వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా విపత్తులో భారత్‌కు అండగా యూరోపియన్ యూనియన్... అవసరమైన సాయం అందిస్తామని ప్రకటన...

|
Google Oneindia TeluguNews

కరోనా సెకండ్ వేవ్‌తో అల్లాడుతున్న భారత్‌కు యూరోపియన్ యూనియన్ అండగా నిలిచింది. కష్ట కాలంలో భారత్‌కు చేయూతను అందించేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు యూరోపియన్ యూనియన్‌లోని 27 సభ్య దేశాలు శనివారం(మే 8) వర్చువల్ పద్దతిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు.

సమావేశంలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వొన్ దెర్ లీయెన్ మాట్లాడుతూ... 'ఈరోజు నరేంద్ర మోదీతో నిర్వహిస్తున్న ఈ సమావేశం సరైన సమయంలో జరుగుతున్నది కాకపోవచ్చు. అయితే ఈ కష్ట కాలంలో యూరోపియన్ యూనియన్ భారత్‌కు అండగా నిలుస్తుంది. భారత్‌తో యూరోపియన్ యూనియన్ మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు,వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మరిన్ని చర్చలు జరుపుతాం. భారత్-ఈయూ రెండూ కలిసి పనిచేయడం ద్వారా ఎంతో సాధించవచ్చు.' అని పేర్కొన్నారు.

eu announces we stands at indias side mea says its a watershed moment

ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు తాము ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామని సమావేశం అనంతరం భారత్-ఈయూ ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.
భారత్-ఈయూ మధ్య తాజా సమావేశం చారిత్రాత్మకమైనదిగా భారత విదేశాంగ శాఖ పేర్కొంది. భారత్‌కు అండగా నిలవాలన్న యూరోపియన్ యూనియన్ సభ్య దేశాల నిర్ణయాన్ని ప్రధాని మోదీ అభినందించారు. కరోనా మహమ్మారిపై పోరుతో పాటు భారత్-ఈయూ మధ్య వాణిజ్యం,పెట్టుబడులు,కనెక్టివిటీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఇదే సమావేశంలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాట్లాడుతూ... గతేడాది కరోనా మొదటి వేవ్ సమయంలో భారత్ ఎన్నో దేశాలకు మెడికల్ వస్తువులను సప్లై చేసిందన్నారు. స్పానిష్,బెల్జియం ప్రధానులు కూడా ఇదే అభిప్రాయపడ్డారు. కష్ట కాలంలో తమను ఆదుకున్న భారత్‌కు ఇప్పుడు అవసరమైన సాయం అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.

ఇప్పటికే యూరోపియన్ యూనియన్ నుంచి భారత్‌కు పలు రూపాల్లో సాయం అందింది.యూరోపియ‌న్‌ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఈఐబీ) అధ్యక్షుడు వెర్నర్ హోయెర్ 2,50,000 యూరోలు (రూ.2.22 కోట్లు) భారతదేశానికి అత్యవసర విరాళంగా ప్రకటించారు. భారత్‌లో జర్మనీ అంబాసిడర్ వాల్టర్ జే లిండర్ ఢిల్లీలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ ఆస్పత్రికి ఆక్సిజన్ ప్లాంట్‌ను విరాళంగా ఇచ్చారు. దీని ద్వారా రోజుకు 4లక్షల లీటర్ల మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఈయూ నుంచి అందుతున్న ఈ సాయం పట్ల భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది.

English summary
Prime Minister Narendra Modi participated in a European Council (EU) meeting as a special invitee via video-conference on Saturday with leaders of the 27-member bloc pledging support to India, which is reeling from a devastating second wave of the coronavirus disease (Covid-19).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X