వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యాక్సిన్ వేసుకున్నా కొవిడ్-19వ్యాధి? -సమర్థత, సరఫరాపై గందరగోళం -ఈ ప్రశ్నలకు బదులేది?

|
Google Oneindia TeluguNews

గ్లోబల్‌గా కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య మంగళవారం నాటికి అక్షరాలా ఆరు కోట్లకు చేరింది. మరణాల సంఖ్య 14 లక్షలు దాటింది. ఏడాది కాలంగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న ఈ మహమ్మారికి దెబ్బకు 50కిపైగా దేశాలు దివాళా తీయగా, చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు దాదాపు కుప్పకూలాయి. రెండో, మూడో వేవ్ హెచ్చరికలతో పలు దేశాల్లో మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నారు. బ్రాహ్మాస్త్రం లాంటి వ్యాక్సిన్ తప్ప మరేదీ కరోనాను కంట్రోల్ చేయలేదని సర్వత్రా భావిస్తుండగా, అసలు వ్యాక్సిన్ తీసుకున్నంత మాత్రాన మళ్లీ కొవిడ్-19 విజృంభించబోదని గ్యారెంటీ ఉందా? ఆయా వ్యాక్సిన్ల తయారీ దారులు ప్రకటిస్తోన్న సమర్థతపై ఇంత గందరగోళమేంటి? అసలేం జరుగుతోంది? సమర్థవంతమైన వ్యాక్సిన్ ఎప్పటిలోగా అందుతుంది? అనే ప్రశ్నలు కీలకంగా మారాయి.

షాకింగ్: ఆస్పత్రిలో ఎంపీ రఘురామ -గుండెలో బ్లాక్స్ -ముంబైలో చికిత్స -ప్రవీణ్, సాయిరెడ్డిపై ఫైర్షాకింగ్: ఆస్పత్రిలో ఎంపీ రఘురామ -గుండెలో బ్లాక్స్ -ముంబైలో చికిత్స -ప్రవీణ్, సాయిరెడ్డిపై ఫైర్

డోసుల్లో తేడాలకు అర్థమేంటి?

డోసుల్లో తేడాలకు అర్థమేంటి?

ఇండియాలో కొవిడ్-19 వ్యాక్సిన్ కు సంబంధించి ఫార్మా దిగ్గజం ‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ)' అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్' ప్రముఖమైనది. స్వీడిష్-బ్రిటిష్ ఫార్మా సంస్థ ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి సీరం రూపొందించిన కొవిషీల్డ్.. టెక్నికల్ గా AZD1222 సమర్థతపై కొద్ది గంటల కిందటే రిపోర్టులు వచ్చాయి. ఇండియాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ లో.. వ్యాక్సిన్ మొదటి డోసు 90 శాతం సమర్థవంతంగా పనిచేయగా, అదే (నెల రోజుల వ్యవధిలో) రెండో డోసు దగ్గరికి వచ్చేసరికి సమర్థత 62 శాతానికి పడిపోయింది. ఈ తేడాలకు అర్థమేంటో హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ డాక్టర్ కె.శ్రీనాథ్ రెడ్డి ఇలా వివరించారు..

హ్యాట్సాఫ్ జస్టిస్ రాకేశ్-సిగ్గు రాదా? -పుష్కరాలపై జగన్ కుట్ర -కొత్తరకం దారి దోపిడీ: ఎంపీ రఘురామహ్యాట్సాఫ్ జస్టిస్ రాకేశ్-సిగ్గు రాదా? -పుష్కరాలపై జగన్ కుట్ర -కొత్తరకం దారి దోపిడీ: ఎంపీ రఘురామ

ఇంజన్ వేడితో వేగం పెరగదు..

ఇంజన్ వేడితో వేగం పెరగదు..

‘‘వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా మొదటి డోసును తక్కువ మోతాదుతో ఇవ్వడం ద్వారా శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడి, వైరస్ కారకాలను 90 శాతం సమర్థవంతంగా అడ్డుకునే వీలు ఏర్పడుతుంది. అదే కొద్ది రోజుల వ్యవధిలో రెండవ డోసు ఇచ్చినట్లయితే, శరీరంలోని రోగనిరోధక ప్రతిస్పందన చాలా ఎక్కువ స్థాయికి వెళుతుంది. అప్పుడు సమర్థత 62 శాతానికి పడిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే, మొదటి డోసు తీసుకునేసరికే మన రోగనిరోధక ప్రతిస్పందన పీక్స్ కు చేరుతుంది. రెండో డోసు తీసుకున్నప్పుడు.. వాస్తవానికి అవసరమైన ప్రతిస్పందన స్వభావం బయటపడదు. ఈ మార్పులు.. కారు నడుపుతున్నప్పుడు వేగంగా గేర్లు మార్చడం లాంటివి కావొచ్చు. ఇంజన్ బాగా వేడి అయినంత మాత్రాన కారు వేగం పెరగదు. అయితే వ్యాక్సిన్ డోసుల్లో ఈ తేడాలు ఎందుకుంటున్నాయి అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. వాటిని అణ్వేషించాల్సి ఉంది'' అని డాక్టర్ శ్రీనాథ్ అన్నారు. అయితే..

ఇండియాలో 50 శాతం సమర్థతకూ ఓకే

ఇండియాలో 50 శాతం సమర్థతకూ ఓకే

భారత్ సహా తక్కువ ఆదాయం ఉన్న దేశాలకు చౌక ధరలో వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యంతోనే సీరం తన ‘కోవిషీల్డ్‌' ప్రయోగాలను ముమ్మరం చేసింది. మొదటి డోసు 90 శాతం, రెండో డోసు 62 శాతం సమర్థవంతంగా పనిచేసినప్పటికీ సీరం ఇండియాలో అనుమతులు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే భారతీయ డ్రగ్ రెగ్యులేటర్ నుంచి గ్రీన్ సిగ్నల్ పొందడానికి టీకా 30శాతం నుంచి 50 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉన్నా సరిపోతుందనే నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతం, సీరం సమర్థత 60 నుంచి 70 శాతం మధ్య పక్కాగా ఉంది కాబట్టి బహుళ వినియోగానికి ఆటంకాలు ఏర్పడకపోవచ్చన్నది నిపుణుల అంచనా. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాక్సిన్లు తయారవుతోన్నా, భారత్ కు సంబంధించి సీరం ఒక్కటే ఊపిరిగా నిలుస్తూ ఉండటానికి బలమైన కారణాలున్నాయి..

ధర తక్కువ.. రవాణా ఈజీ..

ధర తక్కువ.. రవాణా ఈజీ..

అమెరికా ఫార్మా సంస్థలు ఫైజర్, మోడెర్నా తాము అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు 90 నుంచి 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ప్రకటించుకున్నాయి. అటు రష్యా తయారీ స్పుత్నిక్-వీ సైతం 90 శాతానికిపైగా ఎఫెక్టివ్ అని చెప్పుకుంది. అయితే ఆయా దేశాల్లోని ప్రభుత్వ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొందిన తర్వాత కూడా ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లను విస్తృతంగా వాడుకునే అవకాశాలు చాలా తక్కువ. ఈ రెండు వ్యాక్సిన్లు మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో స్టోర్ చేయాల్సి ఉండటం, అలాంటి కోల్డ్ చైన్ చాలా దేశాల్లో అందుబాటులో లేకపోవడం, ధరలు కూడా ఒక్కో డోసుకు రూ.3వేల వరకు ఉండటం ప్రతికూల అంశాలు. అదే సీరం వారి కొవిషీల్డ్ ను 2 నుంచి 8 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలోనే స్టోర్ చేసుకోవచ్చు. తద్వారా రవాణా ఈజీ అవుతుంది. పైగా ధర కూడా ప్రభుత్వానికి రూ.400లోపు, విస్తృత వాడకానికి రూ.1000లోపే ఉంటుందని సీరం సీఈవో పూనావాలా చెప్పారు. కొవిషీల్డ్ లాగే AZD1222 ఫార్ములాతో తయారైన రష్యన్ స్పుత్నిక్ వ్యాక్సిన్ కూడా 8డిగ్రీల ఉష్ణోగ్రతలో వాడుకోవచ్చు. కాబట్టే భారత్.. స్పుత్నివ్ వ్యాక్సిన్ పై ఆసక్తి ప్రదర్శిస్తున్నది. అయితే..

Recommended Video

COVID-19 Vaccine : డిసెంబర్ 1వ తేదీ నాటికి Vaccine అందుబాటులోకి తీసుకొస్తున్నాం! || Oneindi Telugu
వ్యాక్సిన్ తీసుకుంటే మళ్లీ వ్యాధి రాదా?

వ్యాక్సిన్ తీసుకుంటే మళ్లీ వ్యాధి రాదా?

కొవిడ్-19 వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తోన్న సంస్థలన్నీ తమ సమర్థతను ప్రకటిస్తున్నాయేగానీ.. ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకున్నాక ఎంత కాలం పాటు దాని ప్రభావం ఉంటుంది? డోసు తీసుకున్నవాళ్లకు మళ్లీ కొవిడ్ వ్యాధి సోకదని గ్యారెంటీ ఉందా? అనే అనుమానాలకు మాత్రం బదులు చెప్పడంలేదని నిపుణులు వాపోతున్నారు. నిజానికి మనందరికీ కరోనా అనేది కొత్త వైరస్. దాని విరుగుడు కోసం రూపొందే వ్యాక్సిన్ల భద్రత, సమర్థత, పనితీరు అన్నీ కొత్త అంశాలే అవుతాయి. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్లకు సంబంధించి నూటికి నూరు శాతం ఇదీ అని కచ్చితంగా చెప్పగలిగే ప్రమాణాలేవీ లేవు కాబట్టే ఆస్ట్రాజెనెకా సహా ఇతర కంపెనీల ప్రకటనలను సైన్స్ జర్నల్స్ ఏవీ ప్రచురించడం లేదు. వంద శాతం గ్యారెంటీ లేకున్నా.. గుడ్డిలో మెల్లగానైనా అందుబాటులోకి వచ్చే వ్యాక్సిన్లను వాడుకోవడం తప్ప ప్రస్తుతానికి మనవాళికి మరో దారిలేదని, రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ల సమర్థతపై మరిన్ని అంశాలు వెలుగులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ క్రమంలో డిసెంబర్ నాటికి కొవిషీల్డ్ అనుమతులు లభిస్తే, వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఫ్రంట్ లైన్ వారియర్లకు డోసులు ఇచ్చే స్థాయిలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తామని సీరం సీఈవో అధర్ పూనావాలా తెలిపారు.

English summary
AstraZeneca Oxford vaccine trials put efficacy at 62% when two full doses are given, and 90% when first shot is half a dose. How does it compare to other vaccines, and what does it mean for Covishield in India? Experts say the biggest question about any Covid-19 vaccine is the uncertainty surrounding how long the immune response it generates will last.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X