వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీలో చేరిన కేంద్రమంత్రి .. ఎవరో తెలుసా ..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : మోడీ 2.0 మంత్రివర్గం కొలువుదీరింది. కానీ అందులో కొందరు ఏ పార్టీకి చెందని వారు ఉన్నారు. మరికొందరు రాజ్యసభకు ఎన్నిక కావాల్సిన వారు కూడా ఉన్నారు. అలాంటి నేతలు ఒక్కొక్కరు బీజేపీ కండువా కప్పుకుంటున్నారు. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణ కన్నా ముందే పార్టీలో చేరాలి .. కానీ వివిధ అంశాల వల్ల పార్టీలో చేరిక ప్రక్రియ నిలిచిపోయింది.

సుష్మ ఔట్ ..
విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ సోమవారం బీజేపీలో చేరారు. ఆయన ఇటీవల విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో జై శంకర్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. జై శంకర్ కన్నా ముందు విదేశాంగ శాఖ మంత్రిగా సుష్మ స్వరాజ్ పనిచేశారు. అయితే ఈ సారి ఎన్నికల్లో ఆమె పోటీచేయలేదు. దీంతో బెర్త్‌పై అనుమానాలు నెలకొన్నాయి. అనుకున్నట్టుగానే మోడీ 2.0 క్యాబినెట్‌లో సుష్మకు చోటు దక్కలేదు.

Recommended Video

అంతా భ్రమయేనమః - లక్ష్మణ్
External Affairs Minister S Jaishankar formally joins BJP

ఇదీ నేపథ్యం ...
చరిత్రకాడురు కే సుబ్రమణ్యం కుమారుడే సుబ్రమణ్యం జై శంకర్. గత పాలనలో ప్రధాని మోడీతో జై శంకర్ అత్యంత సన్నిహితంగా మెలిచారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జై శంకర్, మోడీ కలిసి ఒక టీంగా ఏర్పడి ... కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాకి్స్థాన్‌పై రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ చేసి ప్రజల మన్ననలు పొందారు. విదేశాంగ విధానంలో జై శంకర్ అనుసరించిన వైఖరి ప్రధాని మోడీని అమితంగా ఆకట్టుకుంది. 1977 ఇండియన్ ఫారిన్ సర్వీస్‌కు చెందిన జై శంకర్ .. ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపరచడంలో కీ రోల్ పోషించారు. ముఖ్యంగా అమెరికా, చైనాతో ఆయన అనుసరించిన విధానాలు మంచి ఫలితాలినిచ్చాయి.

English summary
External Affairs Minister Subrahmanyam Jaishankar formally joined the BJP on Monday in the presence of party’s working president JP Nadda at the Parliament House. Jaishankar was appointed as the External Affairs Minister in the new Narendra Modi cabinet. He replaced veteran leader Sushma Swaraj, who decided not to contest this time. Jaishankar, the son of one of India’s foremost strategic thinkers, K Subrahmanyam, is considered to be very close to the prime minister and was part of a troika with Modi and National Security Adviser Ajit Doval that played a major role in shaping foreign policy in the early years of the last NDA government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X