వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ సార్వభౌమత్వం పరిరక్షించేందుకు రె‘ఢీ’: ఐఏఎఫ్ చీఫ్ రాకేశ్ కుమార్ సింగ్

|
Google Oneindia TeluguNews

దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించేందుకు వాయుసేన ఎప్పుడూ సిద్దంగా ఉంటుందని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేశ్ కుమార్ సింగ్ భదౌరియా అన్నారు. ఐఏఎఫ్ 88వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం యూపీలో గల ఘజియాబాద్ హిందాన్ ఎయిర్ బేస్ వద్ద విన్యాసాలను ప్రదర్శించారు. రాఫెల్ సహా యుద్ధ విమానాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాకేశ్ కుమార్ కామెంట్స్ చేశారు.

Recommended Video

IAF Day 2020 : యుద్ధం సహా.. అన్నింటికీ IAF సిద్ధం! - Rakesh Kumar Singh Bhadauria || Oneindia Telugu

ఇటీవల చైనా సరిహద్దులో జరుగుతోన్న ఘర్షణల నేపథ్యంలో రాకేశ్ కుమార్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తాము ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని.. పోరాటానికి సిద్దమని ప్రకటించారు. ప్రభుత్వం సమాచారం ఇస్తే చాలు.. సరిహద్దుల్లో మొహరిస్తామని సంకేతాలను ఇచ్చారు. ప్రదర్శనలో చిన్ కూక్ హెలికాప్టర్లు కూడా ప్రదర్శించారు.

Ever Ready to Safeguard Nation’s Sovereignty: IAF Chief

వాయుసేన ఈ ఏడాది ప్రత్యేకంగా నిలిచిపోతుందని రాకేశ్ తెలిపారు. వైమానిక దళ సిబ్బంది చిత్తుశుద్ది, సంకల్పంలో ఐఏఎఫ్ ముందుకు సాగిందని వెల్లడించారు. వాయుసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చీఫ్ ఆఫ్ డిపెన్స్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎంఎం నారవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ హాజరయ్యారు. అంతకుముందు రోజు మీడియాతో రాకేశ్ మాట్లాడారు. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. యుద్ధం సహా.. అన్నింటికీ ఐఏఎఫ్ సిద్ధంగా ఉంది అని చెప్పారు.

English summary
Indian Air Force chief Air Chief Marshal Rakesh Kumar Singh Bhadauria on Thursday said that the Indian Air Force will evolve and be ever ready to safeguard the country's sovereignty
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X