వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ఎంపీలకు షాక్.. బంగ్లాలు ఖాళీ చేయకపోతే కరెంట్, నీళ్లు కట్.. కేంద్రం అల్టిమేటం..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : మాజీ ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. పదవీకాలం ముగిసినప్పటికీ ఇంకా ప్రభుత్వ నివాస గృహాలు ఖాళీ చేయని ఎంపీలకు షాక్ ఇచ్చింది. వారం రోజుల పాటు గడువు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ త్వరగా బంగ్లాలు ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా కోరింది. ఒకవేళ మొండికేస్తే గడువిచ్చిన వారంలో చివరి మూడు రోజులు కరెంట్, వాటర్ సప్లై కట్ చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది.

లుటెయిన్స్ ప్రాంగణంలోని పలు నివాసాల్లో చాలామంది మాజీ ఎంపీలు ఇంకా అక్కడే ఉంటున్నారు. పదవీకాలం ముగిసినా కూడా ఇంకా బంగ్లాలు ఖాళీ చేయకుండా ఉన్న మాజీలు ఇకపై అక్కడ ఉండేందుకు వీల్లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఆ క్రమంలో ఆయా బంగ్లాల నుంచి మాజీలను ఖాళీ చేయించేందుకు సన్నద్ధమవుతున్నారు హౌసింగ్ కమిటీ ఛైర్మన్ సీఆర్ పాటిల్.

 Ex MPs over 200 Asked To Vacate Bungalows In A week

మైనర్ రాష్ డ్రైవింగ్.. బాలుడితో పాటు తండ్రి కూడా అరెస్ట్..!

పార్లమెంట్ సమావేశాల ప్రారంభ నేపథ్యంలో మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు దేశ రాజధానిలో ఉండేందుకు ప్రభుత్వ నివాస గృహాలు కరువయ్యాయి. ఆ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొత్త ఎంపీలు నివాసముండటానికి బంగ్లాలు సరిపోవడం లేదని సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే కొన్ని నివాస సముదాయాలకు అవసరమైన మేర మరమ్మతులు చేయించి కొత్త ఎంపీలకు అందించనున్నట్లు మోడీ ప్రకటించారు.

అదలావుంటే లుటెయిన్స్ ప్రాంగణంలో మాజీ ఎంపీలు దాదాపు 200 మంది వరకు ఇంకా అక్కడే నివాసముంటున్నట్లు తేలింది. 16వ లోక్‌సభ రద్దు అయినప్పటికీ ఇంకా వారు కొనసాగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా సభ రద్దు నాటి నుంచి నెల రోజుల్లోగా ఆ బంగ్లాలు వేకెట్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో మాజీ ఎంపీలు జూన్ 25 నాటికే ఖాళీ చేయాల్సి ఉంది. గడువు ముగిసి రెండు నెలలు కావొస్తున్నా.. ఇంతవరకు వారు ఖాళీ చేయకపోవడం గమనార్హం.

English summary
All former MPs have been asked to vacate their government accommodations, mostly the heritage bungalows in the posh Lutyen's zone, the government said On monday. With overstaying being the norm, the government has now taken a hard line. The MPs have been given a deadline of seven days, but at the end of three days, officials have been asked to stop power and water supply to these accommodations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X