• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Ex lover: బీచ్ లో మాజీ గర్ల్ ఫ్రెండ్ సెల్ఫీ, హోటల్ లో ప్రియుడితో ఎంజాయ్, మాజీ లవర్ ఏం చేశాడంటే !

|

బెంగళూరు/ గోకర్ణ/మంగళూరు: ప్రియుడితో విడిపోయిన మహిళ వేరే వ్యక్తితో ఎంజాయ్ చేస్తోంది. మాజీ ప్రియురాలి మీద ఆమె ప్రియుడికి పగ ఉంది. తనకు కనపడకుండా తప్పించుకుని వేరే వ్యక్తితో ఎంజాయ్ చేస్తున్న మాజీ ప్రియురాలి అంతు చూడాలని డిసైడ్ అయ్యాడు. లాక్ డౌన్ సడలించడంతో ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి బీచ్ లోకి వెళ్లిన మాజీ ప్రియురాలు సెల్ఫీ తీసి దానిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. సోషల్ మీడియాలో మాజీ గర్ల్ ఫ్రెండ్ సెల్ఫీ చూసిన ప్రియడు ఆమె ఎక్కడ ఉందో అడ్సస్ తెలుసుకుని వెతుక్కుంటూ వెళ్లాడు. మాజీ ప్రియురాలు ఉంటున్న హోటల్ లోనే వేరే రూమ్ తీసుకున్న మాజీ ప్రియుడు పక్కా ప్లాన్ తో థ్రిల్లర్ సినిమా టైపులో ఆమె మీద దాడి చేశాడు. వైర్ తో గొంతు బించి పెన్ తీసుకుని మాజీ ప్రియురాలు ముఖం చెక్కేసి గొంతు బిగించేశాడు. మాజీ ప్రియురాలు చనిపోయిందని ఆమెను అక్కడే వదిలేసి పారిపోయి కేసు నుంచి తప్పించుకోవడానికి పక్క రాష్ట్రానికి పారిపోయి గుండు గీయించుకుని గిర్రుగిర్రున తిరిగేశాడు.

Illegal affair: భర్త ఎప్పుడు బయటకు పోతాడా అని ఎదురు చూసిన భార్య, చట్నీ చేసి చంపేసి !Illegal affair: భర్త ఎప్పుడు బయటకు పోతాడా అని ఎదురు చూసిన భార్య, చట్నీ చేసి చంపేసి !

 ప్రేమపావురాలు ఎంజాయ్

ప్రేమపావురాలు ఎంజాయ్

మహారాష్ట్రలోని పూణేకి చెందిన తుషార్ మరాఠే అలియాస్ తుషార్, హర్యాణాకు చెందిన రింకి (పేరు మార్చడం జరిగింది) అనే యువతి ప్రేమించుకున్నారు. అందరి ప్రేమికుల్లాగా తుషార్, రింకి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. రిసార్టులు, ఇతర రాష్ట్రాల్లోని పర్యాటక కేంద్రాలు, పబ్ లు, బీచ్ లు ఎక్కడపడితే అక్కడికి టూర్లు వేసి జల్సా చేశారు.

 హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు

హ్యాండ్ ఇచ్చిన ప్రియురాలు

చాలా కాలం ప్రియుడు తుషార్ ప్రియురాలు రింకితో ఎంజాయ్ చేశాడు. రింకి, తుషార్ మద్య అభిప్రాయబేదాలు వచ్చాయి. కొంతకాలం రింకి, తుషార్ గొడవ పడుతూ వచ్చారు. రానురాను రింకి ఆమె ప్రియుడు తుషార్ కు దూరం అవుతూ వచ్చింది. కొంతకాలానికి రింకి ఆమె ప్రియుడు తుషార్ కు పూర్తిగా హ్యాండ్ ఇచ్చేసింది.

ప్రియురాలికి కొత్త ప్రియుడు

ప్రియురాలికి కొత్త ప్రియుడు


ప్రియుడు తుషార్ తో విడిపోయిన రింకి వేరే వ్యక్తితో ఎంజాయ్ చేస్తోంది. మాజీ ప్రియురాలు రింకి మీద ఆమె ప్రియుడు తుషార్ పగ పెంచుకున్నాడు. తరువాత రింకి ఎక్కడ ఉందో ఆమె మాజీ ప్రియుడు తుషార్ కనిపెట్టలేకపోయాడు. తనకు కనపడకుండా తప్పించుకుని వేరే వ్యక్తితో ఎంజాయ్ చేస్తున్న మాజీ ప్రియురాలు రింకి అంతు చూడాలని తుషార్ డిసైడ్ అయ్యాడు.

మాజీ ప్రియురాలిని పట్టించిన సెల్ఫీ

మాజీ ప్రియురాలిని పట్టించిన సెల్ఫీ


లాక్ డౌన్ సడలించడంతో ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి రింకి కర్ణాటకలోని కారవార సమీపంలోని గోకర్ణ బీచ్ లోకి వెళ్లింది. మాజీ ప్రియురాలు రింకి సెల్ఫీ తీసి దానిని ఇన్ స్టాగ్రామ్ లో, ఫేస్ బుక్ లో పోస్టు చేసింది. రింకి తీసిన సెల్ఫీలో ఆమె వెనుక గోకర్ణ బీచ్ కు సంబంధించిన క్లూ తెలుసుకున్న తుషార్ ఆమెను అక్కడే లేపేయాలని స్కెచ్ వేశాడు.

సినిమా స్టోరీ తలతన్నిన తుషార్ స్కెచ్

సినిమా స్టోరీ తలతన్నిన తుషార్ స్కెచ్


జులై 7వ తేది ప్రియురాలు గోకర్ణలో ఉందని తెలుసుకున్న తుషార్ నేరుగా కారులో ఆక్కడికి వెళ్లిపోయాడు. ముఖానికి మాస్క్ వేసుకుని మాజీ ప్రియురాలు రింకి ఆచూకి తెలుసుకున్నాడు. రింకి ఆమె ప్రస్తుత ప్రియుడు బస చేసిన లాడ్జ్ అడ్రెస్ తెలుసుకున్న తుషార్ అదే లాడ్జ్ రూమ్ అద్దెకు తీసుకున్నాడు. లాడ్జ్ లోని రూమ్ లో నుంచి రాత్రి రింకి ప్రస్తుత ప్రియుడు ఏదో తీసుకురావడానికి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో రూమ్ లో రంకి మాత్రమే ఉందని తుషార్ తెలుసుకున్నాడు.

 కసితీర ముఖం చెక్కేసిన మాజీ ప్రియుడు

కసితీర ముఖం చెక్కేసిన మాజీ ప్రియుడు

మాజీ ప్రియురాలు ఉన్న రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన తుషార్ హేర్ డ్రైయ్ వైర్ తీసుకుని ఆమె గొంతు బిగించాడు. బెడ్ మీద పడిపోయిన మాజీ ప్రియురాలు రింకి ముఖాన్ని పెన్ తీసుకుని ఇష్టం వచ్చినట్లు పొడిచేశాడు. ఆమె కేకలు వెయ్యడానికి కూడా అవకాశం ఇవ్వకుండా బెడ్ మీద ఉన్న తలదిండు తీసుకుని ఆమె ముఖం మీద గట్టిగా అదిమేశాడు. ఊపిరిఆడక రింకి స్పృహ కోల్పోయింది. ప్రియురాలు చనిపోయిందని భావించిన తుషార్ అక్కడి నుంచి పరారైనాడు.

గుండు కొట్టుకుని తిరిగిన మాజీ ప్రియుడు

గుండు కొట్టుకుని తిరిగిన మాజీ ప్రియుడు

లాడ్జ్ లోని రూమ్ లోకి వెళ్లిన ప్రియుడు రింకిని చూసి షాక్ అయ్యి గట్టిగా కేకలు వేశాడు. రింకిని ఆసుపత్రికి తరలించడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చేర్చారు. కొంచెం కోలుకున్న రింకి తన మాజీ ప్రియుడు తుషార్ ఇలా చేశాడని గోకర్ణ పోలీసులకు చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు తుషార్ కోసం గాలించారు. పూణేకి 70 కిలోమీటర్ల దూరంలోని ఊర్లో మకాం వేసిన తుషార్ తనను గుర్తు పట్టకుండా గుండు గీయించుకుని తరుగుతున్నాడని తెలుసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. రింకి ముఖాన్ని పెన్ తో ఇష్టం వచ్చినట్లు చెక్కేయడంతో ఆమెకు తీవ్రగాయాలైనాయని పోలీసులు చెప్పారు.

English summary
Ex lover: Gokarna police arrested man who attacked ex-girlfriend to kill her after view her selfie at Gokarna beach in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X