• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

facebook: లవ్+ఎంజాయ్+పిల్లలు= వాట్సాప్ లో మూడుసార్లు విడాకులు, ఆంటీ ఎఫెక్ట్, కేటుగాడు !

|

లక్నో/ చెన్నై: సోషల్ మీడియాలో చరుకుగా ఉంటున్న కేటుగాడు ఫేస్ బుక్ లో ఓ అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. కొన్ని నెలల పాటు ఆమెతో చాటింగ్ చేసిన కిలాడీ ఆమెను ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు. తరువాత ప్రేమ, పెళ్లి పేరుతో ఆమెతో ఎంజాయ్ చేశాడు. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడని అతన్ని గుడ్డిగా నమ్మిన ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. అంతే రసగుల్లా లాంటి ఆంటీ మోజులో పడిన భర్త ఆమెకు నరకం చూపించాడు. ఇద్దరు పిల్లలను లాక్కొన్న భర్త భార్యను మెడపట్టి బయటకు గెంటేశాడు. ప్రేమ, సెక్స్, పెళ్లి తరువాత మూడుసార్లు వాట్సాప్ లో విడాకులు ఇచ్చేసిన భర్త వేరే మహిళ మోజులో ఎంజాయ్ చేస్తున్నాడు. తనకు న్యాయం చెయ్యాలని ఆ అమ్మాయి ఇప్పుడు పోలీస్ స్టేషన్, పోలీసు అధికారుల చుట్టూ తిరుగుతూ తనకు న్యాయం చెయ్యాలని వేడుకోవడంతో స్థానికులు చలించిపోతున్నారు.

Illegal affair: భార్య కంత్రి, ఇల్లు, ఏరియానే మార్చేశాడు, భార్య ఆది మాత్రం ?, టిక్కెట్ రిజర్వ్!Illegal affair: భార్య కంత్రి, ఇల్లు, ఏరియానే మార్చేశాడు, భార్య ఆది మాత్రం ?, టిక్కెట్ రిజర్వ్!

సోషల్ మీడియా పిచ్చోడు

సోషల్ మీడియా పిచ్చోడు


ఉత్తరప్రదేశ్ లోని యువకులకు అతి తెలివితేటలు చాలా ఎక్కువే అనే విషయం మరోసారి వెలుగు చూసింది. అక్కడి యువకులకు కొవ్వుతో పాటు కిలాడీ తెలివితేటలు ఎక్కువే. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ జిల్లాలోని షికార్ పూర్ ప్రాంతానికి చెందిన రియాజ్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటున్నాడు. నిత్యం స్మార్ట్ ఫోన్ చేతిలో పట్టుకుని సోషల్ మీడియాలో స్నేహితులు, అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ కాలం గడిపేవాడు.

 ఫేస్ బుక్ లవ్ స్టోరి

ఫేస్ బుక్ లవ్ స్టోరి

ఆరు సంవత్సరాల క్రితం రియాజ్ కు చత్తిస్ ఘడ్ కు చెందిన స్వప్నా అలియాస్ హసీనా (పేరు మార్చడం జరిగింది) అనే అమ్మాయి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. అప్పటి నుంచి ఇద్దరూ చాటింగ్ చేసుకుంటూ నాలుగు నెలల తరువాత ప్రేమలో పడ్డారు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని రియాజ్ నమ్మించడంతో అమాయకురాలు హసీనా అతన్ని గుడ్డిగా నమ్మేసింది.

సెక్స్..... సీక్రెట్ గా తూతూ పెళ్లి

సెక్స్..... సీక్రెట్ గా తూతూ పెళ్లి

రియాజ్ ను గుడ్డిగా నమ్మేసిన హసీనా చత్తిస్ ఘడ్ నుంచి ఉత్తరప్రదేశ్ లో ప్రియుడు ఉంటున్న షికార్ పూర్ వెళ్లిపోయింది. ప్రియురాలు హసీనాను రహస్యంగా పెళ్లి చేసుకున్న రియాజ్ ఆమెతో ఎంజాయ్ చేస్తూ కాలం గడిపేశాడు. రియాజ్, హసీనాకు ఇద్దరు పిల్లలు పుట్టారు. తన సంసారం సాఫీగా సాగిపోతుందని కలలుకంటున్న హసీనా జీవితం ఒక్కసారిగా రివర్స్ అయ్యింది.

ఆంటీ అదిరిందని తగులుకున్నాడు

ఆంటీ అదిరిందని తగులుకున్నాడు


ఇంతకాలం స్వప్నాతో ఎంజాయ్ చేసిన రియాజ్ గత ఏడాది ఓ వివాహిత మహిళను తగులుకున్నాడు. ఆంటీ అదిరిపోయిందని, ఇక తన పెళ్లాంతో పని ఏముంది అనుకున్న రియాజ్ హసీనాను చిత్రహింసలకు గురి చేశాడు. ఇద్దరు పిల్లలను లాక్కొన్న రియాజ్ తన భార్య అని ఇంతకాలం చూసుకున్న హసీనాను తన్ని ఇంటి నుంచి బయటకు తరిమేశాడు.

ఫేస్ బుక్ ప్రేమ+ సెక్స్+ కాపురం = వాట్సాప్ లో విడాకులు

ఫేస్ బుక్ ప్రేమ+ సెక్స్+ కాపురం = వాట్సాప్ లో విడాకులు

ఫేస్ బుక్ లో పరిచయం అయిన హసీనాతో ఇంతకాలం సెక్స్ చేశానని, ఇప్పుడు ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి అయిపోందని, ఇప్పుడు నాకు మంచి రసగుల్లా లాంటి ఆంటీ చిక్కిందని రియాజ్ కలలు కన్నాడు. ఇక తనకు హసీనాతో ఏం పనిలేదని డిసైడ్ అయిన రియాజ్ ఆమెకు వాట్సాప్ లో విడాకులు ఇచ్చేశాడు. ఇదేమిటని హసీనా ప్రశ్నిస్తే రియాజ్ మరో మూడుసార్లు హసీనాకు వాట్సాప్ లోనే విడాకులు ఇచ్చేసి నీకునాకు కట్ అని తేల్చి చెప్పి చేతులు దులుపేసుకున్నాడు.

చేతులు ఎత్తేసిన పోలీసులు

చేతులు ఎత్తేసిన పోలీసులు

ఇంతకాలం రియాజ్ తాను కలిసి తిరిగిన సమయంలో, పిల్లలతో కలిసి తీసుకున్న ఫోటోలతో షికారిపూర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన హసీనా తనకు న్యాయం చెయ్యాలని పోలీసులను ఆశ్రయించింది. ఇప్పుడు చాలా రోజుల నుంచి హసీనా షికార్ పూర్ పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. అయితే పోలీసులు ఒకసారి కౌన్సిలింగ్ కేంద్రానికి పంపించిన తరువాత నువ్వు కోర్టు వెళ్లాలని హసీనాకు ఉచిత సలహా ఇచ్చేశారు.

నాకు నా పిల్లలు కావాలి

నాకు నా పిల్లలు కావాలి


తన పిల్లలను తనకు అప్పగించాలని, తన భర్త రియాజ్ ను తన దగ్గరకు పంపిచాలని విలపిస్తూ ఇప్పుడు పోలీసుల చుట్టూ తిరుగుతున్న హసీనా ఇప్పుడు కోర్టును ఆశ్రయించాలని ఆలోచిస్తోంది. ఊరికాని ఊర్లో ఉంటున్న హసీనా తనకు న్యాయం చెయ్యాలని కనపడిన ప్రతిఒక్కరిని వేడుకుంటుంటే భార్యను తన్ని తరిమేసిన రియాజ్ మాత్రం ఆంటీ మోజులో తనను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరని జల్సాగా తిరుగుతున్నాడు.

English summary
Facebook love story: Three divorce cases have come to light after love, sex, deception near Bulandshahr in Uttar Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X