వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పీఎన్‌బీ స్కాం: అతిపెద్ద పురోగతి.. నీరవ్ మోడీ సీక్రెట్ బ్యాంక్ అకౌంట్‌ను ఐటీ పట్టేసింది!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోడీ కేసులో ఆదాయపన్ను శాఖ అతిపెద్ద పురోగతి సాధించింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ.13,700 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్‌ మోడీ 'సీక్రెట్‌' బ్యాంకు అకౌంట్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్‌ కనిపెట్టేసింది.

న్యూయార్క్‌లో నీరవ్ మోడీ? మన్‌హట్టన్‌లోని లగ్జరీ సూట్‌లో భార్యతో, అంబానీతో కనెక్షనేంటి?న్యూయార్క్‌లో నీరవ్ మోడీ? మన్‌హట్టన్‌లోని లగ్జరీ సూట్‌లో భార్యతో, అంబానీతో కనెక్షనేంటి?

లండన్‌లోని బార్క్లేస్ పీఎల్‌సీ బ్యాంక్‌లో నీరవ్‌కు ఈ అకౌంట్‌ ఉన్నట్టు ఐటీ డిపార్ట్‌మెంట్‌ గుర్తించింది. ఇండియాటుడే.ఇన్‌తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన ఐటీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ సీనియర్‌ అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు.

పీఎన్‌బీ స్కాం: ఇండియాలో ముంచేసి.. అమెరికాలో దివాలా పిటిషన్ వేసిన నీరవ్ మోడీ!పీఎన్‌బీ స్కాం: ఇండియాలో ముంచేసి.. అమెరికాలో దివాలా పిటిషన్ వేసిన నీరవ్ మోడీ!

లండన్‌లోని బార్క్లేస్ పీఎల్‌సీ బ్యాంక్‌లో...

లండన్‌లోని బార్క్లేస్ పీఎల్‌సీ బ్యాంక్‌లో...

వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ లండన్‌లోని బార్క్లేస్ పీఎల్‌సీ బ్యాంక్‌లో మోడీ లిమిటెడ్‌ పేరుతో ఓ ‘సీక్రెట్‌' బ్యాంకు అకౌంట్‌‌ను తెరిచినట్టు ఆదాయపన్ను శాఖ అధికారులు తెలుసుకోగలిగారు. విచారణ అనంతరం ఈ అకౌంట్‌ నీరవ్‌ మోడీకి చెందిన వ్యక్తిగత అకౌంట్‌గా బహిర్గతమైనట్టు వెల్లడైందని ఐటీ అధికారి ఒకరు తెలిపారు.

అకౌంట్‌లో రూ.9-10 కోట్లకుపైగా బ్యాలెన్స్‌ ...

అకౌంట్‌లో రూ.9-10 కోట్లకుపైగా బ్యాలెన్స్‌ ...

తన వ్యక్తిగత డిపాజిట్ల కోసం ఈ అకౌంట్‌ను నీరవ్‌ ఆపరేట్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు నీరవ్ మోడీకి చెందిన ఈ అకౌంట్‌లో బ్యాలెన్స్‌ రూ.9-10 కోట్లకు పైగా ఉన్నట్టు తెలుస్తోంది. ఐటీ డిపార్ట్‌మెంట్‌ అభ్యర్థన మేరకు ముంబై మెట్రోపాలిటన్‌ కోర్టు నీరవ్‌ మోడీ సీక్రెట్‌ బ్యాంకు అకౌంట్‌కు చెందిన మనీ వివరాలపై ‘లెటర్‌ రోగటరీ(ఎల్‌ఆర్‌)' ని యూకేకు, లండన్‌కు పంపింది.

ఇక మరిన్ని బయటికొస్తాయి...

ఇక మరిన్ని బయటికొస్తాయి...

లండన్‌లోని బార్క్లేస్ పీఎల్‌సీ బ్యాంక్‌లో ఉన్న నీరవ్ మోడీ సీక్రెట్ బ్యాంకు అకౌంట్‌ను ఆధారంగా చేసుకుని, బార్క్లేస్‌ పీఎల్‌సీ బ్యాంకు, విదేశీ అధికారులు మరిన్ని వివరాలు తమతో షేర్‌ చేసుకునే అవకాశాలున్నాయని, దీంతో నీరవ్‌, మెహుల్‌ చౌక్సి పేర్లతో ఉన్న ఇలాంటి దాచి ఉంచిన అకౌంట్లను తాము గుర్తించగలుగుతామని ఐటీ శాఖ అధికారులు తెలిపారు.

15 దేశాల్లో వెయ్యికి పైగా బ్యాంకు అకౌంట్లు...

15 దేశాల్లో వెయ్యికి పైగా బ్యాంకు అకౌంట్లు...

పంజాబ్ నేనషల్ బ్యాంకు హామీతో విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న కోట్ల రుణాలను దారి మళ్లించడం కోసం భారత్‌తో సహా 15 దేశాల్లో వెయ్యికి పైగా బ్యాంకు అకౌంట్లను నీరవ్‌ మోడీ, మెహుల్‌ చౌక్సిలు తెరిచినట్టు దర్యాప్తు సంస్థలు ఇండియాటుడే.ఇన్‌కి ధృవీకరించాయి. ఈ బ్యాంకు అకౌంట్లను వందల కొద్దీ షెల్‌ కంపెనీలు, బోగస్‌ డైరెక్టర్ల పేర్లతో తెరిచినట్టు తెలుస్తోంది.

ఐటీ రిటర్నుల ఫైలింగ్స్‌లోనూ చెప్పలేదు...

ఐటీ రిటర్నుల ఫైలింగ్స్‌లోనూ చెప్పలేదు...

పీఎన్‌బీ స్కాం‌లో ప్రధాన నిందితుడైన నీరవ్ మోడీ ఇప్పటి వరకు తన బ్యాంకు అకౌంట్ల వివరాలను భారత ప్రభుత్వానికి బహిర్గతం చేయలేదు. ఐటీ రిటర్నుల ఫైలింగ్స్‌లోనూ అతడు వీటి గురించి పేర్కొనలేదు. ఇప్పటి వరకు విదేశీ బ్యాంకు అకౌంట్లు, ప్రాపర్టీల వివరాల కోసం ఈడీ 15పైగా దేశాలకు ఎల్‌ఆర్‌లను జారీచేసింది.

English summary
In a big development, the Income Tax department investigating the Rs 13,700 crore PNB fraud case has found a 'secret' bank account linked to fugitive diamantaire Nirav Modi at Barclays PLC Bank in London.Talking exclusively to Indiatoday.in, one senior official of I-T department confirmed that the 'secret' bank account was opened in the name of Modi Ltd. "But after further investigation, it was revealed that the account was a personal account of Nirav Modi. He was operating this account for his personal deposits", the official told Indiatoday.in.. As per the information available, the balance on this account exceeds Rs 9-10 crores.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X