వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Exit Poll... బెంగాల్, కర్ణాటకలో బీజేపీదే దూకుడు, మళ్లీ మోడీయే ప్రధాని: ఏ సర్వే ఏం చెప్పిందంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఏప్రిల్ 11వ తేదీన ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికలు మే 19వ తేదీన ముగిశాయి. ఏడు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోకసభ, తెలంగాణ లోకసభకు ఎన్నికలు మొదటి దశలోనే పూర్తయ్యాయి. పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. మరో నాలుగు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ రోజు (మే 19)న ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చాయి.

ఎగ్జిట్ పోల్ సర్వేలు బీజేపీ నేతృత్వంలోని నరేంద్ర మోడీదే హవా అని చెబుతున్నాయి. పాతికేళ్ల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి బీఎస్పీ-ఎస్పీలు ఉత్తర ప్రదేశ్‌లో ఏకమయ్యాయి. ఈ రాష్ట్రంలో తప్ప దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీ హవా కనిపిస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే కాస్త పుంజుకున్నప్పటికీ నరేంద్ర మోడీ ధాటిని మాత్రం తట్టుకోలేకపోయాయని ఎగ్జిట్ పోల్ సర్వేల ద్వారా అర్థమవుతోంది.

ఏపీలో వైసీపీ, టీడీపీ హోరాహోరీ: TDP 10-12 సీట్లు, YSRCP 13-14 సీట్లు, అసెంబ్లీ స్థానాలు...ఏపీలో వైసీపీ, టీడీపీ హోరాహోరీ: TDP 10-12 సీట్లు, YSRCP 13-14 సీట్లు, అసెంబ్లీ స్థానాలు...

జగన్, అన్నాడీఎంకేతో కలిపి 300కు పైగా స్థానాలు

జగన్, అన్నాడీఎంకేతో కలిపి 300కు పైగా స్థానాలు

మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో బీజేపీ హవా కనిపిస్తోంది. కాంగ్రెస్ పాలిత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటకల్లోను బీజేపీనే ఎక్కువ సీట్లు గెలుచుకోనుండటం గమనార్హం. ఉత్తర ప్రదేశ్‌లో కోల్పోయిన సీట్లను ఈశాన్య రాష్ట్రాల ద్వారా పూడ్చుకుంటున్నట్లుగా అర్థమవుతోంది. అదే సమయంలో తమిళనాడులో అన్నాడీఎంకే అధికారికంగా పొత్తు ఉంది. పదికి పైగా స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో అనధికారికంగా పొత్తు కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ బీజేపీ గూటికి చేరుకోవచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 300 సీట్ల నుంచి 375 సీట్ల వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జగన్, కేసీఆర్‌లు బీజేపీ కూటమిగానే చాలామంది భావిస్తున్నారు. అయితే వీరి మద్దతు లేకుండానే కేంద్రంలో మోడీ ప్రధాని అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దక్షిణాది ఒక్క కర్ణాటకలోనే..

దక్షిణాది ఒక్క కర్ణాటకలోనే..

దక్షిణాదిన బీజేపీ ఒక్క కర్ణాటకలోనే సత్తా చాటనుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు రావొచ్చునని చెబుతున్నాయి. అంతర్గత మిత్రపక్షంగా ఉన్న వైసీపీకి 13-14 సీట్లు, టీడీపీకి 10-12 సీట్లు వస్తున్నాయి. తమిళనాడులో బీజేపీ నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమికి 14-16 సీట్లు, డీఎంకే కూటమికి 22-24 సీట్లు వస్తున్నాయి. కేరళలో ఎల్డీఎఫ్‌కు 11-13 సీట్లు, యూడీఎఫ్‌కు 7-9 సీట్లు, బీజేపీ 0-1 సీటు రానుంది. కర్ణాటకలో బీజేపీ కూటమికి 21-23 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 5-7 సీట్లు వస్తాయి.

కాంగ్రెస్ రాష్ట్రాల్లోను బీజేపీ హవా, బెంగాల్ మమతదే

కాంగ్రెస్ రాష్ట్రాల్లోను బీజేపీ హవా, బెంగాల్ మమతదే

ఉత్తరాఖండ్‌లో బీజేపీకి 4-5 సీట్లు, కాంగ్రెస్‌కు 0-1 సీట్లు, ఇతరులకు 1 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీకి 42 నుంచి 45 సీట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి కానీసం ఆరు సీట్లు రావడం కూడా కష్టంగానే ఉంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీదే హవా అను ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. 25 నుంచి 30 సీట్లకు పైగా తృణమూల్ గెలుస్తుంది. బీజేపీ 3-7 సీట్లు గెలిచి గతంలో కంటే సత్తా చాటనుంది. కొన్ని సర్వేలు బీజేపీ 19 నుంచి 23 సీట్లు గెలుస్తాయని కూడా చెబుతున్నాయి. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఖాతా తెరవడమే కష్టంగా ఉంది. జమ్ము కాశ్మీర్‌, ఒడిశాలలో బీజేపీ గతంలో కంటే మెరుగైన సీట్లు గెలుచుకునేలా కనిపిస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లోని ఎక్కువ సీట్లు ఎన్డీయే ఖాతాలో పడుతాయని ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీకి 17-19 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 4-6 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

ఏ సర్వే ఏం చెప్పిందంటే?

ఏ సర్వే ఏం చెప్పిందంటే?

Republic - CVoter- బీజేపీకి 287, కాంగ్రెస్‌కు 128 ఎస్పీ-బీఎస్పీకి 40, ఇతరులకు 87

Republic Bharat - Jan Ki Baat - బీజేపీకి 305, కాంగ్రెస్‌కు 124, ఎస్పీ-బీఎస్పీకి 26, ఇతరులకు 87
NewsX - Neta బీజేపీకి 242, కాంగ్రెస్‌కు 162, ఎస్పీ-బీఎస్పీకి 43, ఇతరులకు 93
News Nation - బీజేపీకి 282-290, కాంగ్రెస్‌కు 118-126, ఇతరులకు 130-138
Times Now - VMR - బీజేపీకి 306, కాంగ్రెస్‌కు 132, ఇతరులకు 104
CNN IBN-IPSOS - బీజేపీకి 336, కాంగ్రెస్‌కు 82, ఇతరులకు 124
Todays Chanakya- బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు350 (ప్లస్ లేదా మైనస్ 14), కాంగ్రెస్‌కు 97 (ప్లస్ లేదా మైనస్ 9), ఇతరులు 95 (ప్లస్ లేదా మైనస్ 11)

మొత్తంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు సరాసరిగా 290 నుంచి 300కు పైగా సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు 125కు అటు ఇటుగా, యూపీలో ఎస్పీ-బీఎస్పీలకు దాదాపు 40 సీట్లు, ఇతరులకు 100కు పైగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

English summary
Lok Sabha Elections Exit Poll Results 2019 Live Updates: Polling for the 17th Lok Sabha Election 2019 will conclude with the end of voting in 59 parliamentary constituencies on Sunday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X