వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

19 ఏళ్ల టీనేజ్ ఎథిక‌ల్ హ్యాక‌ర్‌: జుక‌ర్‌బ‌ర్గ్ కంట్లో ప‌డ్డాడు..న‌గ‌దు గెలుచుకున్నాడు!

|
Google Oneindia TeluguNews

తిరువ‌నంత‌పురం: సామ‌జిక మాధ్యమ దిగ్గ‌జం ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌లో ఓ సాంకేతిక లోపాన్ని గుర్తించాడో మ‌లయాళీ టీనేజ్ కుర్రాడు. అత‌ని పేరు కేఎస్ అనంత కృష్ణ‌న్‌. వ‌య‌స్సు 19 సంవ‌త్స‌రాలు. కేర‌ళ‌లోని ప‌థ్థినంతిట్టలో ఇంజినీరింగ్ చ‌దువుతున్నాడు. ఎథిక‌ల్ హ్యాకింగ్‌పై అత‌ను ప‌రిశోధ‌న‌లు చేస్తున్నాడు.

ఫేస్‌బుక్ గ్రూప్‌కు చెందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్స‌ప్‌లో బ‌గ్‌ను క‌నిపెట్టాడు. దాన్ని ఎలా తొల‌గించాలో కూడా వివ‌రిస్తూ.. ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌కు వివ‌రిస్తూ ఓ లేఖ రాశాడు. దీనిపై రెండు నెల‌ల పాటు ప‌రిశోధ‌న‌లు చేసిన ఫేస్‌బుక్ యాజ‌మాన్యం ఆ బ‌గ్ ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌దో గుర్తించింది. ఆ కుర్రాడి ప్ర‌తిభ‌ను గుర్తిస్తూ న‌గ‌దు బ‌హుమ‌తిని ప్ర‌క‌టించింది. హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చింది.

Facebook honours Kerala boy for fixing bug in WhatsApp

వాట్స‌ప్‌లో కొన్ని ర‌కాల ఫైళ్లు, ఇత‌ర సమాచారాన్ని యూజ‌ర్ల‌కు తెలియ‌కుండా ఇతరులు డిలేట్ చేయ‌డానికి అవ‌కాశం ఇచ్చే బ‌గ్‌ను అనంత కృష్ణ‌న్ గుర్తించాడు. దీని గురించి ఫేస్‌బుక్ యాజ‌మాన్యానికి సమాచారం ఇచ్చాడు. ఈ బగ్ తొల‌గించ‌డానికి, ఆ సమ‌స్య‌నున పరిష్కారించ‌డానికి గ‌ల‌ మార్గాన్ని కూడా వివరించాడు. దీనిపై ఫేస్‌బుక్ యాజ‌మాన్యం రెండు నెల‌ల పాటు అధ్య‌య‌నం చేసింది. బ‌గ్ ఉన్న విష‌యాన్ని నిర్ధారించింది.

అనంత కృష్ణ‌న్ ఇచ్చిన స‌మాచారాన్ని స‌మ‌ర్థించింది. అత‌నికి 500 డాల‌ర్ల న‌గ‌దు బ‌హుమ‌తిని ప్ర‌క‌టించింది. ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చింది. త‌న ఇచ్చిన స‌మాచారం ప‌ట్ల అధ్య‌య‌నం చేసినందుకు అనంత కృష్ణన్‌ కూడా ఫేస్‌బుక్ యాజ‌మాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు.

English summary
Social media giant Facebook has honoured a Kerala student for fixing a serious error in instant messaging app WhatsApp. The student has been identified as KS Ananthakrishna, 19, a B.Tech student at Pathanamthitta Mount Zion College of Engineering College. Ananthakrishna had found a bug two months ago in WhatsApp. The bug allowed other persons to completely remove files on the messaging app without knowledge of the user.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X