• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గుజరాత్ మాజీ ఐపీఎస్‌కు జీవిత ఖైదు : కస్టోడియల్ డెత్ కేస్‌లో కోర్టు తీర్పు

|

జామ్‌నగర్ : గుజరాత్ అల్లర్ల సమయంలో పోలీసు అదుపులో ఉన్న వారు మరణించిన కేసులో అప్పటి ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్‌ను కోర్టు దోషిగా తేల్చింది. భట్ నిర్లక్ష్యం వల్లే ఒకరు చనిపోయారని జామ్‌నగర్ సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులో భట్‌కు యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్టు తెలిపింది. అయితే పోలీసు ఉన్నతాధికారి జీవితఖైదు విధించడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది.

అదుపులోకి తీసుకుంటే ..

అదుపులోకి తీసుకుంటే ..

1990లో గుజరాత్‌‌ అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జామ్‌నగర్ జిల్లా ఏఎస్పీ సంజీవ్ భట్‌ పనిచేస్తున్నారు. జామ్ జోద్ పూర్ పట్టణంలో అల్లర్లు జరిగే సమయంలో భట్ .. దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలో చాలా మంది అల్లర్ల వాళ్ల గాయపడ్డారు. దీంతోపాటు ప్రభుదాస్ వైష్ణనీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వాస్తవానికి అతనిని విడుదల చేశాక .. చికిత్స తీసుకుంటూ మ‌ృతిచెందాడు. అయితే దీనిపై అతని సోదరుడు సంజీవ్ భట్‌పై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్‌లో మరో ఆగురుగురు పోలీసుల పేర్లు కూడా చేర్చారు. భట్ సహా ఆరుగురు పోలీసుల వేధింపులు భరించలేక తన సోదరుడు చనిపోయాడని పేర్కొన్నారు. ఈ కేసుపై జామ్‌నగర్ సెషన్స్ కోర్టులో వాదనలు జరిగాయి. ఇవాళ న్యాయమూర్తి తన తీర్పును వెల్లడించారు.

విచారణకు స్వీకరించని పిటిషన్ ...

విచారణకు స్వీకరించని పిటిషన్ ...

ఈ కేసుకు సంబంధించి గత వారం మరో పిటిషన్ కూడా దాఖలు చేశాడు భట్. మరో 11 మందిని విచారించాలని కోరగా .. కోర్టు తిరస్కరించింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, అజయ్ రాస్తోగి నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ .. ఇప్పటికే ఈ పిటిషన్ విచారించినందున తాము మళ్లీ విచారించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అల్లర్లు జరిగిన సమయంలో భట్ 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అందులో ప్రభుదాస్ అనే అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడంతో కేసు నమోదైంది.

ఇలా లైమ్‌లైట్‌లోకి ...

ఇలా లైమ్‌లైట్‌లోకి ...

వాస్తవానికి సంజీవ్ భట్‌ 2011లో వెలుగులోకి వచ్చారు. గుజరాత్ అల్లర్లకు అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ పాత్ర ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భట్ పిటిషన్‌తో ఒక్కసారికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. అయితే ఆ తర్వాత భట్‌ను గుజరాత్ ప్రభుత్వం వేధింపులకు గురిచేసింది. ఆయనను అకారణంగా విధుల నుంచి తప్పించింది. తమకు చెప్పకుండా విధులకు హాజరవడం లేదని, అలాగే తన అధికార వాహనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలపై సస్పెండ్ చేశారు. తర్వాత 2015లో విధుల నుంచి మొత్తానికి తొలగించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత కస్టిడియల్ డెత్ కేసు విచారణలో భట్‌ను దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
the Jamnagar Sessions Court has sentenced former IPS officer Sanjeev Bhatt to life imprisonment under Section 302 of the Indian Penal Code in connection with a custodial death in 1990. Bhatt came in the spotlight for filing an affidavit in Supreme Court in 2011 against Narendra Modi, the then chief minister of Gujarat for his role in the 2002 riot. Last week the Supreme Court refused to entertain a plea of Bhatt, seeking to examine 11 additional witnesses in the 30-year-old custodial death case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more