బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏరో ఇండియా 2021: తొలిసారి ఎఫ్-15ఈఎక్స్ ఫైటర్ జెట్ ప్రదర్శన(వీడియో)

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఏరో ఇండియా 2021 సందర్భంగా బెంగళూరులో బుధవారం ఎఫ్ -15 ఎక్స్ ఫైటర్ జెట్ ప్రదర్శించబడింది. ఆ తర్వాత ఈ చారిత్రక ప్రదర్శనలో తొలిసారి ఫైటర్ జెట్ గగనతలంలో ఇక్కడ ప్రయాణం చేసింది. భారతదేశం, యునైటెడ్ స్టేట్స్(అమెరికా) వైమానిక దళాలు చర్చలు జరిపి, ఎఫ్ -15 ఎక్స్ ఫైటర్ జెట్ల గురించి సమాచారాన్ని మార్పిడి చేసుకున్నాయి.

'ఎఫ్15ఈఎక్స్ దాని చారిత్రాత్మక మొదటి విమానం గగనతంలోకి ఎగిరింది. దాన్ని చూడండి. ఎఫ్-15ఈఎక్స్ ఒక డిజిటల్ థ్రెడ్‌పై నిర్మించబడింది, ఇది భవిష్యత్తులో టెక్, యూఎస్ ఎయిర్‌ఫోర్స్ కోసం సామర్థ్యాన్ని పొందుపరచడానికి ఒక టెస్ట్‌బెడ్‌గా ఉపయోగపడుతుంది' అని బోయింగ్ ఒక ట్వీట్ పోస్ట్‌లో పేర్కొంది.

 F-15EX takes first flight during Aero India 2021

భారతీయ వైమానిక దళం (ఐఎఎఫ్)కు ప్రధానమైన అదనంగా బోయింగ్ విమానం చేరనుందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఐఎఎఫ్‌కు యుద్ధ విమానాలను అందించడానికి యుఎస్ ప్రభుత్వం నుంచి అనుమతి పొందినట్లు తెలిపారు.

వార్తా సంస్థ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్లోబల్ సేల్స్ అండ్ మార్కెటింగ్, బోయింగ్ డిఫెన్స్, స్పేస్, సెక్యూరిటీ, బోయింగ్ గ్లోబల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ జెఫ్ షాకీతోపాటు బోయింగ్ ఇంటర్నేషనల్ సేల్స్, ఇండస్ట్రియల్ పార్టనర్‌షిప్ వైస్ ప్రెసిడెంట్, హెచ్ లైన్ మాట్లాడారు. ఇరుదేశాల ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి, రెండు వైమానిక దళాలు ఎఫ్ -15 ఎక్స్ గురించి సమాచారాన్ని మార్పిడి చేసుకున్నాయని తెలిపారు.

ఎఫ్ -15 ఎక్స్ ఫైటర్ జెట్లను భారతదేశానికి అందించడానికి అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపిన తరువాత వారు మరిన్ని చర్చలు ప్రారంభించారని పిటిఐ ఉటంకించింది. భారత్‌, అమెరికాల పరస్పర సుదీర్ఘ ప్రయోజనాల కోసం యూఎస్ ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. ఎఫ్-15 ఎక్స్ ఫైటర్ జెట్ల ధర, సామర్థం గురించి అమెరికాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు.

2020 జూలైలో యుఎస్ వైమానిక దళం బోయింగ్‌కు నిరవధిక-డెలివరీ / నిరవధిక-పరిమాణ ఒప్పందాన్ని 23 బిలియన్ డాలర్ల సీలింగ్ విలువతో ఇచ్చిందని లైన్ చెప్పారు. కాగా, ఎఫ్-15ఈఎక్స్ అనేది మల్టీ-రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని గమనించాలి. ఇది ఎఫ్-15 ఎయిర్ క్రాఫ్ట్ గ్రూప్ నకు చెందిన తాజా, అత్యంత అధునాతన వెర్షన్. ఎఫ్ -15 విమానం బహుళ పాత్ర పోషించగలదు. ఆల్-వెదర్, డే అండ్ నైట్ వెర్షన్లకు ఇది ప్రసిద్ది.

English summary
The F-15EX fighter jet was exhibited in Bengaluru during the Aero India 2021, where it took its historic first flight on Wednesday (February 3). The air forces of India and the United States held a discussion and exchanged information about the F-15EX fighter jets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X