వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిడ్నాప్, హత్య: ఆర్డేజీ మాజీ ఎంపీకి జీవిత ఖైదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

పాట్నా: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మాజీ పార్లమెంటు సభ్యుడు షాబుద్దీన్, మరో ముగ్గురికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2004వ సంవత్సరంలో శివన్ జిల్లాలో ఎత్తుకెళ్లి, హత్య చేసిన కేసులో వీరికి శుక్రవారం కోర్టు జీవిత ఖైదు విధించింది.

బీహార్‌లోని శివన్ జిల్లాలో 11 ఏళ్ల క్రితం సోదరులను వీరు ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత హత్య చేసినట్లుగా కోర్టు నిర్ధారించింది. దీంతో వారికి న్యాయస్థానం శిక్ష విధించింది.

Ex-RJD MP Mohd Shahbuddin sentenced to life in prison

అంతకుముందు మంగళవారం నాడు (డిసెంబర్ 9)న కోర్టు షాబుద్దీన్‌తో పాటు షేక్ అస్లామ్, ఆరిఫ్ హుస్సేన్, రాజ్ కుమార్ షాలను కోర్టు దోషులుగా తేల్చింది. వారిని సెక్షన్ 302 (మర్డర్), 364ఏ(కిడ్నాప్ తదితరాలు), 201 (ఆధారాల ధ్వంసం), 120బి (కుట్ర) కింద కేసు నమోదయింది.

సమాచారం మేరకు చంద్రశేఖర ప్రసాద్‌ అనే వ్యక్తి ముగ్గురు కుమారులను ఆగస్టు 16, 2004లో గోషాల రోడ్డులోని ఇంటి నుంచి ఎత్తుకెళ్లారు. వారిని ప్రతాప్పుర్ గ్రామానికి తీసుకు వెళ్లారు. అక్కడ వారి పైన యాసిడ్ పోశారు. ఈ ఘటనలో సోదరులు గిరిష్, సతీష్ చనిపోయారు. కానీ మరో కొడుకు రాజీవ్ రౌషన్ తప్పించుకున్నాడు.

English summary
Former RJD MP Md. Shahbuddin and three other accused were on Friday sentenced to life imprisonment in connection with the 2004 Siwan abduction and murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X