వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సబ్ కా సాథ్ సబ్ కా వికాస్.. అందుకోసమే బీజేపీలో చేరానన్న సంజయ్ దంపతులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : బీజేపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. కాంగ్రెస్ ముఖ్య నేతలంతా పార్టీ మారుతున్నారు. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేత సంజయ్ సింగ్ తన భార్య అమితా సింగ్‌తో కలిసి బీజేపీలో చేరారు. వీరికి బీజేపీ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు జేసీ నడ్డా కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తాను బీజేపీలో చేరతానని నిన్ననే సంజయ్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కమల దళంలోకి ..
సంజయ్ సింగ్ అమేథీలో గట్టి పట్టున్న నేత .. కాంగ్రెస్ పార్టీ బలం కూడా. ఆయన పార్టీ వీడటంతో కాంగ్రెస్‌కు దెబ్బే అని చెప్పవచ్చు. ఇక సంజయ్ భార్య అమీతా సింగ్ ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ యూపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ పాత సిద్ధాంతాలను వీడటం లేదని సంజయ్ సింగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌లో దిశానిర్దేశం చేసే నేత లేరు, ప్రజలతో దూరం ఏర్పడిందని మండిపడ్డారు. కానీ మోడీ ఆలోచన సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని స్పస్టంచేశారు. అలాగే రాహుల్‌కు పెద్దలతో ఎలా మసులుకోవాలో తెలియదని దుమ్మెత్తిపోశారు. అందుకే పార్టీ అలా రోజురోజుకు పతనం అవుతుందని పేర్కొన్నారు. ఆయన ఇప్పటికే రాజ్యసభకు రాజీనామా చేసినందున ... బీజేపీ రాజ్యసభ సీటు ఇచ్చే అవకాశం ఉంది.

Ex-Congress leader Sanjay Sinh, wife Ameeta Sinh join BJP

సొంతగూటికి
1990కి ముందు బీజేపీలో ఉన్నారు. తర్వాత మారిన పరిస్థితులతో కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో కూడా సూల్తాన్ పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి మేనకాగాంధీ చేతిలో పరాజయం పాలయ్యారు. కానీ యూపీ రాజకీయాల్లో ప్రభావం చూపగల నేత సింగ్. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడటం పెద్ద లోటే.

English summary
A day after resigning from Congress, Sanjay Sinh on Wednesday joined Bharatiya Janata Party along with his wife Ameeta Sinh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X