వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ సహయాన్ని కోరిన మాల్దీవుల దేశాధ్యక్షుడు నసీద్

By Narsimha
|
Google Oneindia TeluguNews

మాలే: మాల్దీవుల్లో చోటు చేసుకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ మాజీ అధ్యక్షుడు మహ్మద్ నసీద్ భారత్ సహయాన్ని కోరారు.మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో 15 రోజుల పాటు అత్యవసర పరిస్థితులను ప్రకటిస్తూ ఆ దేశాధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ సోమవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు.

మాల్దీవుల్లో ఎమర్జెన్సీని ప్రకటించిన అధ్యక్షుడు యామీన్ మాల్దీవుల్లో ఎమర్జెన్సీని ప్రకటించిన అధ్యక్షుడు యామీన్

మాల్దీవుల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా 15 రోజుల పాటు ఎమెర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించిన మాల్దీవ్స్ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్.. తమ దేశ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అబ్దుల్లా సయీద్‌తో పాటు మరో జడ్జి అలీ అహ్మద్‌ను అరెస్టు చేయించారు. దీంతో ఆ దేశ బహిష్కృత మాజీ అధ్యక్షుడు మహ్మద్ నసీద్ భారత్ సాయాన్ని కోరారు.

తమ దేశ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భారత్ తక్షణమే జోక్యం చేసుకోవాలని, రాయబారులను, మిలటరీని వెంటనే పంపాలని ఆయన కోరారు. కాగా, రాజకీయ రెబల్స్‌ను విడిచిపెట్టాలని కొన్ని రోజుల క్రితం మాల్దీవుల అత్యన్నత న్యాయస్థానం ఆదేశించగా, కోర్టు తీర్పును ధిక్కరిస్తూ ఆ ఆదేశాలను తిరిగి రాయాలని ఆ దేశ అధ్యక్షుడు ఆదేశిస్తూ పలువురిని అరెస్టు చేయిస్తుండడంతో కలకలం చెలరేగుతోంది.

English summary
Exiled former Maldivian president Mohamed Nasheed Tuesday urged India to "act swiftly" to help in resolving the ongoing political crisis in the island nation that escalated after President Abdulla Yameen declared a state of emergency and troops arrested the top judge of the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X