వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్మృతీ ఇరానీ V/S దీపికా పడుకోన్: బాలీవుడ్ భామను కేంద్ర మంత్రి అంత మాటనేశారేంటి..?

|
Google Oneindia TeluguNews

చెన్నై: జేఎన్‌యూ క్యాంపస్‌లో నిరసనలు తెలుపుతున్న విద్యార్థులకు బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ మద్దతుగా నిలవడాన్ని తప్పుబట్టారు కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ. చెన్నైలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన స్మృతీ ఇరానీ దీపికా 2011లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలిచి తను ఏ రాజకీయ పార్టీకి చెందుతుందో చెప్పకనే చెప్పిందని అన్నారు. దీపికా పదుకోన్‌కు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూను స్మృతీ ఇరానీ ప్రస్తావించారు. ఆ ఇంటర్వ్యూలో ప్రధానిగా రాహుల్ గాంధీకి ఆమె మద్దతు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూను తిరిగి గుర్తుచేశారు మంత్రి స్మృతీ ఇరానీ.

జేఎన్‌యూలో దీపికా పదుకొనె: విద్యార్థులకు పరామర్శ, మౌనంగానే.., 'ఆమె సినిమాలు చూడొద్దంటూ..’ జేఎన్‌యూలో దీపికా పదుకొనె: విద్యార్థులకు పరామర్శ, మౌనంగానే.., 'ఆమె సినిమాలు చూడొద్దంటూ..’

దీపికాను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు మంత్రి స్మృతీ ఇరానీ. దేశ రక్షణ కోసం పనిచేస్తున్న సీఆర్‌పీఎఫ్ జవాన్‌ను శతృవులు చంపితే సంబరాలు చేసుకునే పార్టీలు లేదా ఆ పార్టీ నేతలకు మద్దతుగా దీపికా నిలుస్తోందని మండిపడ్డారు. ఇలా చెబుతూనే దీపికా పదుకోన్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతోందని స్మృతీ ఇరానీ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇక అమ్మాయిలపై దాడి చేసే వారికి కూడా దీపికా పదుకోన్ మద్దతు తెలుపుతుందని స్మృతీ ఇరానీ ఎద్దేవా చేశారు. మద్దతు తెలపడం తెలపకపోవడం అనేది తనపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

Everyone knows, As to which political party Deepika Padukone supports:Smriti Irani

భారత్‌ను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి మద్దుతుగా నిలవాలనుకోవడం దీపికా ఇష్టమని అందుకు ఎవరూ ఏమీ చేయలేరని ధ్వజమెత్తారు. జేఎన్‌యూలో ఆదివారం హింసాత్మక వాతావరణం చోటుచేసుకోగా క్యాంపస్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. అయితే మంగళవారం రోజున దీపికా పదుకొనే విద్యార్థులకు సంఘీభావం తెలిపింది. ఆమె క్యాంపస్‌ విద్యార్థులకు మద్దతు తెలపడంతో బీజేపీ నేత తజీందర్ బగ్గా మండిపడ్డారు.

దీపికా నటించిన తాజా చిత్రం చపాక్‌ను నిషేధించాల్సిందిగా బగ్గా పిలుపునిచ్చారు. అయితే దీపికా జేఎన్‌యూ విద్యార్థులకు మద్దతుగా నిలవడంపై కొందరు స్వాగతించగా మరికొందరు వ్యతిరేకించారు. అయితే కేంద్రమంత్రి ప్రకాష్ జవడేకర్ కూడా స్పందించారు. సంఘీభావం తెలిపాలంటే సినిమా ఆర్టిస్టులే కానక్కర్లేదని సామాన్య ప్రజలు కూడా సంఘీభావం తెలపొచ్చని, వారి అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ఉందని చెప్పారు.

English summary
Union minister Smriti Irani has reacted to actor Deepika Padukone visiting the JNU campus in support of protesting students on Tuesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X