బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Radhika: పోలీసుల ముందు మాజీ సీఎం భార్య, నేనుపారిపోలేదు, పారిపోను, మాటమీద నిలబడుతా, తెలుసా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: రాజకీయ నాయకుల పేరుతో వందల కోట్ల రూపాయలు మోసం (చీటింగ్) చేశారని నమోదైన కేసులో అరెస్టు అయిన యువరాజ్ దగ్గర భారీ మొత్తంలో నగదు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటి, మాజీ ముఖ్యమంత్రి భార్య రాధిక కుమారస్వామి సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ముందు విచారణకు హాజరైనారు. విచారణ పూర్తి అయిన తరువాత నటి రాధిక మాట్లాడుతూ తాను ఎక్కడికి పారిపోలేదు, ఇక ముందు పారిపోను, ముందు చెప్పిన మాటకే తాను కట్టుబడి ఉంటానని, మాటమీద నిలబడుతానని ఆమె అన్నారు. పోలీసులు మళ్లీ తనను విచారణకు హాజరుకావాలని సూచిస్తే కచ్చితంగా వచ్చి విచారణ ఎదుర్కొంటానని, తాను ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోలేదని మాజీ సీఎం భార్య రాధిక కుమారస్వామి స్పష్టం చేశారు.

Beautiful lady: భర్తకు విడాకులు, ఇంట్లో తెలీకుండా ప్రియుడితో కాపురం, ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం!Beautiful lady: భర్తకు విడాకులు, ఇంట్లో తెలీకుండా ప్రియుడితో కాపురం, ఎన్ని కోట్లు ఉంటే ఏం లాభం!

 వందల రూ. కోట్ల స్కామ్ స్వామి

వందల రూ. కోట్ల స్కామ్ స్వామి

ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు చెప్పుకుని అనేక మందికి కుచ్చుటోపీ పెట్టాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిలి ఆర్ఎస్ఎస్ లీడర్ యువరాజ్ అలియాస్ యువరాజ్ స్వామి అలియాస్ స్వామిని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు (CCB) అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో యువరాజ్ స్వామి గురించి అనేక షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఇదే సమయంలో ప్రముఖుల పేర్లు తెరమీదకు వచ్చాయి.

 మాజీ సీఎం భార్య

మాజీ సీఎం భార్య

నకిలి ఆర్ఎస్ఎస్ లీడర్ యువరాజ్ బ్యాంకు అకౌంట్ ల నుంచి కర్ణాటక మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి రెండో భార్య రాధిక కుమారస్వామి బ్యాంకు ఖాతాలకు భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. మాజీ సీఎం రెండో భార్య రాధిక కుమారస్వామికి చీటింగ్ కేసులో అరెస్టు అయిన యువరాజ్ బ్యాంకు ఖాతాల నుంచి ఎందకు నగదు లావాదేవీలు జారిగాయి ? అనే విషయం క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు.

 తెరమీదకు రాధికు కుమారస్వామి

తెరమీదకు రాధికు కుమారస్వామి

శుక్రవారం విచారణకు హాజరుకావాలని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి రెండో భార్య రాధిక కుమారస్వామికి బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు అధికారులు నోటీసులు జారీ చేశారు. యువరాజ్ అలియాస్ స్వామి ప్రముఖ నటి, మాజీ సీఎం భార్య రాధిక కుమారస్వామికి ఎందుకు నగదు బదిలి చేశారు అనే విషయంపై వివరాలు సేకరించడానికి ఆమెకు నోటీసులు జారీ చేశామని బెంగళూరు సీసీబీ విభాగం జాయింగ్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ స్పష్టం చేశారు.

 మూడు గంటలు మేడమ్ విచారణ

మూడు గంటలు మేడమ్ విచారణ

శుక్రవారం ఉదయం 11 గంటలకు బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసు కార్యాలయంలో మాజీ సీఎం కుమారస్వామి భార్య రాధిక కుమారస్వామి హాజరైనారు. బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ విభాగం ఏసీపీ నాగరాజ్ నేతృత్వంలోని పోలీసులు రాధిక కుమారస్వామిని సుమారు మూడు గంటలకు పైగా విచారణ చేసి ఆమె నుంచి లిఖితపూర్వకంగా వివరాలు సేకరించారు. ఈ సందర్బంగా సీసీబీ కార్యాలయం ముందు పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

 నేనుపారిపోయానా ? లేదు కదా , రాధిక ఫైర్

నేనుపారిపోయానా ? లేదు కదా , రాధిక ఫైర్

పోలీసుల విచారణ పూర్తి అయిన తరువాత మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ. కుమారస్వామి రెండో భార్య రాధిక కుమారస్వామి మీడియాతో మాట్లాడారు.

తాను ఎక్కడికి పారిపోలేదు, ఇక ముందు పారిపోను, ముందు చెప్పిన మాటకే తాను కట్టుబడి ఉంటానని అన్నారు. పోలీసులు మళ్లీ తనను విచారణకు హాజరుకావాలని సూచిస్తే కచ్చితంగా వచ్చి విచారణ ఎదుర్కొంటానని అన్నారు.

 డబ్బులు ఎవరు ఇచ్చారు ?

డబ్బులు ఎవరు ఇచ్చారు ?

తాను ఎవ్వరి దగ్గర డబ్బులు తీసుకోలేదని, ఇంతకు ముందు మీడియా సమావేశంలో తాను చెప్పినమాటకు ఇప్పుడు కట్టుబడి ఉంటానని, అందులో ఎలాంటి సందేహం లేదని మాజీ సీఎం హెచ్.డీ. కుమారస్వామి భార్య రాధిక కుమారస్వామి స్పష్టం చేశారు. చీటింగ్ కేసులో అరెస్టు అయిన యువరాజ్ అలియాస్ స్వామి చెప్పిన వివరాలను పూర్తిగా బయటకు లాగాలనే ఉద్దేశంతోనే రాధిక కుమారస్వామిని విచారణ చేసి వివరాలు సేకరించామని జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ క్లారిటీ ఇచ్చారు.

 అంతే... ఏమీ లేదు అంటున్న పోలీసులు

అంతే... ఏమీ లేదు అంటున్న పోలీసులు

రాధిక కుమారస్వామి ఈ రోజు, గతంలో చెప్పిన వివరాలను పరిశీలించిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటామని బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ విభాగం జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ శుక్రవారం సాయంత్రం మీడియాకు చెప్పారు. ఇప్పటికే రాధిక కుమారస్వామి సోదరుడు రవిరాజ్ ను బెంగళూరు సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారణ చేసి వివరాలు సేకరించారు.

English summary
EX CM Wife: Radhika Kumaraswamy inquired by CCB police today in Chamarajnagar office in Bengaluru. She summoned in a cheating case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X