వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశీయులకు నో, విదేశీయులకు ఓకే.. కశ్మీర్‌లో పర్యటిస్తున్న ఈయూ ఎంపీలు

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్‌లో ఈయూ పార్లమెంట్ సభ్యులు పర్యటన కొనసాగుతోంది. మొత్తం 27 మందితో కూడిన ఈయూ పార్లమెంట్ ఎంపీ జమ్ము కశ్మీర్ లోయలో పర్యటించేందుకు శ్రీనగర్‌కు చేరుకున్నారు. కాగా యూకే, పోలాండ్ మరియు ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఎంపీలు ఈ కమిటీలో ఉన్నారు. దీంతో కశ్మీర్ పర్యటనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు వారికి వివరించారు. అనంతరం సభ్యుల బృందం పర్యటన కొనసాగుతోంది.

కశ్మీర్ తాజా పరిస్తితులపై విచారణ

కశ్మీర్ తాజా పరిస్తితులపై విచారణ

కశ్మీర్‌లో ఉన్న తాజా పరిస్థితులతో పాటు అక్కడి ప్రజలు ఎదుర్కోంటున్న పరిస్థితులను పరిశీలించేందుకు ఈయూ బృందానికి కేంద్రం అనధికారిక పర్యటన పేరుతో అనుమతి ఇచ్చింది. దీంతో సభ్యులు రాష్ట్రంలో పర్యటించేందుకు కశ్మీర్‌కు చేరుకున్నారు. అఈ నేపథ్యంలోనే విదేశీ ఎంపీలు కశ్మీర్ ప్రజలను కలిసి ఆర్టికల్ తొలగింపు తర్వాత ఉన్న పరిణామాలపై ఆరా తీస్తున్నారు. అయితే అనధికారిక పర్యటనలో కొనసాగుతున్న బృందం తమ పరీశీలనలో తెలుసుకున్న అంశాలు బయటకు చెబుతారా లేదా అనేది వేచి చూడాలి.

 ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో మారిన పరిస్తితులు

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో మారిన పరిస్తితులు

ఆగస్టు అయిదున జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్గించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీలో నిర్బంధ పరిస్తితులు కొనసాగతున్నాయంటూ ఇటు దేశంలోని ప్రతిపక్ష సభ్యులు ఆరోపణలు చేయడంతోపాటు పాకిస్తాన్ సైతం అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి సైతం ఫిర్యాదు చేసింది. మరోవైపు ఆర్టికకల్ తొలగింపు తర్వాత స్థానిక నాయకత్వాన్ని నిర్బంధంలో పెట్టిన ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులతోపాటు ప్రతిపక్ష పార్టీల నాయకులను కూడ ఎవరిని అనుమంతించలేదు. స్వయంగా ప్రతిపక్ష పార్టీలు రాహుల్ గాంధీ అధ్వర్యంలో వెళ్లిన వారిని అర్ధంతరంగా అడ్డుకుని వెనక్కి తప్పి పంపారు. అయితే కోర్టు ఆదేశాలతో సీపీఎం నేత సీతారాం ఏచూరీ మాత్రం కశ్మీర్‌లో పర్యటించి వచ్చారు.

ఇటివలే ప్రశాంతంగా ముగిసిన బ్లాక్ ఎన్నికలు

ఇటివలే ప్రశాంతంగా ముగిసిన బ్లాక్ ఎన్నికలు

ప్రస్తుతం కశ్మీర్‌లో ప్రశాంత వాతవరణం నెలకోంది. దీంతో అక్కడ బ్లాక్ ఎన్నికలు కూడ ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు జరిగాయని స్వయంగా ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. గత చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా ఎన్నికలు నిర్వహించారని ఆయన కొనియాడారు. ఇలాంటీ సమయంలో విదేశీ బృందం పర్యటన చేస్తుంది. ఇక పర్యటన తర్వాత స్వయంగా కశ్మీరీల జీవన పరిస్తులపై బయట ప్రపంచానికి తెలిసే అవకాశాలు ఉన్నాయి.

English summary
A 27-member delegation of European MPs reached Srinagar on Tuesday to assess the ground situation in Kashmir after the government gave permission for the "unofficial" visit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X