వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసలైన దీపావళి: సుప్రీం తీర్పుపై శశికళ, ఊహించానన్న సుబ్రమణ్యస్వామి

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో స‌హ‌నిందితురాలిగా ఉన్న శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/చెన్నై: త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో స‌హ‌నిందితురాలిగా ఉన్న శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు భారతీయ జనతా పార్టీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి స్పందించారు.

<strong>ఉద్రిక్తత: శశికళ అరెస్ట్ కోసం భారీగా పోలీసులు: పన్నీరు వైపు రిసార్ట్స్ ఎమ్మెల్యేల చూపు!</strong>ఉద్రిక్తత: శశికళ అరెస్ట్ కోసం భారీగా పోలీసులు: పన్నీరు వైపు రిసార్ట్స్ ఎమ్మెల్యేల చూపు!

సుప్రీంకోర్టు తీర్పును ముందే ఊహించాన‌ని చెప్పారు. శశిక‌ళపై సుప్రీంకోర్టు విధించిన ఈ తీర్పునుంచి ఆమె త‌ప్పించుకోలేర‌ని తాను అనుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. 20 ఏళ్ల త‌ర్వాత న్యాయం గెలిచిందని ఆయ‌న పేర్కొన్నారు.

శశికళ రివ్యూ పిటిషన్ వేసే అవకాశం ఉందని చెప్పిన సుబ్రమణ్యస్వామి.. ఆ పిటిషన్ కూడా తాజా తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు ధర్మాసనానికే వెళుతుందని చెప్పారు. త‌మిళ‌నాడులో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి గ‌వ‌ర్న‌ర్ వెంట‌నే ముగింపు ఇవ్వాలని ఆయ‌న సూచించారు.

అసలైన దీపావళి: సుప్రీం తీర్పుపై శశికళ పుష్ప స్పందన

Expect Sasikala to be convicted: Swamy on DA case

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీంకోర్టు తాజాగా నాలుగేళ్ల జైలు శిక్ష విధించడంపై అన్నాడీఎంకే బ‌హష్కృత ఎంపీ శ‌శిక‌ళ పుష్ప స్పందించారు. ఆమె మొద‌టి నుంచి శ‌శిక‌ళ న‌ట‌రాజ‌న్ అధికారాన్ని విమ‌ర్శిస్తోన్న విష‌యం తెలిసిందే.

<strong>భారీ షాక్: శశికళను దోషిగా నిర్ధారించిన సుప్రీం, నాలుగేళ్లు జైలు, పన్నీరింట సంబరం</strong>భారీ షాక్: శశికళను దోషిగా నిర్ధారించిన సుప్రీం, నాలుగేళ్లు జైలు, పన్నీరింట సంబరం

మంగళవారం ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో ఆమె మాట్లాడుతూ... ప్రజలకు ఈ రోజు అస‌లైన దీపావ‌ళి అని ఆమె అన్నారు.సీఎం కావాల‌నుకున్న శ‌శిక‌ళ‌కుదారులు మూసుకుపోవ‌డంతో ఆమె హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము గౌర‌విస్తున్నామ‌ని తెలిపారు. త‌మిళ‌నాడులో గూండాయిజం, రౌడీయిజం ఓడిపోయాయని అన్నారు. భార‌త్‌లో మంచి ప్ర‌జాస్వామ్యం ఉంద‌ని కోర్టు తీర్పు ద్వారా తేలిందని అన్నారు.

English summary
Bharatiya Janata Party (BJP) leader Subramanian Swamy on Tuesday expressed confidence that the Supreme Court would convict All India Anna Dravida Munnetra Kazagham (AIADMK) general secretary V.K. Sasikala in disproportionate assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X