వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారం ఇవ్వండి,దేశంలో దారిద్య్ద్రులను లేకుండా చేస్తాం: అరుణ్ జైట్లీ

|
Google Oneindia TeluguNews

ఎన్నికల వేళ ప్రజలను ఆకట్టుకోవడానికి అధికార బీజేపీ తోపాటు కాంగ్రెస్ పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.దీంతో దేశ అభివృద్ది ,సంక్షేమం ఎవరి ప్రయత్నాలు వారు కోనసాగిస్తున్నారు.ఈనేపథ్యంలోనే బీజేపీ మరో సారి అధికారంలోకి వస్తే అసలు దారీద్ర్యమే లేకుండా చేస్తామని ఆశభావం వ్యక్తం చేస్తున్నారు.2031 నాటికి దారీద్ర్య రేఖ లేకుండా పోతుందని కేంద్రమంత్రి అరుణ్ జైట్లి ఫేస్ బుక్ లో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

భారత దేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోంది

భారత దేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోంది

అధికారం ఇవ్వండి అసలు దారిద్ర్య్ర రేఖ లేకుండా లేకుండా చేస్తామన్నారు ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లి. ప్రస్తుతం భారత దేశం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతుందని ,ఇదే వేగంతో కొనసాగితే రానున్న 2031 నాటికి అసలు దారిద్య్ర్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలు ఉండరని అయన చెప్పారు.

బీజేపీ చేపట్టిన అభివృద్దితో దారిద్య్ర రేఖ తొలగిపోనుంది

బీజేపీ చేపట్టిన అభివృద్దితో దారిద్య్ర రేఖ తొలగిపోనుంది

దేశంలోని 130 కోట్ల జనాభాలో సుమారు 21 శాతం ప్రజలు దారిద్య్ర్రరేఖకు దిగువున జీవిస్తున్నట్టు వరల్డ్ భ్యాంకు 2011 లొ అంచనా వేసిందని, అయితే బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులు, మౌలిక వసతుల కల్పన వల్ల దారిద్య్ర్రం తొలగిపోనుందని తెలిపారు. కాగా రానున్న మూడు సంవత్సరాల్లో దారిద్య్ర్ర రేఖకు దిగువన ఉన్న జనభా శాతం మొత్తం దేశ జనాభాలో 15 శాతానికి పడిపోతుందని ,ఈనేపథ్యంలోనే 2031 నాటికి దారిద్ర్ర్య రేఖకు దిగువన ఉన్నవారు ఉండరని దీంతో ఆ రేఖ పూర్తిగా తొలగిపోనుందని ఆరుణ్ జైట్లీ తెలిపారు.

పట్టణీకరణ నేపథ్యంలో ఉద్యోగాల కల్పన సవాల్ గా మారింది

పట్టణీకరణ నేపథ్యంలో ఉద్యోగాల కల్పన సవాల్ గా మారింది

ప్రస్థుతం పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో మధ్యతరగతి జనాభ కూడ విస్తరిస్తోందని తెలిపారు.అయితే వీరందరకీ ఉద్యోగవకాశాలు కల్పించడం పెద్ద సవాలుగా మారిందని అన్నారు.ఈనేఫథ్యంలోనే బీజేపీ ప్రభుత్వం చేపట్టిన మౌలిక వసతుల కల్పన పెద్ద ఎత్తున కల్పించనున్నామని ,దీంతో ఉద్యోగాల కల్పన కూడ పెద్ద ఎత్తున పెరుగుతుందని చెప్పారు. కాగా భారత్ ఎదుట జమ్ము ,కశ్మీర్ సమస్య పెద్ద సవాలుగా మారిందని కూడ ఆయన వ్యాఖ్యానించారు.అయితే పాకిస్థాన్ పట్ల మోదీ అనుసరిస్తున్న వైఖరి పట్ల ప్రజలు సానుభూతితో ఉన్నారని పేర్కోన్నారు. కాగా తన ఫేస్ బుక్ ద్వార తన అభిప్రాయాలను పంచుకున్నారు.

English summary
India's finance minister said,that fast economic growth and rapid urbanisation would slash the number of people in extreme poverty by 2021 and end it completely by 2031.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X