వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మకండి.. నిరాశలో ఉన్న కార్యకర్తలకు ప్రియాంక ఆడియో సందేశం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు మరోసారి ఎన్జీఏకు పట్టం కట్టనున్నారన్న ఎగ్జిట్ పోల్స్‌ అంచనాల వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఎగ్జిట్ పోల్స్‌పై తొలిసారి స్పందించి ఆమె.. కార్యకర్తలకు ఆడియో సందేశాన్ని పంపారు. సర్వే ఫలితాలను నమ్మొద్దని ప్రియాంక కోరారు. కార్యకర్తలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కుమారస్వామిలో ఎగ్జిట్ పోల్ వణుకు : యడ్డీ నుంచి ముప్పు ఉంటుందని ఆందోళనకుమారస్వామిలో ఎగ్జిట్ పోల్ వణుకు : యడ్డీ నుంచి ముప్పు ఉంటుందని ఆందోళన

"ఎగ్జిట్ పోల్స్ చూసి మీరు నిరుత్సాహానికి గురై ఉంటారు. కానీ ఆ ఎగ్జిట్ పోల్స్‌ను నమ్మొద్దు. కార్యకర్తలందరూ స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ సెంటర్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిందుకు అందుకు తగ్గ ఫలితాలు కచ్చితంగా వస్తాయని భావిస్తున్నా"నంటూ ప్రియాంక కార్యకర్తలకు పంపిన ఆడియో సందేశంలో చెప్పారు.

Exit Polls Just To Discourage congress : Priyanka Gandhi

ఆదివారం చివరి విడత పోలింగ్ ముగిసిన అనంతరం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో ఎన్డీఏ 300లకుపైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని తేలింది. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు 120 సీట్లకే పరిమితమవుతాయన్న అంచనాలు వెల్లడయ్యాయి. బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ బలం పుంజుకుంటుందని సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి.

English summary
A day after exit polls predicted a sweeping victory for the BJP-led NDA in the Lok Sabha elections, Congress leader Priyanka Gandhi released an audio message advising party workers to not fall for rumours intended to make them drop their guard ahead of the counting of votes on May 23.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X