వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాకు చెక్: భారత్‌-జపాన్ మధ్య కీలక సైనిక ఒప్పందం - ‘ఇండో-పసిఫిక్’లో డ్రాగన్ ఆటకట్టించేలా..

|
Google Oneindia TeluguNews

విస్తరణవాద కాక్షతో పొరుగుదేశాలతో కయ్యానికి దిగుతూ ఇండో-పసిఫిక్ రీజియన్ లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోన్న చైనాకు చెక్ పెట్టేలా భారత్ పావులు కదుపుతున్నది. ఈ క్రమంలోనే తూర్పు ఆసియాలో బలమైన ఆర్థిక, సైనిక శక్తిగా కొనసాగుతోన్న జపాన్ తో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. చైనా తీరుతో జపాన్ సైతం విసిగిపోయిన ప్రస్తుత దశలో ఈ ఒప్పందం డ్రాగన్ ఆటకట్టించేందుకు తోడ్పడనుందని డిఫెన్స్ నిపుణులు చెబుతున్నారు.

Recommended Video

India - Japan : చైనాకు బుద్ధి చెప్పేలా.. Japan తో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్ ! || Oneindia

 ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్: సీరం సంచలన నిర్ణయం-భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ నిలిపివేత -డీసీజీఐ నోటీసులతో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్: సీరం సంచలన నిర్ణయం-భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ నిలిపివేత -డీసీజీఐ నోటీసులతో

మిలటరీ లాజిస్టిక్స్ ఒప్పందం

మిలటరీ లాజిస్టిక్స్ ఒప్పందం

భారత్, జపాన్ మధ్య ఇప్పటికే కొనసాగుతోన్న సంబంధాల్లో మరో ముదడుగులా.. రెండు దేశాల సైన్యాలు పరస్పర సహకరించుకోవాలని, జపాన్ ఆధీనంలోని సైనిక, నౌకా స్థావరాలను భారత్ వాడుకునేలా, అదే సమయంలో భారత్ ఆధీనంలోని రక్షణ స్థావరాలను జపాన్ వాడుకునేలా ఒప్పందం కుదిరింది. ఈ మేరకు గురువారం భారత్, జపాన్ ‘‘మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ట్ అగ్రిమెంట్(ఎంఎల్ఎస్ఏ)పై సంతకాలు చేశాయి.

చైనా విలవిల: బ్లాక్ టాప్ పేరు మార్పు - కైలాష్ రేంజ్‌పై భారత్ పట్టుతో ఫ్రస్ట్రేషన్ - తాజా ‘వార్'నింగ్చైనా విలవిల: బ్లాక్ టాప్ పేరు మార్పు - కైలాష్ రేంజ్‌పై భారత్ పట్టుతో ఫ్రస్ట్రేషన్ - తాజా ‘వార్'నింగ్

రక్షణ శాఖ ప్రకటన..

రక్షణ శాఖ ప్రకటన..

తాజా ఒప్పందంతో రెండు దేశాల సాయుధ దళాలు పరస్పర సహకారం, కలిసికట్టుగా సామర్ధ్యాన్ని పెంచుకోవడం, సైనిక స్థావరాను పరస్పరం ఉపయోగించుకునేలా ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి వీలు కల్పిస్తుందని భారత రక్షణ శాఖ గురువారం ప్రకటన చేసింది. భారత్ తరఫున రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, జపాన్ తరఫున ఆ దేశ రాయబారి సుజుకి సతోషి ఎంఎల్ఎస్ఏపై సంతకాలు చేసినట్లు ప్రకటనలో తెలిపారు. భారత్ ఇదివరకే అమెరికా, ఫ్రాన్స్, సౌత్ కొరియా, సింగపూర్, ఆస్ట్రేలియాలతోనూ సైనిక లాజిస్టిక్స్ ఒప్పందాలను కుదుర్చుకుంది.

చైనా కట్టడి చర్యలు ముమ్మరం..

చైనా కట్టడి చర్యలు ముమ్మరం..


జపాన్ తో కీలకమైన సైనిక లాజిస్టిక్ ఒప్పందం కుదుర్చుకోవడానికి కొద్ది గంటల ముందు.. ఇండో-పసిఫిక్ రీజియన్ లో పరస్పరం సహకరించుకుకోవాలని భారత్-ఫ్రాన్స్-ఆస్ట్రేలియాలు అంగీకారానికి వచ్చాయి. ఇండో-పసిఫిక్ రీజయిన్ లో చైనా దూకుడు పెంచుతున్న తరుణంలో ఈ మూడు దేశాలు ఒక్కతాటిపైకి రావడాన్ని చరిత్రాత్మక మలుపుగా పరిశీలకులు భావిస్తున్నారు. పసిఫిక్, హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం కోసం కొన్నేళ్లుగా తపిస్తోన్న చైనా.. పాకిస్తాన్ లోని గ్వాదర్ పోర్టు, శ్రీలంకలోని హంబన్ తోటా పోర్టులను ఇప్పటికే కైవసం చేసుకుంది. తాజాగా కాంబోడియా, వనౌతు దేశాలతోనూ మారిటైమ్ ఒప్పందాలకు సిద్ధమైంది. గడిచిన ఆరేళ్లలో చైనా కొత్తగా 80 యుద్ధ నౌకల్ని తయారుచేసింది. ఇండో-పసిఫిక్ రీజియన్ లో చైనా యుద్ధ నౌకలు, సబ్ మెరైన్ల సంచారం మిగతా దేశాల భద్రతకు సవాలుగా మారింది. ఇక చైనాను ఉపేక్షించబోరాదని అన్ని దేశాలూ ఒక్కతాటిపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో భారత్ కీలక పాత్ర పోషిస్తున్నది.

చైనా దౌర్జన్యంపై జపాన్ ఫైర్

చైనా దౌర్జన్యంపై జపాన్ ఫైర్

పొరుగుదేశాలతో కయ్యం తప్ప స్నేహం ఎరుగని చైనా.. ఇటీవల కాలంలో జపాన్‌కు చెందిన సుక్కోవిచ్ దీవులను ఆక్రమించుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన జపాన్.. చైనాలోని తన కంపెనీలను తరలించేందుకు సిద్ధమైంది. జపాన్ తన కంపెనీలను భారత్ కు తరలించాలని నిర్ణయించడం చైనాకు పుండుమీద కారం చల్లినట్లయింది. జపాన్ కు చెందిన 221 మిలియన్ డాలర్ల విలువగల ఐటీ, ఇతర కంపెనీలు త్వరలోనే భారత్ కు రానున్నాయి. కంపెనీల తరలింపుపై గుర్రుగా ఉన్న చైనాకు తాజాగా మరో షాకిస్తూ జపాన్- భారత్ లు సైనిక లాజిస్టిక్ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

English summary
India and Japan have signed an agreement that will provide their militaries access to each other's bases for supplies and services, the Indian defence ministry said in a statement on Thursday. The two countries have built close defence ties in recent years, which analysts say are part of efforts to counter the growing weight of China across the region. India has signed similar agreements with the US, France, South Korea, Singapore and Australia earlier. This will add pressure on China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X