వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక విమానాల్లో మాస్క్ మ్యాండెటరీ.. డీజీసీఏ ఆదేశాలు, రీజన్ ఇదే

|
Google Oneindia TeluguNews

కరోనా కేసులు మెల్లిగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా బూస్టర్ డోసు వేసుకొనివారిపై ప్రభావం చూపుతుంది. అయితే ఏవియేషన్ రెగ్యులేటరీ అథారిటీ.. డీజీసీఏ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విమానాల్లో మాస్క్ మ్యాండెటరి చేసింది. విమానయాన సంస్థలు ప్రయాణికులు.. కరోనా నిబంధనలను పాటించాలని సూచించింది.

ప్రయాణికులు విధిగా మాస్క్ ధరించాలని స్పస్టంచేసింది. ఎయిర్ పోర్టు వచ్చినప్పటి నుంచి నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ప్లాట్ ఫామ్ మీద కూడా అలానే రూల్స్ వర్తిస్తాయని స్పష్టంచేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని విమానయాన సంస్థలకు డీజీసీఏ హెచ్చరికలు జారీచేసింది.

Face masks mandatory on flights: Aviation regulator

ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి కరోనా కేసులు వంద శాతం పెరిగాయి. శనివారం నుంచి రోజుకు ఐదుగురు.. కరోనా బారినపడి సమస్యలతో చనిపోతున్నారు. ఢిల్లీలో గత 15 రోజుల్లో ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య రెండు రెట్లు పెరిగింది.

1వ తేదీ నుంచి ఆస్పత్రిలో చేరిన వారి వివరాలను పరిశీలిస్తే.. 307 నుంచి 588కి పెరిగాయి. 205 మంది ఆక్సిజన్ సపోర్ట్ తీసుకున్నారు. 22 మంది వెంటిలేటర్ సపోర్ట్‌తో ఉన్నారు. ఐసీయూలో చేరిన వారి సంఖ్య 98 నుంచి 16వ తేదీ వరకు 202కి చేరింది. ఇటు ముంబైలో కూడా క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. 14వ తేదీ వరకు 882 కేసులు చేరుకున్నాయి.

English summary
commercial airlines have been advised by DGCA to comply with stringent coronavirus protocols inside aircraft.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X