• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అందరికీ కొవిడ్ టీకాలు అవసరం లేదు -వ్యాక్సిన్లపై అనుమానాలొద్దు -లోక్‌సభలో ఆరోగ్య మంత్రి ప్రకటన

|

దేశంలో కొంత గ్యాప్ తర్వాత కరోనా మహమ్మారి మళ్లీ విజృభిస్తుండటం, వ్యాక్సిన్లపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తుండటం, దీంతో పలు రాష్ట్రాలకు పంపిన టీకాలు వృధా అయిపోవడం, విదేశాలకు టీకాల సరఫరా లాంటి పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.

జగన్‌కు వాతపెట్టి వెన్నపూస్తోన్న కేంద్రం -15 ఏళ్లలో ఏపీ సూపర్ పవర్ -దివాళ జడిలో అనూహ్య ప్రశంసలుజగన్‌కు వాతపెట్టి వెన్నపూస్తోన్న కేంద్రం -15 ఏళ్లలో ఏపీ సూపర్ పవర్ -దివాళ జడిలో అనూహ్య ప్రశంసలు

కోవిడ్-19 వ్యాక్సిన్లపై ఎవరికీ అనుమానాలు అక్కర్లేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. శుక్రవారంనాడు లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ, ఎలాంటి భయం లేకుండా అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

 Every covid-19 vaccine does not require universal immunisation says Harsh Vardhan in LS

'ప్రతి టీకాకు యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ అవసరం లేదు. మొదట వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, తరవాత 60ఏళ్లు పైబడిన(45ఏళ్లు దాటి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి)వారికి టీకాలు అందిస్తున్నాం. నిపుణుల సూచనల ఆధారంగా రానున్న రోజుల్లో టీకా కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తాం. భారతీయ నిపుణులతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన నిపుణులతో కూడా సంప్రదింపులు జరిపాం' అని హర్షవర్ధన్ వెల్లడించారు. అలాగే..

మమత పెద్ద రిగ్గింగ్ రారాణి -ఈవీఎం యంత్రాలపై సాకులా? -బెంగాల్ సీఎంపై బీజేపీ నేత సువేందు ఫైర్మమత పెద్ద రిగ్గింగ్ రారాణి -ఈవీఎం యంత్రాలపై సాకులా? -బెంగాల్ సీఎంపై బీజేపీ నేత సువేందు ఫైర్

వైద్య నిపుణులు చెప్పిన సూచనలు ప్రకారం..దేశంలో ప్రతి ఒక్కరికి టీకాలు ఇవ్వాల్సిన పని లేదని, ప్రపంచ వ్యాప్తంగా కూడా. వైరస్ తీరును బట్టి..టీకా కార్యక్రమంలో మార్పులు ఉంటాయని, ప్రతి ఒక్కరు టీకాకు సంబంధించి ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని మంత్రి అన్నారు. దేశంలో ఇంతవరకూ 3,93,39,817 మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్టు హర్షవర్ధన్ తెలిపారు. భారత్ అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చిన తర్వాతే విదేశాలకు టీకాలను సరఫరా చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు.

కాగా, గత 24 గంటల్లో కొత్తగా 39,726 కరోనా కేసులు నమోదు కాగా, 20,654 మందికి స్వస్థత చేకూరినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారంనాడు ప్రకటించింది. కొత్తగా వెలుగుచూసిన కోవిడ్ కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,15,14,331కు చేరుకుంది. వీటిలో 2,71,282 యాక్టివ్ కేసులుండగా, 1,10,83,679 మంది కోలుకున్నారు.

English summary
Union Health Minister Dr Harsh Vardhan on Friday, while speaking in Lok Sabha, on friday, said no one should have any doubts about the COVID-19 vaccines. He also urged everyone to take the vaccine doses without fear. he said it is not necessary, scientifically, to give each and every person in the country the vaccine.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X