వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశం ఆశగా! నేడే కేంద్ర బడ్జెట్: కీలకమైన వీటిపైనే జైట్లీ ప్రధాన దృష్టి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశమంతా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం ఎదురుచూస్తోంది. తమకెలాంటి ప్రజయోజనం ఉంటుందోనని ఆశగా చూస్తున్నారు దేశ జనం. ఈ నేపథ్యంలో, 2019లో కూడా అధికారంలోకి రావాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీకి ఈ బడ్జెట్‌ ఎంతో కీలకమైందనే చెప్పవచ్చు. ఇది కచ్చితంగా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకొనేలా ఉండాలి. లేదంటే వచ్చే ఎన్నికల్లో ఈ బడ్జెట్ ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

ఈ నేపథ్యంలో జీఎస్టీ, పెద్దనోట్ల రద్దుతో తగ్గిన వృద్ధి రేటును పరుగులు పెట్టించేలా ఈ బడ్జెట్ ఉండొచ్చనీ విశ్లేషకులు భావిస్తున్నారు. గురువారం(ఫిబ్రవరి 1న) ప్రవేశపెట్టబోయే 2018-19 బడ్జెట్‌కు ఇప్పటికే ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. వివిధ రంగాల్లోని ప్రముఖుల అభిప్రాయాలు, బడ్జెట్‌ తీరుతెన్నులకు సంబంధించి వెలిబుచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు... ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రధానంగా ఐదు రంగాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వ్యవసాయం-గ్రామీణం

వ్యవసాయం-గ్రామీణం

గ్రామీణ ప్రాంతాల మీద బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం ఉందని ఇప్పటికే చాలా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వరదలు, కరవుతో అల్లాడుతున్న రైతుల మీద దృష్టి సారించకపోతే రాబోయే ఎన్నికల ఫలితాల మీద ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. అందుకే అన్నదాతను ఆదుకునే దిశగా కచ్చితంగా కొంత కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. రైతుల మేలు చేసే విధంగా ఈ బడ్జెట్‌ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విత్తనాలు, ఫెర్టిలైజర్స్ కొనుగోలు విషయంలో రైతుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.

మౌలిక సదుపాయాల రంగం..

మౌలిక సదుపాయాల రంగం..


కాగా, ఈసారి బడ్జెట్లో ఎక్కువ మొత్తం మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ గార్గ్‌దీ ఇదే అభిప్రాయం. ఈ రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమూ ప్రభుత్వ లక్ష్యం. ఇప్పటికే నౌకాశ్రయాలూ, రహదారుల అభివద్ధికై పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తున్నాయని ఆర్థిక మంత్రి పేర్కొనడం గమనార్హం. ముఖ్యంగా రైల్వే రంగానికే నిధుల అవసరం ఎక్కువగా ఉంది. రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ, బుల్లెట్ రైళ్ల కోసం నిధులు కేటాయించాల్సి ఉంది. లేదా రైల్వేలు సొంత ఆదాయ వనరుల్ని అన్వేషించి, సమకూర్చుకునేలా ప్రోత్సాహం అందిస్తారు. నిర్మాణ రంగానికి తగిన ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ రంగాలపై జీఎస్టీ ప్రభావంపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

బ్యాంకుల బలోపేతం

బ్యాంకుల బలోపేతం

నిరర్ధక ఆస్తులు ప్రస్తుతం బ్యాంకుల పాలిట గండంగా మారాయి. వాటిని ఆదుకోవడానికి 2.11 లక్షల కోట్లు కేటాయిస్తామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. వాటిలో 76 వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌ కేటాయింపులు, బాండ్ల ద్వారా సమకూర్చనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తనకున్న మూడు లక్ష్యాల్లో బ్యాంకులను బలోపేతం చేయడమూ ఒకటని జైట్లీ ఓ సందర్భంలో తెలిపారు.

ఉపాధి కల్పన

ఉపాధి కల్పన

ఉద్యోగాల కల్పన కూడా బడ్జెట్‌లో కీలకపాత్ర పోషించనుంది. అత్యధికంగా మానవ వనరులున్న దేశంగా భారత్‌కు ఇప్పటికే పేరుంది. వారందరికీ ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి కత్తి మీద సామే. ఈ సమస్యకు పరిష్కారంగా జాతీయ ఉపాధి విధానాన్ని వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అంశాన్ని కూడా ఈ బడ్జెట్ ప్రధానంగా పరిగణించాల్సి ఉంది.

కార్పొరేట్ రంగం-పన్నులు

కార్పొరేట్ రంగం-పన్నులు

జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది తొలి బడ్జెట్ కావడం గమనార్హం. కాగా, వచ్చే నాలుగేళ్లలో కార్పొరేట్ పన్నును 30 నుంచి 25 శాతానికి తగ్గిస్తామని 2015లో జైట్లీ ప్రకటించారు. ఇప్పటికే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. అందులోనూ ఇది పూర్తిగా ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్‌. బడ్జెట్‌ కు ముందు జరిగే వ్యాపార వేత్తల సమావేశంలో వారు జైట్లీకి ఆ హామీని గుర్తుచేశారు. అందువల్ల కార్పొరేట్‌ పన్ను రేటు తగ్గింపుపై ప్రకటన ఉండే అవకాశం ఉంది. నగల వ్యాపార రంగం, ఈ కామర్స్ రంగంపైనా దృష్టి సారించే అవకాశం ఉంది. ఈ రంగాలకు పన్నుల నుంచి కొంత ఉపశమనం కల్పించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆదాయపు పన్ను పరిమితిని పెంచే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గత బడ్జెట్‌లో పరిమితిని అంతగా పెంచని విషయం తెలిసిందే.

English summary
The countdown for the Union Budget 2018-19 has begun. All eyes are set on what will come out of Finance Minister Arun Jaitley’s kitty on Thursday. It is the last full-time budget by the NDA government before the Lok Sabha elections scheduled next year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X