వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎష్టాబ్లిష్‌మెంట్ 22: బోర్డర్‌లో సీక్రెట్ ఫోర్స్: చైనా స్థావరాలపై రహస్యంగా: నేరుగా పీఎంఓకే రిపోర్ట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎష్టాబ్లిష్‌మెంట్ 22. ఇప్పటిదాకా పెద్దగా వినిపించని పేరు. సరిహద్దుల్లో శతృదేశాల కదలికలపై.. ప్రత్యేకించి చైనా కార్యకలాపాలపై అనుక్షణం నిఘా ఉంచడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక బలగం ఇది. తాజాగా ఇది మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 1962లో చైనాతో యుద్ధం సందర్భంగా భారత ఆర్మీ అత్యంత రహస్యంగా సృష్టించిన స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ఉనికి మళ్లీ చర్చనీయాంశమౌతోంది.

Recommended Video

Establishment 22 : China స్థావరాలపై రహస్యంగా భారత్ నిఘా.. నేరుగా PMO కే రిపోర్ట్! || Oneindia Telugu

దీనికి కారణం- లఢక్ వైపు వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న పంగ్యాంగ్ త్సొ దక్షిణ తీర ప్రాంతం వద్ద చోటు చేసుకున్న పేలుడులో ఈ ఫోర్స్‌కు చెందిన జవాన్ వీరమరణం పొందడమే. టెన్జిన్ నైమా అనే ఓ జవాన్ ఈ పేలుడులో కన్నుమూశారు. మరో కమాండో తీవ్రంగా గాయపడ్డారు. ఎష్టాబ్లిష్‌మెంట్ 22 ఫోర్స్‌లో పని చేస్తోన్న ఆల్-టిబెటన్ కంపెనీ జవాన్ ఆయన. ఈ ఫోర్స్‌లో అత్యధికులు టిబెటన్ నుంచి వచ్చిన శరణార్థులే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

లఢక్ సరిహద్దులు, వాస్తవాధీన రేఖ చాలా వరకు టిబెట్‌తో సరిహద్దులను పంచుకుంటోంది. దాని గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండటం వల్లే టిబెట్ రెఫ్యూజీలతో పాటు ఆల్-టిబెటన్ కంపెనీ జవాన్లను ఇందులో నియమించారు. ఈ ఎష్టాబ్లిష్‌మెంట్ 22 నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి, కేబినెట్ సెక్రెటేరియట్‌కు రిపోర్ట్ చేస్తుందని తెలుస్తోంది. ఎత్తయిన శిఖరాలను అవలీలగా అధిరోహించడంతో స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్‌కు శిక్షణ ఇస్తారు.

Establishment 22: A secret force under the control of the Cabinet secretariat and PMO

సరిహద్దుల్లో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) బలగాల కదలికలపై అనుక్షణం నిఘా ఉంచడం దీని ప్రత్యేకత. తమ దృష్టికి వచ్చిన అంశాలను నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర కేబినెట్ సెక్రెటేరియట్‌కు అందజేస్తుంది. ఈ సమాచారానికి అనుగుణంగా కేంద్రం తన వ్యూహాలను రూపొందించుకుంటుందని చెబుతున్నారు. లఢక్ రీజియన్ పరిధిలోని ఛొగ్లామ్సర్ గ్రామంలో కొనసాగుతోన్న టిబెటన్ రెఫ్యూజీ శిబిరంలో టెన్జిన్ నైమా పార్థివ దేహంపై టిబెట్, భారత జాతీయ పతాకాలను కప్పి నివాళి అర్పించారు.

53 సంవత్సరాల టెన్జిన్ నైమా 33 సంవత్సరాలుగా ఎష్టాబ్లిష్‌మెంట్ 22లో పని చేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. నైమా కన్నుమూయడంతో ఎష్టాబ్లిష్‌మెంట్ 22 మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఇలాంటి సీక్రెట్ ఫోర్స్ ఒకటి ఉందనే విషయం చాలామందికి తెలియకపోవచ్చని చెబుతున్నారు. ఈ ఫోర్స్ భారత ఆర్మీలో భాగం కాదనే విషయం బహిర్గతమైంది. భారత గూఢచర్య విభాగం రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్ (రా)తో నేరుగా సంబంధాలను కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

English summary
Operation on the south bank of Pangong Tso has brought into limelight the possible role of ‘Establishment 22’, a secret force also known as the Special Frontier Force (SFF) under the administrative control of the Cabinet secretariat and the PMO.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X