వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ కి కేంద్ర మాజీ మంత్రి కీలక సూచనలు..!ఆయనే మా అధ్యక్షుడంటున్న టీపీసీసీ ఎన్నారై సెల్..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్: కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీకి కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాన్న రాహుల్ గాంధీ నిర్ణయం సరైనది కాదని యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం సంక్షోభంలో ఉందని, రాహుల్ నిర్ణయంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. రాజీనామా విషయంలో రాహుల్ గాంధీ నిర్ణయం సరికాదని, ప్రజాభిప్రాయాన్ని కోల్పోయే అవకాశం ఉంటుందని యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 ఎంపీ స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది.

2014 ఎన్నికలతో పోలిస్తే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పుంజుకుందని చెప్పవచ్చు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ 352 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ నే మా నాయకుడని టీపీసీసీ ఎన్నారై సెల్ తీర్మానించింది. గురువారం లండన్ లో టీపీసీసీ ఎన్నారై సెల్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ జీ అధ్యక్ష పదవి రాజీనామాని వెనక్కి తీసుకోవాలని కమిటీ తీర్మానం చేసింది. అనంతరం లండన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ఇంచార్జ్ రామ చంద్ర కుంతియాకి రాహుల్ గాంధీ జి రాజీనామా వెనక్కు తీసుకొని కాంగ్రెస్ కి నాయకత్వ బాధ్యతలు చేబట్టాలని కోరుతూ కమిటీ సంతకాలతో కూడిన వినతిపత్రం సమర్పించారు.

ex-minister key advise to rahul.!TPCC NRI cell saying rohul only the president ... !!

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్, కో కన్వీనర్ సుధాకర్ గౌడ్, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ యు కె అధ్యక్షుడు కమల్ డాలివాల్. టీపీసీసీ ఎన్నారై సెల్ అడ్వైసరి మెంబెర్ ప్రవీణ్ రెడ్డి, కార్యదర్శి బాలకృష్ణ రెడ్డి, కోర్ సభ్యులు మణికంఠ, నగేష్ లు పాల్గొన్నారు

English summary
Former Union Minister Yashwant Sinha has made several suggestions to Congress leader Rahul Gandhi. Yashwant Sinha made it clear that Rahul Gandhi's decision to withdraw from the post of Congress president is not correct. Yashwant Sinha said that Congress party is currently in a crisis and Rahul's decision is going to be misleading people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X