వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: డోక్లామ్‌లో కొత్త రోడ్ల నిర్మాణం, శాటిలైట్ చిత్రాల్లో వెలుగు చూసిన డ్రాగన్ దారుణం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య అత్యంత వివాదాస్పదమైన డోక్లామ్ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు మొదలు పెట్టింది. ఈ మేరకు శాటిలైట్ చిత్రాలు వెలుగు చూశాయి.

షాక్: ఇండియా డ్రోన్ కూల్చివేసిన చైనా, కారణమిదేషాక్: ఇండియా డ్రోన్ కూల్చివేసిన చైనా, కారణమిదే

భారత్, చైనాల మధ్య ఇటీవలే డోక్లామ్ వివాదం రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులను తీసుకువచ్చింది. అయితే ఈ వివాదాన్ని రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకొన్నాయి.

షాక్: రంగు మారిన సియాంగ్ నీరు, మృత్యువాత పడ్డ చేపలు, ఎందుకంటే?షాక్: రంగు మారిన సియాంగ్ నీరు, మృత్యువాత పడ్డ చేపలు, ఎందుకంటే?

అయితే తాజాగా చైనాలో ఇండియాకు చెందిన మానవరహిత డ్రోన్ పొరపాటున ప్రవేశించింది. అయితే ఈ విషయాన్ని ఇండియా చైనాకు సమాచారం ఇచ్చిందని ఇండియా ప్రకటించింది. అయితే తమ భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇండియా డ్రోన్ ను పేల్చివేశామని చైనా ప్రకటించింది.

డోక్లామ్ వద్ద రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన చైనా

డోక్లామ్ వద్ద రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన చైనా

భారత్‌ చైనాల మధ్య అత్యంత వివాదాస్పదమైన డోక్లామ్‌ ప్రాంతానికి సంబంధించి షాకింగ్‌ విషయం బయటపడింది. చైనా రహస్యంగా డోక్లామ్ వివాదాస్పద ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులను చేపట్టినట్టు శాటిలైట్ చిత్రాల ద్వారావెలుగు చూసింది. రెండు వైపుల రోడ్డు విస్తరించుకుంటూ స్పష్టమైంది.

13 నెలల క్రితమే రోడ్డు నిర్మాణం

13 నెలల క్రితమే రోడ్డు నిర్మాణం


డోక్లామ్ వద్ద వివాదాస్పద స్థలంలో కొత్తగా చైనా రోడ్డు నిర్మాణ పనులు డోక్లామ్‌లో మొదలు పెట్టినట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఈ మేరకు 13 నెలల క్రితమే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించినట్టు ఈ శాటిలైట్ చిత్రాలు స్పష్టం చేస్తున్నాయి.

అక్టోబర్ -డిసెంబర్ మాసాల్లో రోడ్డు నిర్మాణ పనులు

అక్టోబర్ -డిసెంబర్ మాసాల్లో రోడ్డు నిర్మాణ పనులు

ఈ ఏడాది అక్టోబర్ 17 నుండి డిసెంబర్ 8వ, తేది మధ్యలోనే ఈ రోడ్డును నిర్మించినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.డోక్లామ్‌ విషయంలో భారత్‌ చైనాకు మధ్య ఈ ఏడాది ప్రారంభంలో తీవ్ర వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. దాదాపు 70 రోజుల పాటు ఇరు దేశాల సైన్యం మధ్య సంఘర్షణ నెలకొంది. అయితే ఈ విషయమై రెండు దేశాల మధ్య రాజీ జరిగినా తాజాగా వెలుగు చూసిన శాటిలైట్ చిత్రాలు వివాదానికి కారణమయ్యాయి.

డోక్లామ్ సమీపంలో రెండు రోడ్లు

డోక్లామ్ సమీపంలో రెండు రోడ్లు


శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే రెండు రోడ్లను నిర్మించినట్టు తేలింది. అందులో ఒకటి ఒక కిలోమీటర్‌ కాగా మరొకటి 4.5 కిలోమీటర్లు(ఇది డోక్లామ్‌కు అతి సమీపంలో) ఉందని తెలిసింది. అలాగే, ఇది వరకే నిర్మించిన రోడ్డుతోపాటు తాజాగా నిర్మించిన 1.3కిలో మీటర్ల రోడ్డుతో కలిపి మొత్తం 7.3 కిలో మీటర్లు తూర్పు వైపు విస్తరిస్తున్నట్లు గుర్తించారు.

English summary
New satellite images of the Doklam area to the east of Sikkim reveal that the Chinese have expanded multiple stretches of road in the disputed area, just a short distance from the site where Indian and Chinese soldiers faced off for 70 days earlier this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X