వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిగ్ మిస్టెక్... మాయావతి సంచలన ప్రకటన... ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం..

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మిత్రులుగా మారిన బద్ద శత్రువులు.. మళ్లీ పాత వైరాన్ని తిరగదోడుకుంటున్నారు. శత్రుత్వాన్ని మరిచి స్నేహ హస్తం అందించడమే తప్పయి పోయిందని మదనపడుతున్నారు. ఒకనాటి శత్రువు,గత లోక్‌సభ ఎన్నికల్లో మిత్రపక్షం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను లాగేసుకోవడాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం(అక్టోబర్ 26) ప్రెస్ మీట్ పెట్టిన మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే శాసనమండలి ఎన్నికల్లో సమాజ్ వాదీని ఓడించేందుకు అవసరమైతే బీజేపీ అభ్యర్థులకు ఓటేస్తామని ప్రకటించారు. మాయావతి బీజేపీకి అనుకూలంగా చేసిన ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అప్పట్లో నన్ను చంపాలనుకున్నారు : మాయావతి

అప్పట్లో నన్ను చంపాలనుకున్నారు : మాయావతి


'రాబోయే శాసనమండలి ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీని ఓడించేందుకు మేము సర్వశక్తులు ఒడ్డుతాం. ఈ క్రమంలో అవసరమైతే బీజేపీ అభ్యర్థికి ఓటేస్తాం. సమాజ్‌వాదీకి గట్టి పోటీనిచ్చే ఏ పార్టీకైనా బీఎస్పీ ఎమ్మెల్యేలు ఓటేస్తారు..' అని మాయావతి ప్రకటించారు. అంతేకాదు,1995 నాటి అవమానకర ఘటనను మాయావతి మరోసారి గుర్తుచేసుకున్నారు. '1995లో ఎస్పీ,ఆ పార్టీ కార్యకర్తలు నన్ను చంపేందుకు ప్రయత్నించారు. కానీ బలహీనవర్గాల ఆశీస్సులతో నేను రక్షించబడ్డాను. అప్పట్లో ఎస్పీ తమ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బీఎస్పీ ఎమ్మెల్యేలను కిడ్నాప్ కూడా చేసింది.' అని మాయావతి ఆనాటి పరిణామాలను వివరించారు.

అయినా అన్ని మరిచిపోయి చేతులు కలిపితే...

అయినా అన్ని మరిచిపోయి చేతులు కలిపితే...

ఇంత జరిగినా... అవన్నీ మరిచిపోయి కేవలం మతతత్వ శక్తులను ఓడించాలన్న ఉద్దేశంతోనే 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకున్నామని మాయావతి పేర్కొన్నారు. నిజానికి అలా జరిగి ఉండాల్సింది కాదని... ఎస్పీతో పొత్తు పెట్టుకుని పెద్ద తప్పు చేశామని అన్నారు. ఆ ఎన్నికల్లో పొత్తు ఖరారైన నాటి నుంచి బీఎస్పీ సర్వ శక్తులు ఒడ్డిందన్నారు. కానీ ఎస్పీ అలా చేయలేదని ఆరోపించారు. 1995లో తాను ఎస్పీపై పెట్టిన కేసులను ఉపసంహరింపజేయాలనే మొదటి నుంచి అఖిలేశ్ ప్రయత్నించారని ఆరోపించారు. పొత్తు ఖరారైన నాటి నుంచి ఆ కేసులను ఉపసంహరించుకోవాల్సిందిగా మాయావతికి చెప్పాలని బీఎస్పీ సీనియర్ నేత మిశ్రాను అఖిలేశ్ తరుచూ కోరారని అన్నారు. నిజానికి ఆ కేసులను కూడా ఉపసంహరించుకోకుండా ఉండాల్సిందని... ఇప్పుడు దానికి విచారపడుతున్నామని పేర్కొన్నారు.

ఎంతసేపు కేసుల పైనే ఫోకస్..

ఎంతసేపు కేసుల పైనే ఫోకస్..

ఏడుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడం ద్వారా ఎస్పీ తన దళిత వ్యతిరేకతను మరోసారి బయటపెట్టుకుందని మాయావతి విమర్శించారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆ పార్టీలో రేగిన కుటుంబ చిచ్చు ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించిందన్నారు. పైగా వాళ్లపై పెట్టిన కేసులను తాను వెనక్కి తీసుకోవాలన్న ఆరాటమే తప్ప... ఎన్నికల కోసం వారు గట్టిగా పోరాడలేదని మాయావతి ఆరోపించారు. ఎన్నికల తర్వాత కూడా వారి వైపు నుంచి ఎటువంటి స్పందన లేదని... అందుకే తాము పక్కకు తప్పుకున్నామని చెప్పారు.

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో...

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో...

త్వరలో ఉత్తరప్రదేశ్‌లో జరిగే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాజ్యసభ ఎన్నికల కోసం ఎస్పీ తమ అభ్యర్థిని నిలబెట్టగా... బీఎస్పీ కూడా రాంజీ గౌతమ్‌‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. నిజానికి ఎస్పీతో సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేసినప్పటికీ.. అఖిలేశ్ యాదవ్ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతోనే తాము కూడా అభ్యర్థిని నిలబెట్టినట్లు బీఎస్పీ చెబుతోంది. అయితే ఇంతలోనే బీఎస్పీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఏడుగురు ఎస్పీ గూటికి చేరారు. దీంతో షాక్ తిన్న బీఎస్పీ ఇదంతా ఎస్పీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడి అని ఆరోపిస్తోంది. పాత శత్రుత్వాన్ని మరిచి గత ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం తీవ్ర తప్పిదమని విచారపడుతోంది.

English summary
After their brief alliance in Uttar Pradesh flopped in last year's national election, Mayawati and Akhilesh Yadav are back to being fierce rivals. Mayawati has said she is even ready to vote for the BJP to defeat any candidate of Akhilesh Yadav's Samajwadi Party in polls to the UP legislative council.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X