వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుమ్ము లేపిన శశికళ వర్గీయులు: మళ్లీ వస్తే మీ అంతుచూస్తాం

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజకీయాల కారణంగా రక్తపాతాన్ని సృష్టిస్తున్నాయి. రాజ్యసభ సభ్యురాలు, అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ పుష్ప భర్త లింగేశ్వర తిలగన్, వారి న్యాయవాది మీద అన్నాడీఎంకే కార్యకర్తలు దాడి చెయ్యడంతో చెన్నైలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ లేకుండా రంగంలోకి దిగిన నెచ్చెలి శశికళకు వ్యతిరేకంగా రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప పోటీ చెయ్యడానికి సిద్దం అయిన విషయం తెలిసిందే.

<strong>జయ మృతి: ఇంటర్వ్యూలో నోరు విప్పిన శశికళ, నిజం చెప్పేసి ?</strong>జయ మృతి: ఇంటర్వ్యూలో నోరు విప్పిన శశికళ, నిజం చెప్పేసి ?

అయితే ఇప్పటికే అన్నాడీఎంకేలో రెండు వర్గాలు కుమ్ములాడుకుంటున్న సమయంలో శశికళ పుష్ప మూడో వర్గంగా రంగంలోకి రావడంతో కార్యకర్తలు సహనం కొల్పోయారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి ఎన్నిక ఒక్క రోజులో జరగవలసి ఉండగా ఇప్పుడు రక్తపాతం మొదలైయ్యింది.

Expelled AIADMK Rajya Sabha MP Sasikala Pushpa triggered tension in AIADMK Head office

ఇప్పటికే నెచ్చెలి శశికళ మీద ఆరోపణలు చేస్తూ రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆమె భర్త, న్యాయవాది మీద దాడి జరగడంతో చెన్నైలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

<strong>నమ్మక ద్రోహం ? జయలలిత, శశికళ అగ్రిమెంట్ లీక్</strong>నమ్మక ద్రోహం ? జయలలిత, శశికళ అగ్రిమెంట్ లీక్

ఇంత జరిగినా పోలీసులు మాత్రం అధికార పార్టీకి సహకరిస్తున్నారని శశికళ పుష్ప వర్గీయులు మండిపడుతున్నారు. ఎది ఏమైనా సరే నెచ్చెలి శశికళ నటరాజన్ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టకుండా అడ్డుకుంటామని శశికళ పుష్ప వర్గీయులు హెచ్చరించారు.

మరో వైపు రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. కార్యకర్తలు గుంపుగా వచ్చి దాడి చెయ్యడంతో గందరగోళం నెలకొంది. నెచ్చెలి శశికళ నటరాజన్ కావాలనే తన వర్గీయులను రెచ్చగొట్టి దాడి చేయించారని శశికళ పుష్ప వర్గీయులు ఆరోపిస్తున్నారు.

English summary
Tamil Nadu: Expelled AIADMK Rajya Sabha MP Sasikala Pushpa triggered tension in AIADMK Head office in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X