• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మాజీ సీఎం వల్ల దేశ భద్రతకు ముప్పు -సీఐడీ సంచలన రిపోర్ట్ -పాస్‌పోర్ట్ నిరాకరణ -మోదీపై ముఫ్తీ ఫైర్

|

జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి, బీజేపీకి ఒకప్పటి మిత్రురాలు మెహబూబా ముఫ్తీకి ఘోర అవమానం ఎదురైంది. భారత పౌరురాలిగా ఆమెకు గుర్తింపునిచ్చే పాస్‌పోర్ట్ జారీకి కేంద్ర సర్కారు నిరాకరించింది. మెహబూబా వల్ల దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న కారణాన్ని చూపుతూ ఆమెకు పాస్ పోర్టు మంజూరు చేయబోమని పోలీసులు తేల్చిచెప్పారు. దీనిపై ముఫ్తీ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు.

ఈటల రాజేందర్ కొత్త పార్టీ! -జగన్‌తో వైఎస్ షర్మిల ఒప్పందం -కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలనంఈటల రాజేందర్ కొత్త పార్టీ! -జగన్‌తో వైఎస్ షర్మిల ఒప్పందం -కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలనం

జాతీయ భద్రతకు ముప్పు అంటూ ప్రభుత్వం తనకు పాస్‌పోర్ట్ మంజూరు చేయడం లేదని జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఈ మేరకు ఆమె సోమవారం ఓ సంచలన ట్వీట్ చేశారు. ''పాస్‌పోర్ట్ ఇవ్వడానికి అధికారులు నిరాకరించారు. సీఐడీ నివేదిక ఆధారంగా నా వల్ల భారత దేశ భద్రతకు ముప్పుందని అంటున్నారు. ఒక మాజీ సీఎంకు పాస్‌పోర్ట్ ఉండటం.. శక్తిమంతమైన భారత సార్వభౌమత్వానికి ముప్పు ఎలా అవుతుంది? నిజం చెప్పాలంటే 2019 ఆగస్టు నుంచి జమ్మూకాశ్మీర్ లో ఇలాంటివి న్యూ నార్మల్ గా కొనసాగుతున్నాయి'' అని ముఫ్తీ మండిపడ్డారు.

 Ex-CM a threat to nation? Mehbooba Mufti hits out after passport application rejected

క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా పాస్‌పోర్టు కార్యాలయం తనకు పాస్పోర్ట్ ఇవ్వడానికి నిరాకరించిందని మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. కేంద్రం విధానాలనువ్యతిరేకిస్తున్నాన్న కారణంతో ఉద్దేశపూర్వంగాగానే తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందదని విమర్శించారు.

మెహబూబా ముఫ్తీ పాస్‌పోర్ట్ గడువు గతేడాది మే 31 తో ముగియగా, డిసెంబర్ 11న తాజా పాస్‌పోర్ట్ జారీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. శ్రీనగర్ పాస్ పోర్ట్ అధికారులు విపరీతంగా జాప్యం చేస్తుండటంపై ఆమె కోర్టును కూడా ఆశ్రయించారు. సీఐడీ రిపోర్టు ఆధారంగా పాస్ పోర్టు మంజూరుపై నిర్ణయం తీసుకుంటామని సదరు అధికారులు చెప్పారు. తీరా..

జగన్‌పై రత్నప్రభ అనూహ్య వ్యాఖ్యలు -తిరుపతి ఓటర్లకు సవాల్ -బీజేపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారంజగన్‌పై రత్నప్రభ అనూహ్య వ్యాఖ్యలు -తిరుపతి ఓటర్లకు సవాల్ -బీజేపీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం

సీఐడీ రిపోర్టులో ముఫ్తీని దాదాపు దేశ విద్రోహ శక్తిగా, ఆమెకు పాస్ పోర్టు ఇస్తే జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుందని పేర్కొనడంతో పాస్ పోర్టు జారీ చేయబోమంటూ అధికారులు స్పస్టం చేశారు. జమ్మూకాశ్మీర్ విషయంలో కేంద్రం నిర్ణయాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ముఫ్తీ ఆరోపించారు. సోమవారం నాటి ట్వీట్ తోపాటు సీఐడీ రిపోర్టును కూడా ఆమె జత చేశారు.

2019 ఆగస్టు5న జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు కావడం, రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించి, ఢిల్లీ ప్రభుత్వమే పాలన సాగిస్తుండటం, ఆ సమయంలో ముఫ్తీతోపాటు పలువురు నేతలను ప్రబుత్వ నిర్బంధించడం తెలిసిందే. కొద్ది నెలల కిందటే నిర్బంధం నుంచి విడుదలైన మెహబూబా ముఫ్తీ పాస్ పోర్టు కోసం దరఖాస్తు చేసుకోగా నిరాకరణు గురైంది.

English summary
The Jammu and Kashmir Police has opposed the issuance of a passport to former Chief Minister Mehbooba Mufti citing "adverse report" against her. Hitting out at the central government, Mehbooba Mufti took to Twitter to say that she has been denied a passport based on a report by the Criminal Investigation Department (CID) and asked if an ex-CM was a threat to the nation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X