వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌ను బీజేపీ కంట్రోల్ చేస్తోందన్న రాహుల్... రవిశంకర్ ప్రసాద్ కౌంటర్ ఏంటో తెలుసా...?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: భారత్‌లో ఫేస్‌బుక్ మరియు వాట్సాప్‌లాంటి సోషల్ మీడియాను బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌లు తమ గుప్పిట్లో ఉంచుకుని నడుపుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా దేశంలో దుష్ప్రచారాలతో పాటు విద్వేషాలను రెచ్చగొడుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అయితే చివరకు అమెరికా మీడియా ఫేస్‌బుక్ నిజనిజాలను బయటపెట్టిందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

రాహుల్ గాంధీ ఆరోపణలకు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ అనలిటికా మరియు ఫేస్‌బుక్‌లతో గోప్యంగా ఉంచాల్సిన డేటాను ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికింది కాంగ్రెస్ అని ఆ విషయం గురించి రాహుల్ ఎందుకు మాట్లాడరని రవిశంకర్ ప్రసాద్ ఫైర్ అయ్యారు. చేయాల్సిందంతా కాంగ్రెస్ చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు బీజేపీకి ఆ పాపాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. సొంతపార్టీ పైనే నియంత్రణ లేనివారు... మొత్తం ప్రపంచాన్నే బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌లు కంట్రోల్ చేస్తున్నాయనే నిందలు వేయడం సహజమే అని కౌంటర్ ఇచ్చారు రవిశంకర్ ప్రసాద్.

Facebook and whatsapp controlled by BJP and RSS says Rahul, Ravishankar Prasad Slams congress

సమాచారం,భావవ్యక్తీకరణ అనే రెండు అంశాలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రోజు ఉన్నాయని చెప్పిన రవిశంకర్ ప్రసాద్... ఒకప్పుడు వీటిని ఒకే కుటుంబం కంట్రోల్ చేసేదని పరోక్షంగా గాంధీ కుటుంబంను ఉద్దేశించి అన్నారు. ఇక ఆ కుటుంబం గుప్పిట్లో ఏదీ లేదు కాబట్టే వారు ఆందోళన చెందుతూ ఇలాంటి తప్పుడు ప్రచారాలను బీజేపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. ఇవన్నీ మాట్లాడే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ బెంగళూరు అల్లర్లను ఇప్పటి వరకు ఎందుకు ఖండించలేదో చెప్పాలని రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. బెంగళూరు అల్లర్లను ఖండించే ధైర్యం లేకుండా పోయిందా అని ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.

అంతకుముందు రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాల్వాన్ లోయలో 20 మంది భారత జవాన్ల మృతి, ఆ ప్రాంతంలో చైనా ఆక్రమణ అంశాలను గుర్తుచేస్తూ ప్రధాని మోదీపై రాహుల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ''మన సైనికుల వీరత్వంపై ప్రతి ఒక్కరికీ నమ్మకం ఉంది. ఒక్క ప్రధాని మోదీకి తప్ప. ఆయన పిరికి తనం కారణంగానే చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకుంది. అదే డ్రాగన్ దేశానికి బలంగా మారింది'' అని కాంగ్రెస్ నేత ఆరోపించారు.

English summary
Congress MP Rahul Gandhi on Sunday alleged that the BJP and the RSS control Facebook and Whatsapp in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X