హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమిళ తంబీలదీ అదే బాటా..? లాక్ డౌన్ పొడగింపుకు నిపుణుల కమిటీ సూచన..

|
Google Oneindia TeluguNews

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ పొడగింపు విషయంలో కేంద్రం కంటే ముందు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. కేంద్రం నుంచి ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడకుండా ముందు జాగ్రత్తగా లాక్ డౌన్ పొడగింపుకే మొగ్గుచూపుతున్నాయి. ఈ దిశగా ఒడిశా మొదటి అడుగు వేయగా.. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కూడా తాజాగా లాక్ డౌన్‌ను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పంజాబ్‌లో లాక్ డౌన్ మే 1వ తేదీ వరకు కొనసాగుతుందని ప్రకటించారు. ఇప్పుడిదే బాటలో తమిళనాడు కూడా పయనించే అవకాశం కనిపిస్తోంది.

ఒక్కరోజే 77 కేసులు.. లాక్ డౌన్ పొడగించాలన్న నిపుణుల కమిటీ..

ఒక్కరోజే 77 కేసులు.. లాక్ డౌన్ పొడగించాలన్న నిపుణుల కమిటీ..

తమిళనాడులో శుక్రవారం(ఏప్రిల్ 10) ఒక్కరోజే 77 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 911కి చేరింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో క్షేత్ర స్థాయి పరిస్థితులను సమీక్షించిన 19 మంది సభ్యులతో కూడిన నిపుణుల కమిటీ లాక్ డౌన్ పొడగింపుపై ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో మరో రెండు వారాలు లాక్ డౌన్ పొడగించాలని సూచించింది. ముఖ్యమంత్రి పళనిస్వామి దీనిపై రేపు సాయంత్రం 5గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రులతో శనివారం(ఏప్రిల్ 11) ఉదయం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ఉన్న నేపథ్యంలో.. రేపటి వరకు వేచి చూడాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఐసీఎంఆర్ సైంటిస్ట్ నేత్రుత్వంలో కమిటీ

ఐసీఎంఆర్ సైంటిస్ట్ నేత్రుత్వంలో కమిటీ


రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై పళనిస్వామి ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్నారు. పబ్లిక్ హెల్త్ నిపుణులతో పాటు డబ్ల్యూహెచ్ఓ ఆర్గనైజేషన్ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్‌తోనూ సంప్రదింపులు జరిపారు. అయితే ఆమె నుంచి ఎలాంటి సలహాలు,సూచనలు వచ్చాయన్నది ఇంకా తెలియరాలేదు. అయితే ఐసీఎంఆర్ సైంటిస్ట్ డా.ప్రదీప్ కౌర్ నేత్రుత్వంలో నియమించిన నిపుణుల కమిటీ మాత్రం లాక్ డౌన్ పొడగించాల్సిందేనని స్పష్టమైన సూచన చేసింది. వైరస్‌పై పోరుకు తమిళనాడు ప్రభుత్వం బాగా కృషి చేస్తోందని నిపుణుల కమిటీ సమావేశంలో కౌర్ ప్రశంసించినట్టు తెలుస్తోంది.

రేపు కీలక ప్రకటన వచ్చే అవకాశం..

రేపు కీలక ప్రకటన వచ్చే అవకాశం..

క్వారెంటైన్,ఐసోలేషన్ల ఏర్పాటు,వైద్యులకు,హల్త్ కేర్ సిబ్బందికి రక్షణ పరికరాలు అందించడంలో ప్రభుత్వ చర్యలు బాగున్నాయని కౌర్ వెల్లడించారు. ప్రభుత్వం తరుపున తీసుకుంటున్న చర్యలు బాగానే ఉన్నప్పటికీ.. మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. నిపుణుల కమిటీలోని సభ్యులంతా లాక్ డౌన్ పొడగింపుకే మొగ్గుచూపారని.. ప్రస్తుత పరిస్థితుల్లో అదే మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారని చెప్పారు. అంతకుముందు గురువారం ముఖ్యమంత్రి పళనిస్వామి మాట్లాడుతూ.. నిపుణుల కమిటీ నివేదిక మేరకే లాక్ డౌన్ పొడగింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీన్నిబట్టి తమిళనాడులోనూ లాక్ డౌన్ పొడగింపు లాంఛనమే అన్నట్టుగా కనిపిస్తోంది. దీనిపై రేపు కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Recommended Video

Lockdown Effect : Crows Demising Mysteriously In Tamilnadu & Andhrapradesh
కేంద్రం నిర్ణయం ఎప్పుడు?

కేంద్రం నిర్ణయం ఎప్పుడు?

లాక్ డౌన్ పొడగింపుపై అటు కేంద్రం సమాలోచనలు జరుపుతోంది. ఇప్పటికే ఓసారి ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోదీ.. రేపు మరోసారి కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా క్షేత్ర స్థాయి పరిస్థితులపై ముఖ్యమంత్రుల నంచి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు.. లాక్ డౌన్ పొడగింపుపై వారి అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అనంతరం ఉన్నతాధికారులతో చర్చించి మంగళవారం(ఏప్రిల్ 13)న దీనిపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

English summary
A 19-member expert committee constituted by the Tamil Nadu government to advise it of steps to tackle the COVID-19 crisis on Friday recommended to Chief Minister K Palaniswami that the lockdown be extended by two weeks beyond April 14 considering the rise in number of cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X