వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఐ మాజీ డైరెక్టర్ అశ్వనీకుమార్ ఆత్మహత్య..

|
Google Oneindia TeluguNews

సీబీఐ మాజీ డైరెక్టర్ అశ్వనీకుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. సిమ్లాలోని తన ఇంటిలో ఉరేసుకొని చనిపోయారు. ఇదివరకు ఆయన నాగాలాండ్, మణిపూర్ గవర్నర్‌గా పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్ డీజీపీగా కూడా విధులు నిర్వర్తించారు. అయితే ఆయన గత కొంతకాలంగా మానసిక ఒత్తిడితో ఉన్నారని తెలుస్తోంది. అందుకోసమే సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.

Ex CBI Director Ashwani Kumar suicide

విషయం తెలిసిన వెంటనే పోలీసులు అశ్వనీకుమార్ ఇంటికి చేరుకున్నారు. అతనిని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అప్పటికే అతను చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. అశ్వనీకుమార్ మరణం దిగ్బ్రాంతికి గురిచేసిందని ఎస్పీ మోహిత్ చావ్లా తెలిపారు. ఎందరో పోలీసులకు ఆయన ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు. అశ్వనీకుమార్ ఆత్మహత్యపై పలువురు దిగ్బ్రాంతికి గురయ్యారు.

అశ్వనీకుమార్ హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌కి చెందిన ఐపీఎస్ అధికారి. 2006 ఆగస్ట్ నుంచి 2008 జూలై వరకు ఆ రాష్ట్రానికి డీజీపీగా కూడా పనిచేశారు. 2013 నుంచి ఏడాది వరకు నాగాలాండ్ గవర్నర్‌గా పనిచేశారు. తర్వాత మణిపూర్ గవర్నర్‌గా కూడా విధులు నిర్వర్తించారు.

English summary
Ex CBI Director Ashwani Kumar suicide in his home.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X