వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దక్షిణాదిలో తెలంగాణ మినహ వైఫల్యం చెందిన అధికార పార్టీలు.. పుంజుకున్న బీజేపీ

|
Google Oneindia TeluguNews

2019 ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 10 నుండి మే 19 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాల్లో పూర్తిగా ఎన్డీఏకు అధిక స్థానాలు వచ్చాయి. ఈనేపథ్యంలోనే ఇండియా టుడే ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో పూర్తి మెజరిటీ దక్కే అవకాశాలు కనిపించాయి. .పార్టీ చీఫ్ అమిత్ షాతో పాటు బీజేపీ నాయకులు చెప్పినట్టుగా 300 మార్కు దాటింది. కాగా ఇండియా టుడే ప్రకటించిన ఫలితాల్లో ఎన్డీఏకు అలయెన్స్...339 -368 స్థానాలు ప్రకటించగా యూపిఏ పక్షలకు 77 -1o8 గెలుపొందనుండగా ఇతర పార్టీలు కలిసి 69 -95 స్థానాలు స్థానాలు గెలుపోందనున్నట్టు ప్రకటించింది.

దక్షిణాదిలో వైఫల్యం చెందిన అధికార పార్టీలు

దక్షిణాదిలో వైఫల్యం చెందిన అధికార పార్టీలు

అయితే దక్షిణాదీ రాష్ట్ర్రాల్లో కొంత సమ్మిళిత ఫలితాలు కనిపించాయి. సాధారణంగా ఆయా రాష్ట్ర్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు ఎంపీ అభ్యర్థులను కూడ సునాయంగా గెలుచుకునే అవకాశాలు ఉంటాయి. ఇతర పార్టీలకు ఒకటి రెండు మినహ మెజారీటీ సీట్లు మాత్రం అధికార పార్టీలకు వ్యతిరేకంగా రాష్ట్ర్రాల్లో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఈనేపథ్యంలోనే దక్షిణాదిలో అధికారంలో ఉన్న ఆరు రాష్ట్ర్రాల్లో తెలంగాణ మినహా మిగతా అయిదు రాష్ట్ర్రాల్లో కూడ అధికార పక్షాలను కాదని ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు మెజారిటి ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఇక జాతీయ పార్టీల విషయంలోకి వస్తే కర్ణాటక మినహా మిగతా రాష్ట్ర్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా కొనసాగింది.

 ఏపిలో ప్రతిపక్ష వైసీపీకి 18 నుండి 20, అధికార టీడీపీకి 4 నుండి 6 స్థానాలు..

ఏపిలో ప్రతిపక్ష వైసీపీకి 18 నుండి 20, అధికార టీడీపీకి 4 నుండి 6 స్థానాలు..

కాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో మొదటి ఫేజ్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు,తమిళనాడు,కేరళ రాష్ట్ర్రాల్లో ,ఒడిశా,కర్ణాటక ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాలను చూస్తే నాలుగు దక్షినాది రాష్ట్ర్రాల ఫలితాల్లో ఏన్డీఏ 23 నుండి 33 యూపిఏ 55 నుండి 63 మెజారీటీ సీట్లు రాగా ఇతర పార్టీలైన టీఆర్ఎస్ వైసీపీలతో 35 నుండి 46 స్థానాలను ప్రకటించింది. అయితే అన్ని వర్గాలు ఉహించినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ అనుకున్న స్థాయిలోనే ఎంపీ సీట్లను స్వీప్ చేశాడు. వైసీపీ 2014లో 8 స్థానాలను గెలుపోందగా, ఇండియా టుడే ప్రకటించిన ఎగ్జిట్స్‌పోల్స్ ఫలితాల్లో 2019లో మాత్రం 100 శాతం అదనంగా సీట్లను వైసీపీ సాధించింది. ఈనేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీకి 18 నుండి 20 ఎంపీ స్థానాలు గెలుపొందనుండగా టీడీపీకి మాత్రం డీలా పడింది. అధికారంలో చంద్రబాబుపై ప్రజలు వ్యతిరేకత కనబరిచారు. ఈనేపథ్యంలోనే టీడీపీ మొత్తం 25 స్థానాలకు గాను 4 నుండి 6 స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశాలున్నట్టు ఎగ్గిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి.

తెలంగాణలో గత స్థానాలను నిలబెట్టుకున్న టీఆర్ఎస్... పుంజుకోనున్న బీజేపీ.. డీలా పడిన కాంగ్రెస్ ..

తెలంగాణలో గత స్థానాలను నిలబెట్టుకున్న టీఆర్ఎస్... పుంజుకోనున్న బీజేపీ.. డీలా పడిన కాంగ్రెస్ ..

ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ భావించినట్టుగా క్లీ్న్‌స్వీప్ చేసే పరిస్థితి మాత్రం కనిపించలేదు. కాని అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మరోసారి పట్టం కట్టిన పరిస్థితి కనిపించింది. కాగా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్‌కు ప్రజలు పట్టం కట్టిన పరిస్థితి తెలిసిందే .అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ భావించినట్టుగా క్లీన్‌స్వీప్ చేసే పరిస్థితి మాత్రం కనిపించలేదు. ఈనేపథ్యంలోనే టీఆర్ఎస్ పార్టీకి గతంలో కంటే ఒక స్థానం పెరిగడంతోపాటు తగ్గే అవకాశాలు ఉన్నట్టు ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల్లో వెలువడ్డాగా మొత్తం తెలంగాణలోని 17 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ 10 నుండి 12 స్థానాలు గెలుపొందగా.. బీజేపీకి 1 నుండి 2 స్థానాలు గెలువబోతున్నట్టు తెలిపింది. కాగా బీజేపీ గతంలో ఉన్న సికింద్రబాద్ పార్లమెంట్ స్థానంతోపాటు మహబుబ్ నగర్ , కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో గట్టి పోటి ఇచ్చింది. ఇక ఎంఐఎం తన స్థానాన్నిపదిలపరుచుకోగ కాంగ్రెస్ మాత్రం తన స్థానాలను పదిలపరచుకోలేక పోతున్నట్టు ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెలువరించాయి.

కేరళలో యూడిఎఫ్ అధిక్యం.. అధికార పక్షం డీలా..

కేరళలో యూడిఎఫ్ అధిక్యం.. అధికార పక్షం డీలా..

కేరళలో కాంగ్రెస్ మిత్రపక్షాలైన యూడిఎఫ్ అధిక్యత సాధించనుంది. కాగా యూడిఏఫ్ అధ్యర్యంలోని పార్టీలు 15 నుండి 16 స్థానాలు కైవసం చేసుకోబోతుండగా అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ పక్షాలు 3 నుండి 5 స్థానాలు కైవసం చేసుకొనున్నాయి. కాగా కెరళలోని వయానాడ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటిచేయగా ఆయన అక్కడి నుండి గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. మరోవైపు ఇప్పటివరకు కేరళలో బీజేపీ ఖాత తెరవలేదు. కాని ఈసారి ఎన్నికల్లో మాత్రం ఒక సీటు దక్కే అవకాశం ఉన్నట్టు ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెలువడ్డాయి. దీంతో కమ్యునిస్టుల కోట అయిన కేరళలో కూడ బీజేపీ ఖాతా తెరవనున్నట్టు స్పష్టం అవుతుంది. కాగ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ 8 స్థానాలు గెలుచుకోగ అధికార సీపిఎం 5స్థానాల్లో గెలుపోందింది.

కర్ణాటకలో చిత్తయిన కాంగ్రెస్ జేడిఎస్ అలయెన్స్

కర్ణాటకలో చిత్తయిన కాంగ్రెస్ జేడిఎస్ అలయెన్స్

కర్ణాటక రాష్ట్ర్రంలో అధికార జేడిఏస్ కూడ చిత్తుగా ఓడిపోనుట్టు ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెలువడ్డాయి.. జేడిఎస్ అధికారంలో ఉన్న ఆ పార్టీని ప్రజలు ఆధరించలేదు. దీంతో అధికార జేడిఎస్‌తో జతకట్టిన కాంగ్రెస్ పార్టీని సైతం ప్రజలు వ్యతిరేకించారు. గత సంవత్సరమే అధికారంలో వచ్చిన జేడిఎస్‌ను కాదని బీజేపీకి పట్టం కట్టారు. ఈనేపథ్యంలోనే 2014లో బీజేపీకి 17 సీట్లను కైవసం చేసుకోగ 2019 ఎన్నికల్లో కూడ 21 నుండి 25 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉన్నట్టు ఫలితాలు పరకటించింది. ఇక కాంగ్రెస్ ,జేడిఎస్ పార్టీలకు 3 నుండి 6 స్థానాలు కైవసం చేసుకోనుంది.

ఒడిశాలో పుంజుకున్న బీజేపీ.... అధికార నవీన్‌ను కాదన్న ప్రజలు

ఒడిశాలో పుంజుకున్న బీజేపీ.... అధికార నవీన్‌ను కాదన్న ప్రజలు

ఒడిశాలో సైతం బీజేపీ పుంజుకుంది. దీంతో దక్షిణాదీ ఉన్న రాష్ట్ర్రాల్లో అటు కర్ణటకతోపాటు ఇటు ఒడిశా బీజేపీ ఖాతాలో చేరింది. ఈనేపథ్యంలోనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అధికార బీజు జనతాదల్ పార్టీని కాదని బీజేపీకి పట్టం కట్టారు. మొత్తం 21 పార్లమెంట్ స్థానాలకు గాను బీజేపీ 15 నుండి 19 స్థానాలు ఇక అధికార బీజేడీ 2 నుండి 6 స్థానాలు గెలుపోందనున్నారు . కాగా 2014 పార్లమెంట్ ఎన్నికల్లో అధికార బీజేడీ మొత్తం 21 స్థానాలకు గాను 20 స్థానాలను కైవసం చేసుకుని క్లిన్‌స్వీప్ చేసింది. కాగా ఇటివల వచ్చిన ఫోని తుఫాను నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అంత్యంత శ్రద్ద తీసుకుని అక్కడి పరిస్థితులను పరీశీంచారు. దీంతో నవీన్ పట్నాయక్ తో మంచి సంబంధాలను కొనసాగించాడు.

తమిళనాడులో విఫలమైన అధికార ఏఐఏడిఎంకే,బీజేపీ పోత్తు,

తమిళనాడులో విఫలమైన అధికార ఏఐఏడిఎంకే,బీజేపీ పోత్తు,

ఇక తమిళనాడులో కూడ అధికార ఏఐఏడిఎంకే వైఫల్యం చెందింది. గత కొద్ది రోజుల క్రితం నుండి జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అధికార ఏఐఏడిఎంకేతో బీజేపీ మంచి సంబంధాలనే కొనసాగిస్తూ వచ్చింది. దీంతో అటు బీజేపీ ఇటు ఏఐఏడిఎంకే పార్టీలు పోత్తులు పెట్టుకుని ఎన్నికల్లోకి వెళ్లాయి అయితే వీటీ అలయెన్స్ కేవలం 3 నుండి 4 స్థానాలు కైవసం చేసుకోనుండగా కాంగ్రెస్ పార్టీ ,డీఎంకే అలయెన్స్ కు 34 నుండి 38 సీట్లను కైవసం చేసుకోనుంది. కాగా 2014 ఎన్నికల్లో మొత్తం 39 స్థానాలకు గాను 37 స్థానాలను గెలుచోకోనున్నట్టు ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి..

English summary
The Narendra Modi-led NDA government is set to come back to power with a landslide majority,The NDA was predicted to win between 339 and 365 seats while the UPA was projected to win 77-108 seat but in south states governaments has failed. but most of the leading governments in southern states were fail to capture thair votes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X