వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ చేతిలో దేశం భద్రం, సైనికుల తెగువ, ధైర్య సాహసాలను వెలకట్టలేం: లెహ్‌లో ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

సైనికుల ధైర్య సాహలు పర్వతాల తరహాల ధృడమైనవని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. గడ్డ కట్టే చలిలో దేశం కోసం చేస్తున్న సేవ వెలకట్టలేనిదన్నానరు. ఇవాళ ఆయన బిపిన్ రావత్‌తో కలిసి లడాఖ్ వెళ్లారు. తర్వాత లెహ్‌లో సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. సైనికుల చేతిలో దేశం భద్రంగా ఉంటుందన్నారు. మీ ధైర్య సాహసాలు అజరామరం అని, చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తాయని కీర్తించారు.

వీ ప్రౌడ్ ఆఫ్ యూ..

వీ ప్రౌడ్ ఆఫ్ యూ..

గాల్వాన్ వ్యాలీ ఘటనతో ప్రపంచానికి ఒక బలమైన సంకేతాలు పంపించారని గుర్తుచేశారు. అమరులైన జవాన్లకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. జవాన్లను చూసి దేశంలోని ప్రతీ పౌరుడు గర్వపడుత్నారని తెలిపారు. లడాఖ్ నుంచి కార్గిల్ వరకు సైనికులు చూపిన తెగువ, ధైర్య సాహనాలను యావత్ జాతి చూసిందన్నారు. దేశంలోకి శత్రువులను చొరబడనీయకుండా చేసేందుకు ప్రాణ త్యాగం చేసిన వీరులకు వందనం తెలిపారు. భారతదేశంపై కుట్రలు పన్నుతున్న శత్రుదేశాలు ఆటలు సాగబోమని హెచ్చరించారు.

కళ్లారా చూస్తున్నాం..

కళ్లారా చూస్తున్నాం..

కష్ట సమయంలో పోరాటం చేస్తున్నామన్ మోడీ.. ఇన్నాళ్లు మీ ధైర్యం గురించి విన్నామని.. ఇప్పుడు చూస్తున్నామని తెలిపారు. దేశ రక్షణ మీ చేతుల్లో భద్రంగా ఉందన్నారు. దేశం కోసం అహోరాత్రులు కష్టపడుతున్న మీ తీరు ఆత్మ నిర్భర భారత్ ఇనుమడింప చేస్తోందని తెలిపారు. సైనికుల ధైర్య సాహసాలు పర్వతాల తరహాలో ధృడమైనవని చెప్పారు. సైనికుల ధైర్యం, తెగువ వెలకట్టలేదని.. వారి పోరాటం భావి తరాలకు ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.

 శత్రువులతో పోరాటం

శత్రువులతో పోరాటం

ఇప్పుడే కాదు గతంలో కూడా శత్రువులతో పోరాడామని ప్రధాని మోడీ గుర్తుచేశారు. శత్రువుల కుట్రలను పటాపంచలు చేశామని తెలిపారు. ధైర్య సాహసాలు ఉన్నవారే శాంతిని కోరుకుంటారని పేర్కొన్నారు. కానీ దానిని తక్కువ అంచనా వేయొద్దని.. ఈ విషయం ఇప్పటికే ఇతర దేశాలకు అర్థమై ఉంటుందని తెలిపారు. ప్రధాని మోడీ ప్రసంగిస్తోన్న సమయంలో వందేమాతరం నినాదంతో ప్రాంగణం మిన్నంటింది.

పెను ప్రమాదంగా చైనా

పెను ప్రమాదంగా చైనా

చైనా ప్రపంచశాంతికి పెను ప్రమాదంగా మారిందని మోడీ పేర్కొన్నారు. ఇప్పటివరకు కుయుక్తులు పన్నేవారి ప్రయత్నాలు ఎక్కడా ఫలించలేదవన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ నిర్మించి చూపిస్తామని స్పష్టంచేశారు. భారత్ మాతా కీ జై, వందేమాతరం అని ప్రధాని మోడీ నినాదించారు. మంచు గడ్డల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లలో మరింత ఆత్మస్థైర్యం నింపారు.

English summary
prime minister narendra modi praise to soldiers for their duties on un conditional weather.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X