వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలం చెల్లిన బాబు, మోదీ : స్పీడ్ బ్రేకర్ విమర్శలపై దీదీ కౌంటర్

|
Google Oneindia TeluguNews

కోల్ కతా : సార్వత్రిక సమరంలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బెంగాల్‌లో ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ .. సీఎం మమతా బెనర్జీ ఓ స్పీడ్ బ్రేకర్ అని, అభివ‌ృద్ధి పనులకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. మోదీ ఆరోపణలకు దీదీ, మమతా బెనర్జీ ధీటుగా స్పందించారు. ప్రధాని మోదీ కాలం చెల్లిన బాబు (ఎక్స్‌పైరి బాబు) అని ఆమె విమర్శించారు.

దమ్ముంటే చర్చకు రా : మమత సవాల్
కోల్‌కతాలో మోదీ ప్రసంగించాక .. కూచ్ బెహర్‌లో దీదీ ప్రతిస్పందించారు. ప్రధాని మోదీ ఎక్స్‌పైరీ బాబు అని విమర్శించారు. మోదీకి దమ్ముంటే అమెరికా తరహాలో మీడియాలో తనతో చర్చకు రావాలని మరోసారి సవాల్ విసిరారు దీదీ. బెంగాల్ అభివృద్ధిని మమతా అడ్డుకున్నారని మోదీ ఆరోపించగా .. మీరు ముందు ఢిల్లీపై దృష్టిపెట్టండి తర్వాత బెంగాల్ గురించి ఆలోచించాలని దీదీ సూచించారు.

Expiry Babu: Mamata Banerjees Comeback to PMs Speedbreaker Dig

అబద్దాల కోరు మోదీ
ప్రధాని మోదీ అబద్దాల కోరు అని విమర్శించారు. 'నేను మోదీ లాగా మీకు కల్లబొల్ల కబుర్లు చెప్పాను, చేసేదే చెప్తాను, చెప్పింది చేస్తాను' అని స్పష్టంచేశారు దీదీ. రైతుల సంక్షేమానికి పాటుపడతానన్న మోదీ ... ఐదేళ్లలో 12 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏం చేశారని ప్రశ్నించారు. బెంగాల్‌లో మా ప్రభుత్వం ఇచ్చిన హామీల కన్నా ఎక్కువే చేసిందని స్పష్టంచేశారు. తమ హయాంలో రైతుల ఆదాయం మూడింతలు పెరిగిందని గుర్తుచేశారు.

English summary
Bengal today witnessed some verbal fireworks as Prime Minister Narendra Modi and Chief Minister Mamata Banerjee led the battle for the state's 42 seats. The Chief Minister had tweaked her schedule to speak after PM Modi. Around 4 in the evening, as the Prime Minister finished speaking in Kolkata, Ms Banerjee took the stage in Cooch Behar. "You worry about Delhi first and then turn your eyes on Bengal," said the Chief Minister, accusing PM Modi of making false claims about performance of her government in the state. "I am not Modi, I don't tell lies," the Chief Minister declared.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X