వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘రంజాన్’ రిలీఫ్: ఖతార్ ఎఫెక్ట్‌తో దోహాకు భారత్ అదనపు విమానాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పవిత్ర రంజాన్‌ పర్వదినం నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దోహాకు తాత్కాలికంగా అదనపు విమానాలను ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వం. ఇలా అదనపు సర్వీసులు నడపాల్సిందిగా ఎయిరిండియా, జెట్‌ ఎయిర్‌వేస్‌ను ప్రభుత్వం కోరింది.

కొన్ని మధ్యప్రాచ్య దేశాలు ఖతార్‌ విమానాలపై నిషేధం విధించిన నేపథ్యంలో ఈ చర్య చేపట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌వేస్‌ జూన్ 22, 23 తేదీల్లో ముంబై-దోహాల మధ్య 168 సీట్ల విమానాలు నడుపుతుంది.

Extra flights arranged to bring Indians from Qatar

ఎయిరిండియా అనుబంధ సంస్థ అయిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ జూన్ 25 నుంచీ జులై 8వ తేదీ వరకూ తిరువనంతపురం-దోహా, కొచ్చిన్‌-దోహాల మధ్య 186 సీట్ల విమానాలను నడుపుతుందని పౌరవిమానయానశాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.

కేంద్ర విదేశాంగ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ అదనపు విమానాల అవసరంపై ఇటీవల పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతి రాజుతో చర్చించిన నేపథ్యంలో ఈ అదనపు విమాన సర్వీసులను నడపాలని నిర్ణయించారు.

English summary
Additional flights will be flown from June 22 to bring Indian nationals in Qatar back to India, the Ministry of Civil Aviation said on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X