వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ విదేశాంగ కార్యదర్శి కేంద్రమంత్రి జైశంకర్ ఇక్కడి నుంచే రాజ్యసభకు..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ కేబినెట్‌లో అనూహ్యంగా చోటు సంపాదించుకున్న మాజీ విదేశాంగ శాఖ కార్యదర్శి సుబ్రహ్మణ్యం జైశంకర్‌ను గుజరాత్ నుంచి రాజ్యసభకు పంపనున్నట్లు సమాచారం. గుజరాత్‌ నుంచి లోక్‌సభకు కేంద్రహోంమంత్రి అమిత్ షా గెలవడం, మరో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీలు అమేథీలో గెలవడంతో గుజరాత్‌లో రెండు సీట్లు ఖాళీ కానున్నాయి. ఇద్దరూ గుజరాత్‌ నుంచే రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు.

లోక్‌సభ ఎన్నికల్లో అమిత్ షా ఘన విజయం సాధించి మోడీ కేబినెట్‌లో హోంమంత్రిగా సెటిల్ కాగా.. స్మృతీ ఇరానీ అమేథీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఘనవిజయం సాధించారు. దీంతో ఆమెకు స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రిగా కేబినెట్‌లో చోటు కల్పించారు. తొలుత జైశంకర్‌‌ను తన సొంత రాష్ట్రం తమిళనాడు నుంచే రాజ్యసభకు పంపాలని భావించినప్పటికీ తర్వాత ఆ ఆలోచనను విరమించుకుని గుజరాత్‌ నుంచి పంపాలని నిర్ణయించింది.

External affairs Minister Jaishankar to be sent to Rajyasabha from Gujarat

మే 30న రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో 57 మంది ఎంపీలు మంత్రులుగా కూడా ప్రమాణస్వీకారం చేశారు. 2015 నుంచి 2018 వరకు సుబ్రహ్మణ్యం జైశంకర్ విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు. చైనా అమెరికాలో గతంలో భారత దౌత్యవేత్తగా కూడా పనిచేశారు. 2013లో చైనాలో భారత దౌత్యాధికారిగా పనిచేయగా... సింగపూర్, చెక్ రిపబ్లిక్ దేశాల్లో భారత హైకమిషనర్‌గా సేవలందించారు. 1977లో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్‌లో జైశంకర్ చేరారు. 2007లో జరిగిన భారత అమెరికాల మధ్య అణుఒప్పందంలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు డొక్లాం వివాదంలో కూడా చర్చలు జరిపి విజయం సాధించారు. ఈ ఏడాది మార్చిలో జైశంకర్‌ను పద్మశ్రీ అవార్డు వరించింది.

English summary
External Affairs Minister (EAM) Subrahmanyam Jaishankar is likely to be sent to Rajya Sabha from Gujarat, as per news agency ANI. Two vacancies were created in Gujarat RS after Bharatiya Janata Party (BJP) Rajya Sabha MPs Amit Shah and Smriti Irani won Lok Sabha polls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X