give money to joseph.monday night joseph, sukumar togethe drink.after that sukumar didnot give money to joseph. then joseph attack on sukumar.spot dead sukumar.joseph went to house along with family members travel 600 kilometers from chennai on two wheeler.police arrest joseph nagarkoil .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X