• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పంద్రాగస్టుకు కరోనా వ్యాక్సిన్‌పై ప్రకటన?: కేంద్రం సంకేతాలు: రవాణా, ప్రాధాన్యతలపై కమిటీ భేటీ

|

న్యూఢిల్లీ: మందే లేని మహమ్మారిలా చెలరేగిపోతోంది ప్రాణాంతక కరోనా వైరస్. ప్రపంచాన్ని కకావికలం చేస్తోంది. ప్రపంచపటంలో ఉన్న ఏ ఒక్క దేశాన్నీ వదల్లేదు. అన్ని చోట్లా వ్యాపించింది. ఉసురు తీస్తోంది. కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది కరోనా వైరస్ బారిన పడి మరణించారు. రెండు కోట్లకు పైగా కరోనా వైరస్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా నమోదు అయ్యాయి. భారత్‌లో రోజురోజుకూ వైరస్ దూకుడు పెరుగుతోంది.

వేలల్లో కేసులు పెరుగుతోన్న వేళ.. వైఎస్ జగన్ సహా: ముఖ్యమంత్రులతో ప్రధాని: ఏం చెబుతారు?వేలల్లో కేసులు పెరుగుతోన్న వేళ.. వైఎస్ జగన్ సహా: ముఖ్యమంత్రులతో ప్రధాని: ఏం చెబుతారు?

మూడో దశ ట్రయల్స్‌లో వ్యాక్సిన్..

మూడో దశ ట్రయల్స్‌లో వ్యాక్సిన్..

రోజువారీ పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. అత్యధిక కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్.. మూడో స్థానంలో కొనసాగుతోంది. సోమవారం నాటి బులెటిన్ ప్రకారం.. దేశంలో 22,15,075 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటిదాకా 44,386 మంది మరణించారు. మరోవంక- కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి అవసరమైన వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో పడ్డాయి పలు దేశాలు. భారత్ సహా ఎనిమిది దేశాలు వ్యాక్సిన్ తయారీలో నిమగ్నం అయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ వంటి సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించాయి. వాటిపై ట్రయల్స్ కొనసాగుతున్నాయి.

ఆగస్టు 15 నాటికి అందుబాటులో తెచ్చేలా..

ఆగస్టు 15 నాటికి అందుబాటులో తెచ్చేలా..

అత్యంత కీలకమైన మూడోదశ ట్రయల్స్‌ను కొనసాగిస్తున్నాయి ఉత్పాదక సంస్థలు. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం నాటికి కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకుని రావడానికి ప్రయత్నాలు సాగిస్తామంటూ ఇదివరకే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ సైన్సెన్స్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. ఈ పరిణామాల మధ్య పంద్రాగస్టు నాటికి కరోనా వ్యాక్సిన్‌పై ఓ కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ప్రధాని కీలక ప్రకటన చేస్తారా?

ప్రధాని కీలక ప్రకటన చేస్తారా?

ఆగస్టు 15వ తేదీ నాటి తన ప్రసంగం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపై ఓ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా సంకేతానలు కూడా ఇచ్చిందని చెబుతున్నారు. ఈ తరహా వార్తలు రావడానికి ప్రధాన కారణం.. కరోనా వ్యాక్సిన్ సరఫరాపై ఏర్పాటైన నిపుణుల కమిటీ భేటీ కాబోతోండటమే. బుధవారం ఈ నిపుణుల కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది.

వ్యాక్సిన్ రవాణా, సేకరణపై నిపుణుల కమిటీ

వ్యాక్సిన్ రవాణా, సేకరణపై నిపుణుల కమిటీ

కరోనా వ్యాక్సిన్ రవాణా, సరఫరా, రాష్ట్రాలను స్టేక్ హోల్డర్లుగా భాగస్వామ్యాన్ని కల్పించడం వంటి అంశాలను కరోనా వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నిపుణుల కమిటీ ఈ భేటీ సందర్భంగా చర్చించబోతోంది. కరోనా వ్యాక్సిన్ లాజిస్టిక్స్ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు చెబుతున్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ ఈ నిపుణుల కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం కేంద్ర ప్రభుత్వానికి ఓ పూర్తిస్థాయి నివేదికను అందజేస్తారని చెబుతున్నారు.

  జాతీయ పత్రిక సర్వే.. అగ్ర స్థానం లో Yogi Adityanath | YS Jagan | KCR | Arvind Kejriwal || Oneindia
  రాష్ట్ర ప్రభుత్వాలు.. తయారీదారులతో..

  రాష్ట్ర ప్రభుత్వాలు.. తయారీదారులతో..

  కరోనా వ్యాక్సిన్ లాజిస్టిక్, సేకరణ అంశాలు, రాష్ట్రాల ప్రభుత్వాలు, వ్యాక్సిన్ తయారీదారులతో సహా స్టేక్ హోల్డర్ల అభిప్రాయాలను తీసుకోవచ్చని సమాచారం. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం ఖాయం కావడం వల్లే.. నిపుణుల కమిటీ రవాణా, సేకరణపై దృష్టి సారించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. బుధవారం నాటి నిపుణుల కమిటీ సమావేశం అనంతరం దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

  English summary
  Expert Committee on Vaccine Administration chaired by Dr VK Paul, NITI Aayog to meet on 12 Aug to consider logistics and ethical aspects of procurement and administration of COVID vaccine.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X