వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ పొడగింపా.. ఎగ్జిట్ స్ట్రాటజీనా.. దీదీ నిర్ణయం దేనికి సంకేతం..

|
Google Oneindia TeluguNews

భారత్‌లో లాక్ డౌన్ 2.0 గడువు ముగింపు దశకు చేరుకుంటోంది. దీంతో సహజంగానే దీన్ని ఇంకా పొడగిస్తారా.. లేక ఎత్తేస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ తర్వాత ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా అక్కడి ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొన్ని సడలింపులు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్‌లోనూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కొన్ని సడలింపులు ప్రకటించారు. అయితే ఈ సడలింపులు లాక్ డౌన్ పొడగింపుకు సంకేతమా.. లేక లాక్ డౌన్‌ను దశలవారీగా ఎత్తేసే ఎగ్జిట్ స్ట్రాటజీలో భాగమా అన్నది ఆసక్తికరంగా మారింది.

నిపుణులు పొడగించాలంటున్నారు.. : మమతా

నిపుణులు పొడగించాలంటున్నారు.. : మమతా

లాక్ డౌన్‌పై కేంద్రం నుంచి ఇంకా తమకు స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉందని.. కాబట్టి ప్రతీ ఒక్కరూ ఇళ్లకే పరిమితం కావాలని మమతా బెనర్జీ చెప్పారు. ఈ సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేమని.. ఇప్పటికే చాలా దేశాలు లాక్ డౌన్‌ను మే చివరి వరకు,జూన్ మొదటి వారం వరకు పొడగించాయని అన్నారు. మన వైద్యులు,నిపుణులు కూడా కోవిడ్-19 నియంత్రణ చర్యలు మే చివరి వారం వరకు పొడగించడమే మంచిదని నమ్ముతున్నారన్నారు.

కొన్ని సడలింపులు..

కొన్ని సడలింపులు..

అయితే బెంగాల్‌లో గ్రీన్ జోన్లలో కొన్ని సడలింపులను ప్రకటించారు. స్టేషనరీ,ఎలక్ట్రానిక్స్,హార్డ్ వేర్,మొబైల్,లాండ్రీ,టీ,పాన్ షాప్ వంటి సింగిల్ యూనిట్ షాపులకు లాక్ డౌన్ నుంచి మినహాయింపునిచ్చారు. అంతమాత్రానా.. ప్రజలు టీ షాపులు,పాన్ డబ్బాలను అడ్డాగా మార్చుకుని గుంపులుగా చేరవద్దని హెచ్చరించారు. అలాగే చిన్న పరిశ్రమలు,నిర్మాణ రంగ పనులకు కూడా సడలింపునిచ్చారు. పని ప్రదేశాల్లో సోషల్ డిస్టెన్స్ తప్పనిసరిగా పాటించాలన్నారు. అయితే కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం యథావిధిగా ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

పొడగింపా.. ఎగ్జిట్ స్ట్రాటజీనా..

పొడగింపా.. ఎగ్జిట్ స్ట్రాటజీనా..


మమతా బెనర్జీ ప్రకటించిన తాజా సడలింపులతో.. మే 1 తర్వాత రాష్ట్రంలో లాక్ డౌన్‌ను ఎత్తివేయనున్నారా అన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో.. ' మే 30 వరకు లాక్ డౌన్ కొనసాగించాలని నిపుణులు చెబుతున్నారు..' అని మమతా చేసిన వ్యాఖ్యలు పొడగింపుకు సంకేతమా అన్న చర్చ కూడా జరుగుతోంది. కేంద్రమే దీనిపై స్పష్టమైన ఆదేశాలను వెలువరిస్తుందా.. లేక.. రాష్ట్రాలకే విడిచిపెడుతుందా అన్నది వేచి చూడాలి. ఇక రాజస్తాన్‌లోని కోటాలో చిక్కుకుపోయిన 2500-3000 మంది తమ స్టూడెంట్స్‌ను ప్రత్యేక బస్సుల్లో వెనక్కి రప్పిస్తున్నామని దీదీ స్పష్టం చేశారు. ఇలాంటి విపత్కర సమయంలోనూ బీజేపీ రాజకీయాలు చేయడం మానుకోవట్లేదని విమర్శించారు. హౌరాలో పోలీసులపై దాడికి గగ్గోలు పెడుతున్న బీజేపీ.. తమ పార్టీ పాలిత రాష్ట్రాల్లో దాడులకు ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.

Recommended Video

Fake News Buster EP 19 : జూన్ 30 వరకూ తిరుమల దర్శనం రద్దు ?

English summary
West Bengal Chief Minister Mamata Banerjee on Wednesday said experts and doctors are of the opinion that the restrictions imposed to check the spread of Covid-19 should continue in the state till the end of May.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X