వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

sonu sood: ప్రతీ పైసా జనం కోసమే, సేవా కార్యక్రమాలు షురూ చేస్తా..

|
Google Oneindia TeluguNews

సోనూ సూద్.. రియల్ లైఫ్ హీరో. కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ టైంలో ఆయన మంచి మనసు ప్రపంచానికి తెలిసింది. ఎవరూ ఏ సాయం అడిగిన వెంటనే చేసేశారు. అన్నం పెట్టడమే కాదు.. స్వస్థలాలకు వెళ్లేందుకు.. విదేశాల ఉన్నవారిని స్వదేశం తీసుకురావడం.. జాబ్ అడిగితే ఇవ్వడం.. ల్యాప్ టాప్, ట్రాక్టర్, ఇలా రకరకాల సాయం చేశారు. సోనూ సూద్ ఇళ్లు, అతని సంస్థపై ఐటీ దాడులు చేయడం కలకలం రేపింది. దీనిపై సోనూ సూద్ స్పందించారు.

ఆదాయానికి సంబంధించిన భారీస్థాయిలో పన్నులు ఎగవేశారని ఐటీ శాఖ నుంచి లీకులు కూడా వచ్చాయి. సోనూసూద్ ఆదాయపు పన్నుల వ్యవహారం దేశంలో హాట్ టాపిక్ అయింది. ఐటీ సోదాలు, పోలీసుల చర్యలు, పొలిటికల్ యాక్షన్ ఊహాగానాలను బ్రేక్ చేస్తూ.. సోనూసూద్ ట్విట్టర్ లో స్పందించారు. నీ వెర్షన్ ఏంటో నువ్వు ప్రతిసారీ చెప్పాల్సిన అవసరం లేదు. టైమే నువ్వేంటో చెబుతుందని ట్విట్ చేశారు.

sonu sood reacts after it raids. every rupee expenditure to people he said.

దేశ ప్రజలకు శక్తి వంచన లేకుండా.. నిండు మనసుతో సేవ చేయాలని ప్రతిజ్ఞ చేసుకున్నా అని పేర్కొన్నారు. అవసరంలో ఉన్న వారికి, ప్రాణాలు కాపాడటానికి, తన ఫౌండేషన్‌కు వచ్చే ప్రతి రూపాయి ఎదురుచూస్తుందన్నారు. ఒప్పందంలో భాగంగా రావాల్సిన డబ్బులను మానవీయ కోణంలో దానం చేయాలని, బ్రాండ్లను ఎన్నో సందర్భాల్లో కోరుతూ వస్తున్నానని సోనూసూద్ చెప్పారు.

కొందరు గెస్టులను కలుస్తూ గడిచిన నాలుగు రోజులుగా ప్రజాసేవకు దూరంగా ఉన్నానని పేర్కొన్నారు. మానవత్వం చాటుతూ సేవ చేసేందుకు.. మళ్లీ సిద్ధంగా ఉన్నానని సోనూసూద్ చెప్పారు. తన సేవా ప్రయాణం కొనసాగుతుందని చెప్పారు. జైహింద్ అంటూ తన లెటర్‌ను ముగించారు.

మరోవైపు సోనూసూద్ ఇప్పటికి దాదాపు రూ. 30 కోట్లకు పైగా సొంత డబ్బు ఖర్చు చేశారు. చేసిన మంచి పనులే కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఇప్పుడు ఆయన క్రేజ్‌ని సినిమా వాళ్లు క్యాష్ చేసుకోవాలని ఆరాటపడుతున్నారు. అందుకే సోనూసూద్‌కు అవ‌కాశాలు చాలానే ఇస్తున్నారు. రూ.3 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. తెలుగులో అవకాశాలు ఎక్కువగా రావడంతో హైదరాబాద్‌లోనే ఉండాల్సి వస్తుంది. అందుకే హైద‌రాబాద్‌లో ఓ సొంతింటిని కొనుక్కోవాల‌ని చాలా రోజుల కింద ఫిక్స్ అయ్యాడు.

English summary
sonu sood reacts after it raids. every rupee expenditure to people he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X