వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హవ్వా .. బాలుడితో ఈవీఎం మోయిస్తారా : ఈసీపై తేజస్వి గుస్సా

|
Google Oneindia TeluguNews

పాట్నా : మరికొన్ని గంటల్లో సార్వత్రిక ఫలితాలు లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా .. ఈవీఎంల తరలింపుపై వివాదం చెలరేగింది. ఓ బాలుడిపై ఈవీఎం మిషన్ ఎత్తుకొస్తున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై ఆర్జేడీ నేత, బీహర్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ స్పందించారు. ఎన్నికల సంఘం వ్యవహరశైలిని తప్పుపట్టారు.

బాల కార్మికుడితో పనులా ?
ఓ బాలుడి ఈవీఎం ఎత్తుకురావడం ఏంటని ఎన్నికల సంఘాన్ని తేజస్వి యాదవ్ ప్రశ్నించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో .. వజ్రాయుధమైన ఓటును నిక్షిప్తం చేసిన ఈవీఎంలను బాల కార్మికుడితో ఎలా మోయిస్తారని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు రవాణాశాఖలో రిజిస్టర్ కానీ వాహనాల్లో ఈవీఎంలను కౌంటింగ్ జరిపే చోటుకు ఎలా తరలిస్తారని నిలదీశారు. ఇది సరికాదని .. నిబంధనలకు విరుద్ధమని ట్వీట్ చేశారు.

EVMs Transported By Child Labour: Tejashwi Yadav Attacks Poll Body

హోటల్‌లో ఈవీఎం దర్శనం
ముజఫర్‌నగర్‌లో ఓ హోటల్‌కు ఈవీఎంలను తరలించడం సరికాదన్నారు. అక్కడ కలెక్టర్ స్థాయి అధికారి ఉన్నా .. హోటల్‌లో ఈవీఎంలు తరలించడం ఏంటని ప్రశ్నించారు. యూపీ, బీహర్, పంజాబ్, హర్యానాలో ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురయ్యాయని కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆరోపించిన తర్వాత తేజస్వి యాదవ్ స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతోపాటు తమ పార్టీ కార్యకర్తలను కౌంటంగ్ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేశాయి. తమ అధినేతల ఆదేశాలతో యూపీలోని మీరట్, రాయ్ బరేలి వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. చండీగఢ్‌లో కూడా అప్రమత్తంగా ఉన్నారు కార్యకర్తలు. ఇక తమిళనాడులో డీఎంకే నేత కనిమొళి తమ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈవీఎంలు తరలించే సమయంలో సీసీటీవీ ద్వారా పరిశీలించాని సూచించారు.

English summary
Rashtriya Janata Dal (RJD) leader Tejashwi Yadav today hit out at the Election Commission over the transport and storage of Electronic Voting Machines (EVMs), posting a photograph on social media that showed children carrying what appear to be boxes containing EVMs. The former Deputy Chief Minister also criticised the polling body for carrying the boxes in unregistered vehicles. "In Bihar, EVM transportation is being done by using child labour," Tejashwi Yadav wrote in Hindi on Twitter, adding, "Voting machines are being taken in unregistered vehicles against the rules." He also wrote, "EVMs were transported to a hotel in Muzaffarpur where they were found in the presence of a magistrate."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X