వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్రిపుర ఎగ్జిట్ పోల్స్: మాణిక్‌కు షాక్, ఎర్రకోటలో జెండా పాతిన బీజేపీ!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Exit polls : Nagaland, Meghalya,Tripura exit polls | Oneindia Telugu

త్రిపుర: వామపక్ష పార్టీకి పెట్టని కోటలా ఉన్న త్రిపురలో భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. త్రిపురతోపాటు నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. త్రిపురలో అధికారంలో ఉన్న సీపీఎం పార్టీకి భారతీయ జనతా పార్టీ షాకిచ్చిందని తేల్చాయి. ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీలు హోరా హోరీగా ప్రచారం నిర్వహించాయి. అయితే, సీపీఎం పాలనతో కొంత విసిగిపోయిన ప్రజలు ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే..

యాక్సిస్ మైఇండియా అండ్ న్యూస్24:
బీజేపీ కూటమి: 45-50, లెఫ్ట్ ఫ్రంట్: 9-10

న్యూస్ఎక్స్:
బీజేపీ కూటమికి 35-45 సీట్లు వస్తాయని తేల్చగా.. లెఫ్ట్ ఫ్రంట్‌కు 14-23, కాంగ్రెస్-0

న్యూస్ఎక్స్-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీ-31-37 స్థానాలు

కాగా, ఎగ్జిట్ పోల్స్.. త్రిపురలో బీజేపీదే అధికారమని తేల్చాయని బీజేపీ నేత తన ట్విట్టర్‌లో ఎగ్జిట్ పోల్స్ వివరాలను వెల్లడించారు. అసలైన ఫలితాలు ఇంకా ఆనందాన్ని కలిగిస్తాయని వ్యాఖ్యానించారు.

English summary
Tripura election 2018 exit poll result was declared today by survey agencies after the end of polling in Meghalaya and Nagaland today. Polling in Tripura, which is considered to be a Left bastion, took place on 18 February after a high-octane campaign by leaders of BJP and the ruling CPI(M).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X